Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలి పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనం.... ఏపీలో ఆవిష్కరణ !

ఏపీలో మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆవిష్కరణ జరగనుంది. ఇది తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనంగా వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.

By:  Satya P   |   24 Aug 2026 9:21 AM IST
దేశంలోనే  తొలి పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనం.... ఏపీలో ఆవిష్కరణ !
X

ఏపీలో మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆవిష్కరణ జరగనుంది. ఇది తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనంగా వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీకి సోమవారం వస్తున్న ఉపరాష్ట్రపతితో సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సరికొత్త వంగడాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో రైతుల పంటకు విలువ జోడించి ప్రాసెసింగ్ బ్రాండింగ్‌తో మార్కెట్‌కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగానికి ఏలూరు జిల్లా ముసునూరు వేదిక కానుంది. అంతే కాదు దేశంలోనే తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించడం విశేషం.

వ్యాపార వంగడంగా :

ఏలూరు జిల్లా జిల్లా ముసునూరులో గోర్మే పాప్‌ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని ఈ విధంగా ఆవిష్కరించనున్నారు. గోర్మే పాప్‌కార్నికా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల ఎకరాలలో పాప్‌కార్న్ మెయిజ్ సాగుతో వేలాది మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ముసునూరులోని ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా నిర్మించారు. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరా చేయడంలో సంస్థ కీలకంగా ఉంది. సోమవారం తొలి నాన్-ఘంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు.

దేశానికే సరఫరా :

ఈ సరికొత్త తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనం ద్వారా లభించే పాప్ కార్న్ ఉత్పత్తితో దేశమంతా ఏపీ నుంచి సరఫరా జరగనుంది. ఆ విధంగా ఏపీ దేశానికే కీలకం కానుంది. అంతే కాదు ఏపీలో ఒక ఒక వ్యాపార వంగడం ఆవిష్కరణతో వ్యవసాయం లాభసాటి అని మరోసారి గట్టిగా లోకానికి చాటి చెప్పబోతున్నారు. రైతులు వ్యవసాయం అంటే కష్టాలు కన్నీళ్ళు అన్నదే ఇంత కాలం అంతా అంటున్న వింటున్న మాట. ఆ గతిని తప్పించి ప్రగతికి కొత్త దారులు వెతికేందుకు ఈ తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనం కీలకంగా మారనుంది అని అంటున్నారు.

డిమాండ్ ని తీర్చేలా :

తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణతో దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ నూతన సాంకేతికతను అభివృద్ధి చేశారు. : దేశంలోనే తొలిసారిగా ఎలాంటి జన్యు మార్పిడి లేని పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని రైతులకు అందుబాటులోకి ఈ విధంగా తెచ్చారు. ఇది దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు రైతులకు అధిక దిగుబడిని లాభాలను అందిస్తుంది.

మరిన్ని ఆవిష్కరణలకు :

ఈ కొత్త వంగడం ఆవిష్కరణతోనే ఏపీ వ్యవసాయ పరిశోధన ఆగిపోదు, ముందు ముందు మరిన్ని ఆవిష్కరణలు జరుగుతాయని అంటున్నారు. దాంతో పాటు దేశానికి సరిపడా ఉత్పత్తులను వివిధ పంటల ద్వారా అందించేందుకు విస్తృతంగా పరిశోధనలు జరగబోతున్నాయి. దాంతో రానున్న రోజులలో వ్యవసాయం పండుగ అన్నది నిజం కాబోతోంది అని పరిశోధకులు నిపుణులు అంటున్నారు.