బాబుతో పాటు లోకేష్ కూడా !
ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. పాలనాపరమైన అనుభవం కూడా ఆయన మెండుగా ఉంది.
By: Satya P | 29 Oct 2025 10:26 AM ISTఏపీ సీఎం చంద్రబాబుకు ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. పాలనాపరమైన అనుభవం కూడా ఆయన మెండుగా ఉంది. ఇక ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భాలలో ఎలా వ్యవహరించాలో సీఎం గా బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన భారీ ప్రకృతి విపత్తు వేళ తీసుకునే చర్యలు కానీ నిరంతరం స్వయంగా మోనిటరింగ్ చేయడం కానీ అధికారులను టాప్ టూ బాటమ్ అలెర్ట్ చేయడం కానీ బాబు చేసే కృషి వేరే లెవెల్ అని చెప్పాల్సిందే.
గంటల తరబడి :
చంద్రబాబు గంటల తరబడి సచివాలయంలో ఉంటూ మొంథా తుఫాన్ విషయంలో మోనిటరింగ్ చేశారు. అధికారులతో రివ్యూలు చేశారు. కలెక్టర్లతో వీడియో టెలి కాన్ఫరెన్స్ పెట్టారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా టెలి కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఫీల్డ్ లోకి వెళ్ళేలా చూశారు మొంథా తుఫాన్ కదలికలను దాని గమనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరం అయిన చోట అధికార యంత్రాంగం మొత్తం సిద్ధం అయ్యేలా చూశారు. రాత్రీ పగలు తేడా లేకుండా చంద్రబాబు మొత్తం అంతా తాను అయి సచివాలయంలో ఏకంగా 12 గంటల తరబడి సమీక్షలు చేశారు అంటే గ్రేట్ అనాల్సిందే.
రోల్ మోడల్ గా :
ఒక్క ప్రాణం కూడా పోకూడదు అన్న ఏకైక లక్ష్యంలో అధికారులను చంద్రబాబు పరుగులు పెట్టించారు. అదే సమయంలో ప్రజలకు ఎప్పటికపుడు తుఫాన్ కి సంబంధించిన సమాచారం కూడా వెళ్లేలా చూశారు. మొంథా తుఫాన్ తన దిశ మార్చుకుంటున్న నేపథ్యంలో అది ఎక్కడ ల్యాండ్ అవుతుందో చూసి మరీ రెండు మూడు పాయింట్స్ వద్ద పూర్తి స్థాయిలో సిబ్బందిని ఉంచి అప్రమత్తం చేశారు. ఒక విధంగా చూస్తే బాబు తీసుకున్న ఈ చర్యల ఫలితంగా ఏపీకి సూపర్ సైక్లోన్ గా విరుచుకుపడిన మొంథా తుఫాన్ పెద్దగా నష్టం చేయకుండా వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే తుఫాన్ సమయంలో సంక్షోభం తలెత్తిన వేళ బాబు తీసుకున్న స్టెప్స్ కానీ ఆయన మోనిటరింగ్ చేసిన విధానం కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ అని చెప్పాల్సి ఉంటుంది.
సుదీర్ఘమైన కసరత్తు :
ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో బాబు చేతలలో చూపించారు. పై స్థాయిలో సీఎస్ లతో మొదలెట్టి కలెక్టర్లు ఆ తరువాత శ్రేణులు, అలా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దాకా బాబు టెలి కాన్ఫరెన్స్ పెట్టి నేరుగా వారితో మాట్లాడి రంగంలోకి దిగేలా చూశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులు నేరుగా వెళ్ళి అక్కడ పరిష్తితులను అధ్యయనం చేశారు అంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ కి అదే నిదర్శనం అని చెప్పాల్సిందే. మొత్తానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధంగా నడిపిస్తూ మొంథా వంటి తీవ్ర తుఫాన్ కి ఏపీ ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు ఫ్యూచర్ లో ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో ఎలా వ్యవహరించాలి అన్న దానికి ఒక సిలబస్ గా మారుతుంది అంటే ఆశ్చర్యం లేదు.
లోకేష్ సైతం :
ఇక మంత్రి నారా లోకేష్ సైతం ముఖ్యమంత్రితో సమానంగా పరుగులు పెట్టారు. ఆయన అయితే మొంతా తుఫాన్ అంతర్వేదిపాలెం వద్ద తీరం దాటేంతవరకూ అర్ధరాత్రి దాకా మోనిటరింగ్ చేస్తూనే ఉన్నారు. రాత్రి ఆయన ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయడం కూడా విశేషం. మొత్తం మీద చూస్తే ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు ఏ మాత్రం అలుపు సొలుపు లేకుండా కష్టించిన తీరు ఒక పెద్ద తుఫాన్ బారిన పడకుండా ఏపీ ప్రజలను ఒడ్డున పడేసింది. ఇక లోకేష్ కూడా అంతే సమర్ధంగా వ్యవహరించారు.
ఈ ఇద్దరి నాయకత్వంలో మిగిలిన మంత్రులు అధికార యంత్రాంగం ఒక త్రాటి మీదకు వచ్చి సూపర్ సైక్లోన్ ని గట్టిగా ఎదుర్కొని ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూశారు. 2014లో విశాఖలో సంభవించిన హుదూద్, అలాగే 2018లో శ్రీకాకుళంలో వచ్చిన పెను తుఫాన్ తిత్లీ, 2025లో గోదావరి జిల్లాలకు టచ్ చేసిన మోంథా తుఫాన్ వంటివి గడచిన పదకొండేళ్ళలో ఏపీకి వచ్చిన అతి పెద్ద తుఫాన్లుగా చెబుతారు. ఈ మూడు సందర్భాలలో సీఎం గా చంద్రబాబు ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు యాక్షన్ ప్లాన్ వంటివి ఈ పెను గండాల నుంచి ఏపీ ప్రజలను కాపాడాయని చెప్పాల్సి ఉంది. బాబుకు సరిజోడుగా నారా లోకేష్ సైతం తుఫాన్ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఆరితేరడం ఏపీకి శుభ పరిణామంగా భావించాలి.
