'చంచల్‌గూడ'.. ఇక, మ్యూజియం!
చంచల్‌గూడ.. ఈ పేరు చెప్పగానే ఈ ప్రాంతం కన్నా.. ఇక్కడి జైలే అందరికీ గుర్తుకు వస్తుంది.
By: Garuda Media | 12 May 2026 11:18 PM ISTచంచల్‌గూడ.. ఈ పేరు చెప్పగానే ఈ ప్రాంతం కన్నా.. ఇక్కడి జైలే అందరికీ గుర్తుకు వస్తుంది. రాజకీయ ఖైదీలకు ఒకప్పుడు పేరొందిన చంచల్ గూడ అనేక సందర్భాల్లో వార్తల్లోకి కూడా ఎక్కింది. వైసీపీ అధినే త జగన్ నుంచి అనేక మంది రాజకీయ ఖైదీలు ఈ జైల్లోనే ఉన్నారు. దీంతో వారిని పరామర్శించేందుకు ప్రముఖుల రాకపోకలతో ఈ జైలు నిత్యం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఈ జైలులో సాధారణం నుంచి వీఐపీలు.. వీవీఐపీల వరకు ప్రత్యేక బ్యారక్‌లు ఉన్నాయి. ప్రత్యేక సైకర్యా లు కూడా ఉన్నాయి. ఎవరి స్థాయిని బట్టి వారికి ఇక్కడ సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. గతంలో ఒకరిద్దు జర్నలిస్టులు కూడా ఈ జైల్లోనే రిమాండ్ చేశారు. ఇలా.. `చంచల్‌గూడ` ప్రాంతం పేరుతో వార్తల్లో నిలిచిన జైలు.. ఇప్పుడు అధునాతన మ్యూజియంగా మారనుంది.
ఈ జైలులో రెండు కీలక సదుపాయాలను అమలు చేస్తున్నారు. వీటిని తాజాగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. దీని ప్రకారం.. జైల్లో.. భారీ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో దేశ చరిత్ర, స్వాతంత్ర సమరయోధుల చరిత్రలతోపాటు.. నేరాలు.. శిక్షలు.. పరివర్తనకు సంబంధించిన అనేక అంశాలను పొందుపరుస్తారు. అంతేకాదు.. ఖైదీలు బయటకు వెళ్లి చూడలేని అనేక కళాకృతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా.. జైలు ఒక మ్యూజియంగా మారనుంది.
ఇక, రెండోది `ఫీల్ ది జైల్` పేరుతో ఆకర్షణీయ బహిరంగ వాతావరణం కల్పిస్తారు. తద్వారా.. జైల్లో ఉన్న అనుభూతి ఖైదీలకు కలగదు. అలాగని భారీ స్వేచ్ఛ కూడా లభించదు. చుట్టూ ప్రకృతి వాతావరణం.. చెట్లు.. నడకకు సంబంధించి కారిడార్లు, వ్యాయామానికి సంబంధించి పరికరాలను ఏర్పాటు చేస్తారు. అందమైన తోటలు, ఉద్యానవనాలు.. మధ్యలో వాటర్ ఫౌంటెన్‌లు, కూర్చునేందుకు.. అరుగులు.. ఇలా అనేక ప్రత్యేక ఆకర్షణలతో బహిరంగ జైలును ఫీల్ ది జైలుగా మార్చనున్నారు.
