Begin typing your search above and press return to search.

ఐఏఏస్ ఐపీఎస్ లకు డెడ్ లైన్.... కేంద్రం సీరియస్

కేంద్ర సర్వీసులకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు కేంద్రం సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. విధించిన గడువు లోగా వీరంతా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని కేంద్రం కోరింది.

By:  Satya P   |   28 Dec 2025 9:00 PM IST
ఐఏఏస్ ఐపీఎస్ లకు డెడ్ లైన్.... కేంద్రం సీరియస్
X

కేంద్ర సర్వీసులకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు కేంద్రం సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. విధించిన గడువు లోగా వీరంతా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని కేంద్రం కోరింది. లేకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. ఇంతకీ ఏమిటి ఆ డెడ్ లైన్, ఏమా యాక్షన్ అంటే మ్యాటర్ చాలానే ఉంది. దేశంలో సివిల్ సర్వీస్ లో ఉన్న అధికారులు అంతా తమ వార్షిక ఆదాయాలను ప్రతీ ఏటా తప్పసరిగా సమర్పించాలని కేంద్రం కోరుతోంది. ఈ నిబంధన ప్రకారం 2024 ఏడాదికి సంబంధించిన వివరాలను 2026 జనవరి 31వ తేదీలోగా సమర్పించాల్సిందే అని కోరుతోంది.

వాటిపైన ప్రభావం :

ఎవరైనా తమ వార్షిక ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే కనుక వారి మీద క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అంతే కాదు ఇంకా సీరియస్ యాక్షన్ ఏంటి అంటే ప్రమోషన్స్ కూడా ఆపేయడం. విదేశాలలో పోస్టింగులు కూడా ఇవ్వరు, అంతే కాదు విజిలెన్స్ క్లియరెన్స్ కూడా నిలుపుదల చేస్తారు. ఇలా వారిమీద సర్వీస్ పరంగా తీసుకునే యాక్షన్ ఉంటుందని పేర్కొంది. సివిల్ సర్వీస్ లో ఉన్న అధికారుల విషయంలో ఎప్పటికపుడు వారి ఆస్తుల వివరాలను ప్రకటించడం ద్వారా పారదర్శకత తీసుకుని రావాలని చూస్తోంది. దీని వల్ల అవినీతికి ఆస్కారం ఉండదని, ఎవరి మీద అనుమానం ఉండే చాన్స్ లేకుండా చేయడమే ఈ ఆదేశాల వెనా లక్ష్యమని అంటున్నారు.

రూల్స్ ని విరుద్ధమే :

ఇక సివిల్ సర్వీసెస్ లో ఉన్న అధికారులు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలు దాచబెట్టాలని చూస్తే కనుక అది రూల్స్ కి పూర్తిగా వ్యతిరేకమని కేంద్రం చెబుతోంది. ఇక ఎంతో పవర్ చేతిలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉద్యోగంలో చేరినపుడు వారి ఆస్తుల విలువ ఎంత, తరువాత కాలంలో ఎంత అన్నది కూడా వార్షిక నివేదికల ద్వారా తెలుసుతుంది అని అంటున్నారు. అలా ఎవరి ఆస్తుల విషయంలో భారీ తేడాలు ఉంటే కనుక అవినీతి అక్రమాలు ఎవరైనా చేశారా అన్నది కూడా కేంద్రం పసిగట్టి విచారించడానికి కూడా ఈ ఆదేశాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అంతే కాదు సివిల్ సర్వీస్ లో ఉన్న అధికారులు తమ ఆస్తుల వివరాలు బయటపెడితే ప్రజలు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వాటి వివరాలను నేరుగా తెలుసుకోవచ్చు. ఇదంతా పారదర్శకంగా ఉండేందుకే అని అంటున్నారు.

కీలక సమయంలో :

ఇక ఎవరైనా అధికారి మీద ఆరోపణలు వచ్చినపుడు విచారించే ఏజెన్సీలకు కూడా ఈ వివరాలు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు. డిజిటల్ విధానంలో ఈ వివరాలను సేకరించాలని కేంద్రం ఈ ఏడాది నుంచి నిర్ణయించడం వల్ల మరింత పారదర్శకంగా ఉంటుందని అంటున్నారు. అయితే అవినీతి అన్నది సర్వాంతర్యామిగా ఉంది కొంతమంది పోస్టింగులలోకి వచ్చాక తమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నారు. వేరే వారి పేర్లతో కూడా ఆస్తులు పెంచుకుంటున్నారు. అయితే ఈ తరహా వాటికి అడ్డుకట్ట వేయడానికే కేంద్రం ఇపుడు చురుకుగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి డెడ్ లైన్ లోగా అంతా తమ ఆస్తుల పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.