గూగుల్ రావడానికి అదే పెద్ద కారణం అన్న బాబు !
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలన కొత్త కాదు, ఆయనది విశేష అనుభవం. అతి చిన్న వయసులో సీఎం అయింది ఆయనే.
By: Satya P | 22 Oct 2025 8:57 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలన కొత్త కాదు, ఆయనది విశేష అనుభవం. అతి చిన్న వయసులో సీఎం అయింది ఆయనే. ఇపుడు ఏడున్నర పదుల వయసులో విభజన ఏపీని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు అతి పెద్ద భారం మోస్తున్నది ఆయనే. కాలం మారింది కానీ బాబులో ఉత్సాహం మాత్రం ఏ విధంగానూ తగ్గలేదు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏమేమి కావాలో బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అన్నది నిజం. ఆయన సీఎం గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏ విషయంలో అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో అని చెప్పాలి.
పెట్టుబడులు వచ్చే రూట్ అదే :
పెట్టుబడులు ఎవరూ ఊరకే పెట్టరు. లాభాల కోసం పెడతారు. అంతే కాదు తాము అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు అన్నీ కూడా ఒక చోట కుప్ప పోయాలని అనుకునే వారు ఎన్నో ఆలోచిస్తారు. ముఖ్యంగా వారికి కావాల్సింది లా అండ్ ఆర్డర్. ప్రశాంతమైన నగరం ఉంటే అక్కడ తమ పెట్టుబడులకు న్యాయం జరుగుతుందని భావిస్తారు. దానికి కావాల్సింది సమర్ధవంతమైన పోలీసింగ్ వ్యవస్థ. అంతే కాదు రాష్ట్ర పగ్గాలు అందుకున్న అనుభవం కలిగిన నాయకత్వం. ఆ విధంగా ఆలోచించ బట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చినది లగాయితూ లా అండ్ ఆర్డర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఆయనకు తెలుసు ఏపీ కూలేస్ట్ అని బయట ప్రచారం జరిగితేనే పెట్టుబడులు వస్తాయని. ఇపుడు అదే జరిగింది గూగుల్ పెట్టుబడులు విశాఖకు వచ్చాయంటే అందులో అసలు సీక్రెట్ ఇదే అని అంటున్నారు.
ఏపీ పోలీసులు ఒక బ్రాండ్ :
ఇది కూడా నిజమే. ఒకప్పుడు ఏపీని ఒక వైపు నక్సలిజం అలాగే ఫ్యాక్షనిజం పట్టి పీడిస్తూ వచ్చాయి. అలాగే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే అరాచక శక్తులు కూడా ఉండేవి. అయితే ఏపీ పోలీసులు వీటిని అణచగలిగారు. ఆ విధంగా చూస్తే ఏపీ పోలీసులకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పాలి. చంద్రబాబు లాంటి సీఎం అయితే వాటిని ఏ విధంగా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే అమర వీరుల దినోత్సవం సందర్భంగా వారికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పారు. వారి నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తుందో కూడా గట్టిగానే చెప్పారు.
ఏకంగా 15 బిలియన్ డాలర్లు:
విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెడుతోంది అంటే ఏపీ పోలీసులకు అది కితాబే అని చెప్పాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పెర్ఫెక్ట్ గా అమలు అవుతోంది కాబట్టే ఆ విధంగా ఒక ప్రపంచ దిగ్గజ సంస్థ విశాఖకు వచ్చింది. దేశాలు దాటుకుని రాష్ట్రాలు దాటుకుని ఏపీలో విశాఖలో కొలువు తీరింది. ఇది నిజంగా గ్రేట్. దీని వెనక బాబు వ్యూహాలు దూరదృష్టి పూర్తిగా ఉన్నాయి. అంతే కాదు ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తీరు కూడా స్పష్టం అవుతోంది. తాను లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ మాత్రం రాజీ పడేది లేదని కూడా చాలా క్లియర్ గా బాబు చెప్పేశారు. దాని ఫలితాలు కూడా బాగానే కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఏపీలో సీఎన్ మారింది :
ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదని ఒకనాడు అంతా భావించేవారు. కానీ ఇపుడు సీన్ మారింది. అందుకే పెద్ద ప్రాజెక్టులు అన్నీ కట్టగట్టుకుని ఏపీకి తరలివస్తున్నాయని అంటున్నారు. ఏపీ అంటే శాంతి భద్రతలకు పెట్టింది పేరు అనేటట్లుగా ఈ ప్రాజెక్టుల రాక ఉంది. దాంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంటా బయటా కూడా ఇపుడు గూగుల్ మీద చర్చతో అది మరింతగా ఏపీకి కీర్తిని తెస్తోంది అని అంటున్నారు.
