Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్ కోసం ప్రత్యేక కమిషన్...ఈసారి బిల్లు గెలిచేస్తుంది !

డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకునేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన ఉంది. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు.

By:  Satya P   |   28 Nov 2026 9:18 AM IST
డీలిమిటేషన్ కోసం ప్రత్యేక కమిషన్...ఈసారి బిల్లు గెలిచేస్తుంది !
X

బీజేపీ పక్కాగా అన్ని ఏర్పాట్లతోనే రంగంలోకి దిగుతోంది. ఏడు నెలల క్రితం డీలిమిటేషన్ బిల్లుకు జరిగిన పరాజయం ఈసారి పునరావృత్తం అయ్యే ప్రశ్నే లేదని హస్తిన వర్గాల టాక్. దాని కోసం తెర ముందూ వెనకా చేయాల్సిన పూర్తి కసరత్తు అంతా చేసేసి మరీ బీజేపీ రెడీగా ఉంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 మధ్యలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించుకోవాలని చూస్తోంది. ఇక బీజేపీ బలం ఒక్కసారిగా అమాంతం పెరిగింది.

నాడు నో అన్న వారే :

ఏప్రిల్ 16, 17 తేదీలలో పార్లమెంట్ లో ఈ బిల్లు చర్చకు వచ్చినపుడు నో చెప్పి వ్యతిరేకంతా ఓటేసిన వారే ఇపుడు ఎస్ అంటున్నారు. అలా విముఖులను సుముఖులుగా మార్చుకున్న చాతుర్యం మాత్రం కచ్చితంగా బీజేపీదే అని అంటున్నారు. ఆనాడు ఎన్సీపీ, డీఎంకే తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలే బిల్లుకు మోకాలడ్డాయి. ఇపుడు వాటిలో తృణమూల్ కాంగ్రెస్ భారీగా చీలిపోయి ఇరవై మంది దాకా ఎన్డీయే పక్కకు వచ్చేశారు. ఉద్ధవ్ శివసేన నుంచి ఆరుగురు షిండే శివసేనలోకి చేరిపోయారు. ఈ లెక్కలు కలుపుకుంటే బీజేపీ బలం లోక్ సభలో 324 దాకా పెరిగింది ఇపుడు చూస్తే డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు ఇవ్వబోతున్నారు. వారు బిల్లులో తాము పెట్టిన కండిషన్లు ఉండాల్సిందే అన్నారు. అలాగే బిల్లు తయారవుతోంది. ఇక ఎన్సీపీ శరద్ పవార్ కి చెందిన ఎనిమిది మంది ఎంపీలు కూడా బిల్లుకు అండగా ఉండబోతున్నారు. వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా బిల్లుకు ఓకే చెప్పేశారు. ఈ లెక్కన దాదాపుగా బలం అయితే వచ్చేసింది అని అంటున్నారు.

అదనంగానే ఓట్లు :

చిత్రమేంటి అంటే ఈ బిల్లు ఆమోదానికి రాజ్యాంగ సవరణ అవసరం. అందువల్ల ఆ మ్యాజిక్ నంబర్ అయిన 360 కి సరిపడా బీజేపీకి బలం సమకూరింది అని లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మరో పది నుంచి పదిహేను మంది అదనంగా ఈ బిల్లుకు ఓటేయబోతున్నారు అని అంటున్నారు. దాంతో బ్రహ్మాండమైన మెజారిటీతో డీలిమిటేషన్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందుతుందని అంటున్నారు. ఇక రాజ్యసభలో కూడా అవసరం అయిన మెజారిటీ కంటే అదనంగా ఓట్లు సమకూరుతాయని ఆ లెక్కన 172 మంది దాకా ఈ బిల్లుకు ఓటేయబోతున్నారు అని అంటున్నారు.

2029 ఎన్నికల కోసం :

మరో రెండేళ్లకు పైగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. దాంతో దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియను ఈ డిసెంబర్ లోనే మొదలెట్టి ఏడాదిలోగా ముగించాలన్నది పక్కా ప్లాన్ గా ఉంది. అలా 2029 నాటికి కొత్త లోక్ సభ నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్లతో సహా రెడీ చేసి మరీ ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధం అయిన నేపధ్యంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ప్రస్తుత సంఖ్య కంటే 50 శాతం పెంచే ప్రతిపాదనని చేసింది. అలా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ అమలు అవుతాయి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా మహిళా రిజర్వేషన్లలో ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. ఇదంతా దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రొటేషన్ పద్ధతిలో మహిళా రిజర్వుడు స్థానాల కేటాయింపుగా సాగుతుంది. ఈ మొత్తం డీలిమిటేషన్ ప్రక్రియ కోసం ప్రత్యేక కమిషన్ ని కేంద్రం ఏర్పాటు చేయనున్నదని చెబుతున్నారు.