ఆదేశాల్లో చదివి డాక్టర్లు అయ్యారా? అయితే జాగ్రత్త!
అయితే..అందరూ కాదు. కొన్ని దేశాలకు వెళ్లి.. అక్కడ వైద్య విద్యను అభ్యసించి.. భారత్‌కు తిరిగి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న వైద్యులు.. వివాదాల్లో చిక్కుకుంటున్నారు
By: Garuda Media | 20 Nov 2025 9:42 AM ISTదేశంలో వైద్యుల చుట్టూ ఇప్పుడు ఉగ్ర మూలాలు ముసురుకున్నాయి. అయితే..అందరూ కాదు. కొన్ని దేశాలకు వెళ్లి.. అక్కడ వైద్య విద్యను అభ్యసించి.. భారత్‌కు తిరిగి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న వైద్యులు.. వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దీంతో ఇప్పుడు అలాంటి వైద్యుల జాబితాను.. వారి ప్రవర్తనను, వారి ఆర్థిక లావాదేవీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు..సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) సహా ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్లు పూర్తి నిఘా పెట్టనున్నాయి. అంతేకాదు.. అనుమానితులుగా భావిస్తే.. వారిని విచారించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తాజాగా ఆయాదర్యాప్తు సంస్తలకు అనుమతి మంజూరు చేసింది.
ఎవరెవరు?
భారత్‌లో ఉంటూ.. ఇక్కడ వైద్య విద్యాసంస్థల్లో సీట్లు లభించక.. ఇక్కడ సంస్థల్లో భారీ ఎత్తున ఉన్న ఫీజులు చెల్లించలేక .. చాలా మంది చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, యూఏఈ దేశాలకు వెళ్లివైద్య విద్యను అభ్యసించారు. అనంతరం.. వారంతా.. సొంత క్లినిక్‌లు పెట్టుకోవడం, లేదా ప్రభుత్వ వైద్య శాలల్లో ఉద్యోగాలు సంపాయించడం, ప్రైవేటు మెడికల్ కళాశాంల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. ఇప్పుడు వీరి తాలూకు విద్యను, వారు ఎక్కడెక్కడ చదివారు? వారి ఆర్థిక లావాదేవీలు ఏంటి? వారికి విదేశీ శక్తులతో ఉన్న పరిచయాలు.. గత మూడేళ్లలో ఏయే దేశాలకు వెళ్లారు? ఇలా.. అనేక కోణాల్లో వైద్యులను విచారించనున్నారు.
ఎందుకు?
ఇటీవల అంటే.. ఈ నెల 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఇంకా చాలా మంది వైద్య శాలల్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఎవరనేది తెలియక పోయినా.. సహకరించిన వారు మాత్రం భారత్‌లోని వైద్యులేనని.. వారు కొన్ని రసాయనాలను వినియోగించి.. మదర్ ఆఫ్ సైతాన్ అనే మందుగుండును తయారు చేశారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ వైద్యులను ఆరాతీసి.. వీరిలో ఇద్దరిని అరెస్టు చేశారు. మరింత మందిని అదుపులో పెట్టుకుని విచారిస్తున్నారు.
వీరంతా విదేశాలు.. ముఖ్యంగాపైన చెప్పిన నాలుగు దేశాల్లోనే చదువుకుని భారత్‌కు వచ్చారు. వీరికి ఉగ్ర నెట్ వర్క్‌తో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా ఆ నాలుగు దేశాల్లో చదివి.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై నిఘా పెట్టి విచారించాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రాల వారీగా సదరు వైద్యుల జాబితాను తీసుకుంటున్నారు. వీరికి కనుక ఉగ్రమూలాలతో సంబంధాలు, విదేశీ శక్తులతో అనుబంధాలు ఉంటే తక్షణమేఅరెస్టు చేస్తారు.
