Begin typing your search above and press return to search.

ఓటు వేయ‌లేద‌ని వ‌దిలేయ‌రు.. టీడీపీ తార‌క‌మంత్రం

స‌హ‌జం గానే కొన్ని మండ‌లాల్లో టీడీపీ బ‌లంగా ఉంటే.. మ‌రికొన్ని చోట్ల వైసీపీ బ‌లంగా ఉంది.

By:  Garuda Media   |   8 Sept 2026 3:59 PM IST
ఓటు వేయ‌లేద‌ని వ‌దిలేయ‌రు.. టీడీపీ తార‌క‌మంత్రం
X

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌లు స‌హా 2029లో జ‌రిగే అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఎలా వ్య‌వ‌హ‌రించాలి.. ఏ విధంగా ముందుకు సాగాలి..? అనే విష‌యాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కీల‌క దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ లీడ‌ర్ షిప్ కాన్‌క్లేవ్‌లో ఆయ‌న నాయ‌కుల‌కు ప‌లు అంశాల‌పై సూచ‌న లు, స‌ల‌హాల‌తో పాటు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశాన్ని కూడా బోధిస్తున్నారు. ఇటీవ‌ల కొంద‌రు ఎమ్మెల్యేలు.. త‌మ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌తో వ్య‌వ‌హ‌రించిన తీరుపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు.

స‌హ‌జంగానే కొన్ని మండ‌లాల్లో టీడీపీ బ‌లంగా ఉంటే.. మ‌రికొన్ని చోట్ల వైసీపీ బ‌లంగా ఉంది. అయితే.. టీడీపీ బ‌లంగా ఉన్న చోట‌కంటే.. కూడా త‌మ‌కు ఓటు వేయ‌ని వైసీపీకి బ‌లంగా ఉన్న మండ‌లాల‌ పైనా దృష్టి సారించాల‌న్న‌ది చంద్ర‌బాబు చెప్పిన తార‌క మంత్రం. ''అంద‌రినీ క‌లుపుకొని పోతేనే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మీరు ఒక‌వైపే చూడ‌డం స‌రికాదు. ఓటు వేశారా.. లేదా అనేదికాదు.. ఎందుకు వేయ‌లేదో ఆలోచించాలి.'' అని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

అలా ఓటు వేయ‌క‌పోవ‌డానికి, ఇన్నేళ్ల‌యినా.. టీడీపీ వైపు వారు చూడ‌క‌పోవ‌డానికి కార‌ణాలు తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంటే.. ఓటు వేయ‌లేద‌ని వ‌దిలేయ కుండా.. వారిని త‌క్కువ చేసి చూడ‌కుండా.. నాయ‌కులు తమ లోపాల‌ను స‌రిచేసుకుని.. అంద‌రికీ అక్కు న చేర్చుకునేలా రాజ‌కీయాలు ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. త‌ ద్వారా ఓటు బ్యాంకుతో పాటు ప్ర‌జ‌ల్లోనూ నాయ‌కుల ప‌ట్ల సానుకూల‌త పెరుగుతుంద‌న్నారు.

ఇక‌, వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి క‌లిసి క‌ట్టుగానే పోటీ చేస్తుంద‌ని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి తేడా లేద‌న్నారు. స‌ర్దుబాట్లు ఎంపికల విష‌యాన్ని పార్టీనే చూస్తుంద‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌నితీరు ఆధారంగా.. పార్టీకోసం.. ప్ర‌భుత్వం కోసం ప‌నిచేసిన వారినే ఎంపిక చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. ప్ర‌తి విష‌యంలోనూ పార‌ద‌ర్శ‌కంగా ఉన్న నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ ప్రాధాన్యం ఇస్తుంద‌ని తెలిపారు. ఈ విష‌యంలో లాబీయింగ్‌లు ప‌నిచేయ‌బోవ‌న్నారు.