Begin typing your search above and press return to search.

దీపావళి వేళ వెలిగిన బాబు

హిందూ సంప్రదాయాల పట్ల తెలుగు సంస్కృతి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు చూపించే చంద్రబాబు పూజాకార్యక్రమాలు ఎంతో నిష్టగా పాల్గొంటారు.

By:  Satya P   |   20 Oct 2025 10:17 PM IST
దీపావళి వేళ వెలిగిన బాబు
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి వేడుకలను ఉండవల్లిలోని తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. తన సతీమణితో కలసి ఆయన ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం సాయంత్రం భువనేశ్వరితో కలసి ఆయన లక్షీ పూజ నిర్వహించారు. ఆ తరువాత తన ఇంట దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

సతీమణితో కలసి :

భువనేశ్వరితో కలసి ఆయన కాకరపువ్వొత్తులు కాల్చారు. ఆ దంపతులు ఎంతో హుషారుగా బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, యాభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న దిగ్గజ నేత ఏడున్నర పదుల వయసు ఉన్న బాబు చిన్న పిల్లవారి మాదిరిగా మారిపోయి దీపావళి సంబరాలలో పాల్గొనడం అందరికీ ఆశ్చర్యపరచింది.

భక్తి శ్రద్ధలతో :

హిందూ సంప్రదాయాల పట్ల తెలుగు సంస్కృతి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు చూపించే చంద్రబాబు పూజాకార్యక్రమాలు ఎంతో నిష్టగా పాల్గొంటారు. అదే విధంగా దీపావళి రోజున కూడా ఆయన అదే నిబద్ధతను పాటించారు. అంతే శ్రద్ధతో ఆయన పూజలో పాల్గొనడమే కాదు దీపావళి పండుగలోనూ హుషారు చేశారు.

అపురూప దృశ్యం :

భార్య భువనేశ్వరి బాబు కలసి ఒకే కాకరపువ్వొత్తిని కాల్చడం చూసిన వారికి ఎంతో అపురూపంగా అనిపించింది. దంపతులు అంటే ఇంతటి ప్రేమాభిమానలు కలిగి ఉండాలని ఈ తరం వారికి ఈ విధంగా ఒక అద్భుతమైన సంకేతాన్ని ఇస్తున్నట్లుగా ఉందని చెబుతున్నారు. తాను రాష్ట్రానికి రాజు అయినా తన ఇంట్లో మాత్రం సతీమణిని కుటుంబాన్ని ఎంతగా గౌరవించి ప్రేమిస్తారో బాబు మరోసారి చాటి చెప్పారు.

కూటమి అధినేతగా :

ఇక చంద్రబాబు ప్రభుత్వ అధినేతగా కూటమి పెద్దగా ఈ పదహారు నెలల కాలంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిని సాధించారు. అంతే కాదు సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు. తనకు ఉన్న అనుభవంతో తనకు ఉన్న ఉత్సాహం అసక్తితో రాష్ట్రాన్ని ముందూ తీసుకుని పోతున్నారు ఎడతెరిపి లేకుండా పనులతో ప్రతీ రోజూ ఎంతో బిజీగా గడిపే బాబు దీపావళి రోజు మాత్రం ఉల్లాసంగా కనిపించారు. ఆయన ముఖంలోనే దీపావళి వెలుగులు కనిపించాయి. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతున్న సంతృప్తితో ఉన్న బాబు ఈసారి సంతోషకరమైన దీపావళిని జరుపుకున్నారు అని చెప్పాలి. మొత్తానికి రాష్ట్రానికి పెద్దగా బాబులో కనిపించిన ఆత్మ విశ్వాసం సంతృప్తి ఆనందం ఇవన్నీ రాష్ట్రానికి శాశ్వతంగా దీపావళి కాంతులు ఇస్తాయని అంతా ఆశిస్తున్నారు.