Begin typing your search above and press return to search.

ఢిల్లీ కాలుష్యం... ఏపీ ఎయిర్ క్వాలిటీ మీద ఫోకస్

ఏపీలో ఎయిర్ క్వాలిటీని అన్ని కోణాల్లో విశ్లేషించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఎయిర్ క్వాలిటీ సిస్టం మానిటరింగ్ కోసం లేటేస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు.

By:  Satya P   |   25 Nov 2025 12:44 AM IST
ఢిల్లీ కాలుష్యం... ఏపీ ఎయిర్ క్వాలిటీ మీద ఫోకస్
X

మనిషికి కావాల్సింది ప్రాణ వాయువు. అది కాస్తా విష తుల్యమయితే జీవించేది ఎలా అన్నదే కదా అందరి చింత. ఢిల్లీలో చూస్తూటే గాలిలో కాలుష్యం దారుణంగా పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే చాలు నరకమే చూస్తున్నారు. దీంతో ఢిల్లీ ఇపుడు ఒక కేస్ స్టడీగా మారింది. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గితే వేరే చోటకు వెళ్ళమంటున్నారు. మరి దేశంలో అంతటా అదే రకమైన పరిస్థితి ఉంటే ఎలా అన్నది కూడా మేధావుల మాట. అందువల్ల ఇప్పటి నుంచే మేలుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు.

బాబు ఆదేశం :

చంద్రబాబు ఏపీలో కాలుష్యం మీద పూర్తి ఫోకస్ పెట్టారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. గాలి, నీరు, ఇండస్ట్రియల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. దీని కోసం పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే ఆయా సంస్థలు వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

గాలి నాణ్యత విశ్లేషించాలి :

ఏపీలో ఎయిర్ క్వాలిటీని అన్ని కోణాల్లో విశ్లేషించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఎయిర్ క్వాలిటీ సిస్టం మానిటరింగ్ కోసం లేటేస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. ఆ డేటాను అవేర్ – 2.0కు లింక్ చేయాలని, దీన్ని అవేర్-2.0 వ్యవస్థకు అనుసంధానం చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు అన్నింటినీ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మైనింగ్ పొలూష్యన్ విషయంలోనూ ఫోకస్ పెట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కాలుష్యాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుంటామని బాబు స్ప్ష్టం చేశారు. మైక్రో ఇరిగేషన్‌లోనూ పంటపొలాల్లో ప్లాస్టిక్ షీట్స్ వినియోగం వల్ల దీర్ఘ కాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీని కోసం బయో షీట్స్ వేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు. అలాగే, . పొల్యూషన్ కంట్రోల్, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలని అన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.

ప్లాస్టి ముప్పు తొలగించాలి :

అదే విధంగా ఏపీలో ప్లాస్టిక్ వ్యర్ధాలను డిస్పోజ్ చేసేందుకు త్వరలో విధాన నిర్ణయం అమలు చేస్తామమి ముఖ్యమంత్రి ప్రకటించారు. సర్కులర్ ఎకానమీ విధానాలను ప్రమోట్ చేయాలని అన్నారు. ఇక మీదట అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేలా చూస్తామని అన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మీద చూస్తే ఏపీలో వాయు కాలుష్యం మీద ప్రభుత్వం ఇపుడు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. ఢిల్లీ అనుభవాలు తలెత్తకుండా తగిన కార్యాచరణతో ముందుకు సాగుతోంది.