Begin typing your search above and press return to search.

బాబు అభిమానికి జీవిత కాలం సరిపడా గిఫ్ట్ !

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

By:  Satya P   |   9 Jun 2026 1:46 AM IST
బాబు అభిమానికి జీవిత కాలం సరిపడా గిఫ్ట్ !
X

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారంతా బాబు పేరు చెబితే ఎంతో ఎమోషన్ అవుతారు. దూరం నుంచి బాబుని చూడాలని విక్టరీ సింబల్ చూపించి ఆయన కళ్లలో పడాలని తపిస్తారు. అంతే కాదు బాబుగారూ అంటూ ఎక్కడ నుంచో పిలిచి ఆయన తమ వైపు చూసేలా చేయాలని కూడా విశ్వ ప్రయత్నం చేస్తారు. బాబు జిల్లాల టూర్లకు వెళ్ళినపుడు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. అలాగే పశ్చిమ గోదావారి సిద్ధాంతంలో ఒక అరవీర భయంకరమైన అభిమాని చంద్రబాబుకు ఉన్నారు. ఆయన పేరు సత్యనారాయణ. బాబును అలా ఎక్కడో దూరం నుంచి చూస్తే చాలు తన జన్మ ధన్యం అయినట్లుగా సత్యనారాయణ భావిస్తారు. ఎనభై ఏళ్ళ వయసు ఉన్న సత్యనారాయణ బాబు కోసం ఈ ఏజ్ లో కూడా సైకిల్ సవారీ చేసి మరీ ఆయన సభా ప్రాంగణాన్ని చేరుకోవడానికి ఉత్సాహం చూపించారు అంటే షాక్ తినాల్సిందే. ఇక సత్యనారాయణ బాబును ఎలాగైనా చూడాలని వ్యక్తం చేసిన కోరికను సోషల్ మీడియా ద్వారా చూసిన చంద్రబాబు తప్పకుండా కలుసుకుందాం సత్యనారాయణ గారు అని ట్వీట్ చేసారు. అన్నట్లుగానే ఆయన సిద్ధాంతంలో తన వీరాభిమానిని తన వద్దకు రప్పించుకుని ఆయన జీవిత కాలానికి సరిపడా మధురమైన అనుభూతిని అందించారు.

బాబు హగ్ తో హ్యాపీ :

ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న అభిమాని కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువు లంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు చంద్రబాబుకు వీరాభిమానిగా స్థానికంగా పేరు గడించారు. ఇక తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి నేరుగా చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో సోమవారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన చంద్రబాబు ఆ కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలుపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

భరోసా ఇచ్చిన బాబు :

ఇదిలా ఉంటే నేరుగా ముఖ్యమంత్రి తన వద్దకు అభిమానిని పిలిపించుకోవడంతో సత్యనారాయణ ఎంతగానో మురిసిపోయారు. తన కుటుంబం వివరాలు కూడా బాబుతో చెప్పుకున్నారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని కూడా సామాజిక బాధ్యతగా ఊరి గురించి కూడా ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో తన అభిమాని కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చిన బాబు సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆ కలెక్టర్‌ను అక్కడిక్కడే ఆదేశించారు. ఇదిలా ఉండగా బాబు ఇంతలా తన అభిమాని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి భరోసా ఇవ్వడంతో బాబు అభిమానులు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సత్యనారాయణ విషయం అంతే వేరే లెవెల్. జీవితకాలం సరిపడా బాబు ఒక మంచి బహుమతి ఇచ్చారని అంటున్నారు.