బాబుకు జగన్‌కు మరో తేడా.. ఈ మ్యాటర్ తెలుసా...!
తాజాగా గూగుల్ డేటా సెంటర్ ను తీసుకు వచ్చారు. తద్వారా ఐదు లక్షల పైచిలుకు ఉద్యోగాలను యువతకు సమపార్జించామని సీఎం చంద్రబాబు సగర్వంగా చెబుతున్నారు.
By: Garuda Media | 22 Oct 2025 10:27 AM ISTకూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 16 మాసాలు కూడా పూర్తికాకుండానే సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరారు. బుధవారం నుంచి సీఎం చంద్రబాబు దుబాయ్ సహా ఖతార్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది సీఎం చంద్రబాబు ప్రధాన ఉద్దేశం. గత ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చుకునే క్రమంలో ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చారు.
తాజాగా గూగుల్ డేటా సెంటర్ ను తీసుకు వచ్చారు. తద్వారా ఐదు లక్షల పైచిలుకు ఉద్యోగాలను యువతకు సమపార్జించామని సీఎం చంద్రబాబు సగర్వంగా చెబుతున్నారు. ఈ పరంపరలో తదుపరి ఏడాది నాటికి మరో 5 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు కృతనిశ్చయంతో ఆయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. వచ్చే నెల రెండో తారీకు నుంచి లండన్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు.. ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నియాంశంగా మారింది.
దీనికి కారణం 16 మాసాల్లోనే సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తున్నారంటూ వైసీపీ నాయకులు వ్యంగంగా విమర్శలు చేస్తున్నారు. నిజమే 16 మాసాల్లోనే దాదాపు నాలుగు దేశాల్లో ఆయన పర్యటించారు. జపాన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాలకు సీఎం చంద్రబాబు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి ఆయన పెట్టుబడులపై చర్చలు జరిపారు. పెట్టుబడులు రాబట్టారు. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు హామీలను తెచ్చుకున్నారు. ఒప్పందాలు చేసుకుంటారు. ఇలా చూసుకున్నప్పుడు వైసిపి హయాంలో జగన్ ఎన్ని దేశాల్లో పర్యటించారు... అంటే కేవలం రెండు దేశాల మాత్రమే ఆయన పర్యటించారని గణాంకాలు చెబుతున్నాయి.
ఒకటి దుబాయ్ రెండు బ్రిటన్ ఈ రెండు దేశాలను పర్యటించిన అప్పటి సీఎం జగన్ పెట్టుబడులు తీసుకువచ్చినప్పటికీ అవి ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ అప్పటికే ఇప్పటికీ సీఎం చంద్రబాబు చాలా దూకుడుగా వ్యవహరించడంతోపాటు విశాఖ నగరాన్ని చూపిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నంలో చాలా ముందున్నారన్నది వాస్తవం. వచ్చే నెల రెండో తారీకు నుంచి లండన్ లో పర్యటించనున్నారు. అదే సమయంలో వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక పెట్టుబడుదారులను ఆహ్వానించి పెట్టుబడులు వచ్చేలాగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.
