బాబు విధానాలు మంచివే కానీ.. ఇండస్ట్రియలిస్టుల టాక్ ఇదే!
సో.. పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
By: Garuda Media | 29 July 2025 9:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడుల కోసం పరుగులు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ టా 4 లక్షల ఉద్యోగాల కల్పన.. స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచితే.. ప్రస్తుతం సింగ పూర్ పర్యటన వెనుక ఉన్న కారణం కూడా.. ఇదేనని సర్కారు చెబుతోంది. పెట్టుబడుల కోసమే చంద్రబా బు సింగపూర్‌లో పర్యటిస్తున్నారని చెబుతున్నారు.
సో.. పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 12 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. విశాఖ, కర్నూలు, తిరుపతి సహా.. పలు ప్రాంతాలలో పెట్టుబడులకు అవకాశం ఉందని కూడా వివరిస్తోంది. ఇదిలావుంటే.. స్థానికంగా కూడా పెట్టుబడి దారులు ఉన్నారు. వీరిని కూడా ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో ప్రోత్సహిస్తోంది.
కానీ.. స్థానికంగా ఉన్న పెట్టుబడిదారులు, ఇండస్ట్రియలిస్టుల వ్యవహారం.. ఇబ్బందిగా మారింది. ఇతర ప్రాంతాలు.. దేశాలకు చెందిన వారికి.. ఇస్తున్న రాయితీలు.. భూములు.. తమకు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఉదాహరణకు లులు కంపెనీకి విజయవాడలో ఓ ప్రముఖ ప్రాంతంలో స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. దీనిని రాష్ట్రంలోని ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త గతంలోనే కోరారు. ఆ తర్వాత కూడా.. మరికొందరు తెరమీదికి వచ్చారు. తమకు ఆ భూమిని ఇవ్వాలన్నారు.
కానీ.. ప్రభుత్వం వారికి ఇవ్వకుండా.. వారికన్నా తక్కువ ధరలకు.. లులూకు కేటాయించేందుకు రెడీ అయిందన్నది పారిశ్రామిక వర్గాలు చెబుతున్నమాట. ఇది మరోవైపు.. రాజకీయంగా కూడా వివాదం అయింది. సదరు భూమిలో ప్రస్తుతం ఆర్టీసీ ఓల్డ్ బస్టాండ్ ఉంది. ఇక, విశాఖలో అంతర్జాతీయ కంపెనీకి ఎకరా భూమిని.. రూపాయికే ఇచ్చిన ప్రభుత్వం స్థానిక.. పారిశ్రామిక వేత్తలకు మాత్రం ఎకరా 50లక్షలకు కేటాయించడంపైనా పారిశ్రామికవేత్తలు గుస్సాగా ఉన్నారు. ఏదైనా ఒక స్థిరమైన విధానం అమలు చేయాలని కోరుతున్నారు. తలకో రకంగా విధానం ఉంటే.. ఎలా? అన్నది ప్రశ్న. సో.. దీనిపై చంద్రబాబు సమీక్షించి నిర్ణయం తీసుకుంటే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
