Begin typing your search above and press return to search.

కూటమి మంత్రులు...ప్రచారంతో పరేషాన్

ఏపీలో కూటమి ప్రభుతవ్మ్ కొలువు తీరి పదహారు నెలలు అవుతోంది డెబ్బయి ఆరేళ్ళ చంద్రబాబు నాయకత్వంతో కూటమి ప్రభుత్వం సాగుతోంది.

By:  Satya P   |   13 Oct 2025 6:30 PM IST
కూటమి మంత్రులు...ప్రచారంతో పరేషాన్
X

ఏపీలో కూటమి ప్రభుతవ్మ్ కొలువు తీరి పదహారు నెలలు అవుతోంది డెబ్బయి ఆరేళ్ళ చంద్రబాబు నాయకత్వంతో కూటమి ప్రభుత్వం సాగుతోంది. బాబు రాజకీయ వయసు దాదాపుగా యాభై ఏళ్ళు, ఆయన సీఎం గా పాలించిన వయసు చూస్తే 15 ఏళ్ళు. అన్ని విధాలుగానూ చూస్తే కనుక బాబు ఎంతో అనుభవం కలిగిన వారు, పాత తరానికి కొత్త తరానికి వారధి అలాంటి బాబు నాయకత్వంలో పని చేయడం కూటమి మంత్రులు చేసుకున్న అదృష్టమే అని చెప్పాలి. అదే సమయంలో కూటమి మంత్రుల సగటు ఏజ్ 50 గా చెప్పాల్సి ఉంది. రాజకీయంగా చూస్తే వీరంతా యంగ్ కిందనే లెక్క. మరి ఏడున్నర పదుల వయసులో ఉన్న చంద్రబాబుతో వీరు ఎందుకని పోటీ పడలేకపోతున్నారు అన్నది ఒక చర్చ.

పరుగులు పెడుతున్న బాబు :

వయసు అన్నది తనకు ఒక నంబర్ మాత్రమే అని బాబు అంటూంటారు. ఆయన తీరు కూడా అలాగే ఉంటోంది. ఆయన ఈ ఏజ్ లోనూ పరుగులు పెడుతూంటారు. ప్రతీ విషయం మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తారు, అంతే కాదు ఆయన రోజుకు కనీసంగా పదిహేను గంటలకు పైగా పనిచేస్తూ వస్తున్నారు. ఒక విజన్ పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. మంత్రులను సైతం ఆ విధంగా జోరు చేయమని ప్రతీ కేబినెట్ మీటింగులోనూ బాబు చెబుతూ వస్తున్నారు ఒక విధంగా దిశా నిర్దేశం చేస్తున్నారు.

క్లాస్ తీసుకున్నారంటూ :

ఇదిలా ఉంటే కేబినెట్ మీటింగ్ అన్న తర్వాత అన్నీ మాట్లాడుకుంటారు. బాబు లాంటి వారికి అయితే సమగ్రమైన సమాచారం ఉంటుంది. అన్నీ చర్చించాలని కోరిక తీరిక ఓపిక అన్నీ ఉంటాయి. అందువల్ల ప్రతీ దాని మీద ఆయన మాట్లాడుతారు. ఎక్కడ వెనకబడ్డామన్న దాని మీద మంత్రులకు కూడా ఆయన చెప్పాల్సింది చెబుతారు. తగిన విధంగా డైరెక్షన్ చేస్తారు. అధినేతగా మంత్రుల పనితీరు బేరీజు వేస్తూ కొంత అసంతృప్తి ఉంటే వ్యక్తం చేయడం కూడా కామన్ అయితే ప్రతీ మంత్రి వర్గ సమావేశం పూర్తి అవుతూనే బయట మాత్రం వేరే విధంగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియా కానీ మరో మీడియా కానీ తమదైన శైలిలో వార్తలు వండి వార్చేస్తున్నాయి.

ఆయన మీద అలా :

ఇక తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాఖ మీద కొంత వరకూ మాట్లాడారని ప్రచారం జరిగింది ట్రూ అప్ చార్జీలను ట్రూ డౌన్ చేశాం కదా యూనిట్ మీద 13 పైసలు తగ్గించి వినియోగదారులకు లాభం కలిగించాం కదా మరి అది ఎందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోలేకపోతున్నామని సీఎం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకేముంది దాని మీద బయట న్యూస్ వైరల్ చేస్తూ ఆ మంత్రికి డేంజర్ బెల్స్ ఆయన్ని పక్కన పెడతారు అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఓటమి అనేది లేకుండా వరసగా అనేక సార్లు గెలుస్తూ వస్తున్న గొట్టిపాటి విషయంలో బాబు ఎందుకు అలా ఆలోచిస్తారు అన్నది లాజిక్ పాయింట్ కదా అని కూడా అంటున్నారు.

చాలా మందికి తీసేశారు :

ఇప్పటికి చూస్తే కూటమి కేబినెట్ మీటింగ్స్ ముప్పయి దాకా అయితే ప్రతీ మీటింగులో ఒకరిద్దరు వంతుల చాలా మంది మంత్రులకు డేంజర్ బెల్స్ అని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అలా అనేక మంది మంత్రులను సోషల్ మీడియా ఇతర సాధనాలే అవుట్ చేసేసాయి. దీంతో ఈ తరహా ప్రచారం ఏమిటి బాబూ అని మంత్రులు పరేషాన్ అవుతున్నారు అని అంటున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం ఇంకా అధికారంలోకి వచ్చి తక్కువ టైమే అయింది. మార్పులు చేర్పులు అని ఉంటే కనుక రెండేళ్ళకు పై దాటిన తరువాత మాత్రమే ఉంటాయని అలాగని అందరినీ తీసేయరు కదా అని అంటున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దగా బాబు చేస్తున్న సూచనలు సలహాల విషయంలో మంత్రులు చాలా మంది తన పనితీరు కూడా మార్చుకుంటున్నారు అని గుర్తు చేస్తున్నారు. అయితే కేబినెట్ భేటీ అంటేనే వెంటనే వచ్చే ఈ తరహా ప్రచారాన్ని చూసి మాత్రమే మంత్రులు ఆలోచించే పరిస్థితి ఉందని అంటున్నారు.