Begin typing your search above and press return to search.

మోడీ నాలుగు...బాబు అయిదు...ధీమా వేరే లెవెల్ !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి విషయంలోనే కాదు రాజకీయంగా కూడా చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు.

By:  Satya P   |   14 Sept 2025 4:00 AM IST
మోడీ నాలుగు...బాబు అయిదు...ధీమా వేరే లెవెల్ !
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి విషయంలోనే కాదు రాజకీయంగా కూడా చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. తన బలాన్ని ప్రత్యర్ధుల బలాన్ని బలహీనతలను కూడా ఆయన సరిగ్గానే అంచనా కడతారు. అయితే ఒక్కోసారి మిస్ ఫైర్ అయినా ఎక్కువ సార్లు బాబు అంచనాలే నిజం అయ్యాయి. అందుకే ఆయన దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా గత యాభై ఏళ్ళుగా కొనసాగుతున్నారు. బాబు ప్రత్యర్ధులను ఎదుర్కొన్న తీరు చూస్తే ఆయన వ్యూహాలు ఏమిటి అన్నది అర్ధమవుతాయి. ప్రజాకర్షణ ఎంతో ఉన్న వారిని సైతం తనదైన స్ట్రాటజీలతో ఏమీ కాకుండా చేసి తన సక్సెస్ రేటుని ఆయన పెంచుకుంటూ పోయిన బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.

అపుడే బాబు అంచనా :

ఇక చంద్రబాబు 2024 ఎన్నికల్లో తన నాయకత్వంలో టీడీపీ కూటమికి బంపర్ మెజారిటీ దక్కించారు. ఎన్నడూ కనీ వినీ ఎరగని ఘన విజయం దక్కింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 అసెంబ్లీ సీట్లను కూటమి దక్కించుకుంది. దాంతో పాటు వైసీపీకి 151 సీట్ల నుంచి 11కే పరిమితం చేసింది. ఈ నేపధ్యంలో చూస్తే కనుక 2029 ఎన్నికల మీదనే బాబు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమి గెలుస్తుందని ఆయన చాలా బలంగా నమ్ముతున్నారు. పదిహేను నెలల పాలన మీద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో మిగిలిన పదవీ కాలాన్ని అభివృద్ధి ప్లస్ సంక్షేమంతో పూర్తి చేసి అన్ని వర్గాల మన్ననలతో మరింత భారీ విక్టరీ కొట్టాలని చూస్తున్నారు.

అక్కడ మోడీ ఇక్కడ బాబు :

ఇక 2029 ఎన్నికల్లో మరోసారి గెలిస్తుందని బాబు వెబ్ మీడియా కాంక్లేవ్ లో స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అసలు అవసరం లేదని అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలే తిరిగి గెలిపిస్తాయని ఆయన అంటున్నారు. అంతే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతోందని అందుకే రెండు ప్రభుత్వాలను 2029 ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ దీవిస్తారు అని బాబు అంటున్నారు. అలా చూస్తే నరేంద్ర మోడీ నాలుగవసారి ప్రధాని అవుతారని బాబు జోస్యం చెప్పారు. అలాగే ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు 2029 విజయంతో అయిదవసారి సీఎం అవుతారని అంటున్నారు.

ఫుల్ క్లారిటీగా విజన్ :

ఏపీలో మరోసారి అధికారంలోకి రావడానికి చంద్రబాబు అన్ని విధాలుగానూ కృషి చేస్తున్నారు. అమరావతి మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తి అవుతాయని ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే ఏపీకి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అంటున్నారు. ఈ రెండూ పూర్తి అయితే ఏపీ ప్రజలు అంతా టీడీపీ కూటమిని నీరాజనాలు పడతారని ఆయన ధీమాగా ఉన్నారు. అంతే కాదు ఈలోగా పెట్టుబడుల ఒప్పందాలు అనీ ఆచరణలోకి వచ్చి వాటి ఫలితాలు కూడా జనాలకు చేరువ అవుతాయని అలా సంపద సృష్టితో పాటు యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో తలసరి ఆదాయం రానున్న రోజులలో భారీ ఎత్తున పెరుగుతుందన్ ఆర్ధిక వృద్ధి రేటు కూడా గణనీయంగా పెరుగుతుందని బాబు లెక్కలేస్తున్నారు. ఈసారి పూర్తి పాజిటివ్ ఓటుతోనే టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుంది అన్నది బాబు ఆలోచనగా ఉంది. మొత్తం మీద బాబు 2029 కూడా మాదే అని గట్టి నమ్మకంతోనే ఉన్నారు.