Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ టాపిక్‌: గోదావ‌రి త‌మ్ముళ్లకు బాబు గ్రీన్‌సిగ్న‌ల్‌?

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, దివంగ‌త ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంతాప కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న కుటుంబం ఆగ‌స్టు 1న నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది.

By:  Garuda Media   |   31 July 2026 11:39 PM IST
ముద్ర‌గ‌డ టాపిక్‌:  గోదావ‌రి త‌మ్ముళ్లకు బాబు గ్రీన్‌సిగ్న‌ల్‌?
X

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, దివంగ‌త ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంతాప కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న కుటుంబం ఆగ‌స్టు 1న నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది. తూర్పుగోదావ‌రి జిల్లాలోనే దీనిని ఏర్పాటు చేయ‌ను న్నారు. సాధార‌ణ సంప్ర‌దాయ క్రియ‌లు వ‌ద్ద‌ని కుటుంబానికి ముద్ర‌గ‌డ సూచించిన నేప‌థ్యంలో కేవ‌లం సంతాప కార్య‌క్ర‌మం రూపంలో దీనిని చేప‌ట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీల నాయ‌కుల‌కు ముద్ర గ‌డ కుమారులు ఆహ్వానం పంపించారు.

అయితే.. ఈ విష‌యంలో టీడీపీ ఇప్ప‌టికే ఒక లైన్ తీసుకుంది. వైసీపీ నాయ‌కులు పాల్గొనే కార్య‌క్ర‌మాల కు దూరంగా ఉండాల‌ని పార్టీ నేత‌ల‌ను హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే ముద్ర‌గ‌డ సంతాప కార్య‌క్ర‌మానికి హాజ రైన విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా నుంచివివ‌ర‌ణ కూడా తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం నిర్వ‌హించ‌నున్న ముద్రగ‌డ అధికారిక సంతాప కార్య‌క్ర‌మానికి టీడీపీ నేత‌లు వెళ్లే విష‌యం సందేహంగా మారింది. దీనిపై నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

అయితే..తాజాగా ఈ వ్య‌వ‌హారంపై పార్టీ అధినేత చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు. పార్టీ ప‌రంగానే ముద్ర‌గడ కు సంతాప కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసుకునేందుకు తూర్పు నేత‌ల‌కు ఆయ‌న అవ‌కాశం ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాపు నాయ‌కుల‌కు ఈ మేరకు స‌మాచారం అందించిన‌ట్టు తెలిసింది. టీడీపీతో ఎక్కువ‌గా అనుబంధం ఉన్న నాయ‌కుడిగా ముద్ర‌గ‌డ‌కు పేరుంది. ఎన్టీఆర్ హ‌యాంలో టీడీపీలోనే ఆయ‌న ఉన్న నేప‌థ్యానికి తోడు కీల‌క‌మైన కాపు నాయ‌కుడిగా పేరుంది.

ఈ క్ర‌మంలో ఆయ‌న లెగ‌సీకి పార్టీ ప‌రంగా ఎలాంటి భంగం క‌ల‌గ‌కుండా.. కాపు నాయ‌కులు, కాపు సామాజిక వ‌ర్గం ఎలాంటి అసంతృప్తికీ లోను కాకుండా ఉండేందుకు.. చంద్ర‌బాబు ఈ మ‌ధ్యే మార్గాన్ని అనుసరిం చాల‌ని సూచించిన‌ట్టు తెలిసింది. త‌ద్వారా పార్టీ త‌ర‌ఫునే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకునేందుకు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. దీంతో ముద్ర‌గడ సంతాప కార్య‌క్ర‌మాన్ని టీడీపీ నాయ‌కులే వేరుగా నిర్వ‌హించుకునేందుకు అవ‌కాశం ఉంది. దీంతో వైసీపీ నేత‌లు పాల్గొనే కార్య‌క్ర‌మానికి వారు దూరంగా ఉండ‌నున్నారు. టీడీపీ నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి ముద్ర‌గ‌డ కుమార్తె క్రాంతిని ఆహ్వానించ‌నున్న‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు.