Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు ఈ 'బెంగ‌' అవ‌స‌ర‌మా ..!

దీంతో రగిలిపోయిన రైతులు వైసీపీకి బుద్ధి చెప్పారు. గత ఎన్నికల్లో అసలు గుంటూరు జిల్లాలో ప్రాధాన్యం లేకుండానే చేసేశారు.

By:  Garuda Media   |   16 Oct 2025 1:00 AM IST
చంద్ర‌బాబుకు ఈ బెంగ‌ అవ‌స‌ర‌మా ..!
X

గత రెండు రోజుల నుంచి సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, వైసిపి పై ఆయన చేస్తున్న విమర్శలు గమనిస్తే బాబులో ఎక్కడో బెంగ‌ కనిపిస్తోంది అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వచ్చే ఎన్నిక‌ల్లో కూడా మమ్మల్ని గెలిపించండి.. చేసిన తప్పే మళ్ళీ చేయకండి.. అంటూ అమరావతిలో మునిసిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో సీఎం చంద్రబాబు కీలకమైనవ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఈ వ్యాఖ్యలను ఆయన గత 15 నెలలుగా కూడా చేస్తూనే ఉన్నారు.

కానీ, అమరావతిలోకి వెళ్లి అక్కడ కీలకమైన భారీ భవనాన్ని ప్రారంభిస్తూ కూడా అక్కడి రైతులకు చేసిన విన్నపం మరింత ఆసక్తిగా మారింది. నిజానికి అమరావతి రైతులు వైసీపీకి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి చోట చంద్రబాబుకు ఎందుకు అనుమానం వస్తోంది అన్నది ప్రశ్న. వైసీపీ తమను ఎంత వేధించిందో రైతులకు ఇంకా గుర్తుంది. అనేక కేసులు పెట్టారు. మహిళలపై లాఠీచార్జి చేశారు. కొన్ని కొన్నిచోట్ల తీవ్ర స్థాయిలో దూషించారు. కనీసం వారి నిరసనను కూడా వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదు.

దీంతో రగిలిపోయిన రైతులు వైసీపీకి బుద్ధి చెప్పారు. గత ఎన్నికల్లో అసలు గుంటూరు జిల్లాలో ప్రాధాన్యం లేకుండానే చేసేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు ఈ విషయంపై పదే పదే మళ్ళీ చేసిన తప్పే చేయొద్దు వైసీపీకి అవకాశం ఇవ్వద్దు అని మాట్లాడుతున్నారు? అంటే ఆయనలో ఎక్కడో ఏదో దిగులు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. దీనికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో రైతులు, కార్మికులు అదేవిధంగా నిరుద్యోగులు పడుతున్న సమస్యలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు అదేవిధంగా పెద్ద స్థాయి కంపెనీలకు భూములు ఇవ్వడం పైనే దృష్టి పెడుతోంది. అలా కాకుండా కొన్నాళ్లపాటైన సామాన్యులను పట్టించుకుంటే రైతుల సమస్యలు ముఖ్యంగా సామాన్యుల కష్టాలను పట్టించుకొనుగలిగితే ఈ తరహా ఆలోచన గాని ఈ తరహా అవకాశం కానీ ఉండదన్నది రాజకీయ నిపుణులు అదేవిధంగా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఏం చేస్తారు? ఈ ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా ఇటువంటి వ్యాఖ్యలు వైసీపీకి బలం చేకూరుస్తాయి తప్ప టిడిపికి కాదన్నది టిడిపిలో కూడా నాయకులు చెబుతున్న మాట.