Begin typing your search above and press return to search.

టీడీపీకి బాబు గెలుపు మంత్రం....వైసీపీని ఆమడ దూరం

అయితే బాబు మాటలు వరకే పరిమితం కావడం లేదు. ఈసారి ఆయన పట్టుదలగా ఉన్నారు. 2024 లో టీడీపీ కూటమి మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 164 గెలిచి మరీ ఢంకా భజాయించింది.

By:  Satya P   |   7 Jun 2026 9:18 AM IST
టీడీపీకి బాబు గెలుపు మంత్రం....వైసీపీని ఆమడ దూరం
X

తెలుగుదేశం పార్టీ ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే మరోసారి ఓటమి చవి చూస్తోంది. ఇది ఈనాటి ముచ్చట కాదు పార్టీ పెట్టిన దగ్గర నుంచి అలాగే ట్రెండ్ నడుస్తోంది. అయితే దానికి 1985 ఒక మినహాయింపు. వరుసగా ఎన్టీఆర్ రెండు సార్లు టీడీపీని గెలిపించి సీఎం అయ్యారు. అయితే దాని వెనక కూడా ఒక సానుభూతి సెంటిమెంట్ ఉందని ప్రత్యర్ధులు అంటారు. మధ్యలో నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ లేకపోతే 1988లో షెడ్యూల్ ప్రకారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయ్యేదని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి, కాంగ్రెస్ కూడా తమ తప్పు అదే అని చెప్పుకుని ఒప్పేసుకుంది. ఇక 1989లో ఓడి 1994లో ఎన్టీఆర్ టీడీపీని గెలిపించారు.

అదే ట్రాక్ రికార్డుతో :

ఆ తరువాత చంద్రబాబు జమానాలో కూడా అదే ట్రాక్ రికార్డుతో టీడీపీ ముందుకు సాగుతోంది. 1999లో బాబు నాయకత్వంలో టీడీపీ తొలిసారి గెలిచింది. అయితే 2004, 2009లలో ఓటమి పాలు అయింది 2014లో విభజన ఏపీలో గెలిచింది. కానీ 2019లో ఓటమి దక్కింది. 2024లో టీడీపీ గెలిచింది, మరి ఏపీ పొలిటికల్ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే 2029 లో టీడీపీ ఓడుతుందా అన్న చర్చ ఉంది. వైసీపీ దాని మీదనే కోటి ఆశలు పెట్టుకుంది. కానీ అలాంటిది ఏదీ జరగదని చంద్రబాబు తన పార్టీకి గట్టి హామీ ఇస్తున్నారు

ఓటమి మాటే లేదు :

ఇక మీదట టీడీపీకి ఓటమి అన్న మాటే ఉండదని పార్టీ నేతలకు బాబు భరోసా ఇస్తున్నారు. టీడీపీ వరసగా 2029 ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని బాబు చెప్పారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామని ఆయన అన్నారు. అంతే కాదు గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వారికి పూర్తి స్వేచ్చను ఇచ్చామని చెప్పారు. పార్టీలో కూడా కార్యకర్తల మాటే నెగ్గుతోందని వారి అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని బాబు చెప్పారు పదవులు కానీ టికెట్ల విషయం కానీ చూస్తే ప్రతీ రోజూ పార్టీ సర్వేలు చేయిస్తోందని దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతే కాదు తప్పు చేస్తే ఎంతటి వారిని అయినా పార్టీ దూరం పెడుతుందని బాబు హెచ్చరించారు.

డే వన్ నుంచే :

అయితే బాబు మాటలు వరకే పరిమితం కావడం లేదు. ఈసారి ఆయన పట్టుదలగా ఉన్నారు. 2024 లో టీడీపీ కూటమి మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 164 గెలిచి మరీ ఢంకా భజాయించింది. అయినా ఆ విజయంతో బాబు ఎక్కడా రిలాక్స్ కాలేదు. డే వన్ నుంచే ఆయన జనంలో ఉంటున్నారు. ప్రజలతో అన్ని విధాలుగా మమేకం అవుతున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతీ మేలుని వివరిస్తున్నారు. పేదలతో నేరుగా అనుసంధానం అవుతున్నారు. గతానికి భిన్నంగా బాబు తన వైఖరిని మార్చుకున్నారు. రెండేళ్ళ పాలనలో చూస్తే టీడీపీని బాగా జనాలకు చేరువ చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీని పూర్తిగా ఎండగడుతున్నారు. కూటమిలోని మిత్రులను దగ్గరకు తీస్తున్నారు. ఇక పార్టీ క్యాడర్ తో కూడా గతానికి భిన్నంగా బాగా సాన్నిహిత్యం నెరపుతున్నారు కాఫీ విత్ క్యాడర్ అంటున్నారు వారికి కీలక స్థానాలు ఇస్తున్నారు. పొలిట్ బ్యూరో దాకా చాన్స్ ఇస్తున్నారు.

వైసీపీ గ్రాఫ్ పెరగకుండా :

ఇలా పార్టీని ప్రభుత్వాన్ని బాలెన్స్ చేస్తూ మిత్రులతో బంధం గట్టిగా పెనవేస్తూ అదే సమయంలో విపక్ష వైసీపీని ఆమడ దూరంలోనే ఉంచుతునారు ఒక విధంగా బాబు చేస్తున్న ఈ రాజకీయ అష్టావధానం వల్లనే వైసీపీకి ఏపీ పొలిటికల్ సీన్ మీద ప్రెజెన్స్ చాలా తగ్గిపోతోంది అన్న చర్చ వస్తోంది. అంతే కాదు వైసీపీ గ్రాఫ్ కూడా పెరగకుండా బాబు ఎప్పటికపుడు వ్యూహ రచన చేస్తున్నారు ఇపుడు 2024లో వైసీపీకి వచ్చిన 40 శాతం ఓటు షేర్ ని కుదించే ప్రణాళికతో ఉన్నారు. అందుకే టీడీపీకి ఓటమి లేదు ఇక ఆ మాట వినబడదు అని గట్టిగా చెప్పగలుగుతున్నారు. గెలుపు మంత్రాన్ని ఒడిసిపట్టినట్లుగానే బాబు కనిపిస్తున్నారు. చూడాలి మరి 2029 ఫలితాలు ఏమి చెబుతాయో.