Begin typing your search above and press return to search.

ఆ సిఫార్స్ చేస్తే కేంద్ర ఉద్యోగుల జీతం మూడింతలు

కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ పే ఒక్కసారిగా పెరగనుంది అని అంటున్నారు. అది ఎలా అంటే 8వ వేతన సంఘం సిఫార్సులతో.

By:  Satya P   |   27 Jan 2026 6:00 AM IST
ఆ సిఫార్స్ చేస్తే  కేంద్ర ఉద్యోగుల జీతం మూడింతలు
X

కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ పే ఒక్కసారిగా పెరగనుంది అని అంటున్నారు. అది ఎలా అంటే 8వ వేతన సంఘం సిఫార్సులతో. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ లో 8వ వేంతన సంఘాన్ని ప్రకటించింది. ఈ వేతన సంఘం సిఫార్సుల మీదనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా కనుక సిఫార్సులు ఉంటే పండుగే అని వారు అంటున్నారు.

పదేళ్ల తరువాత :

ప్రతీ పదేళ్ళకు ఒకసారి కేంద్రం వేతన సంఘాన్ని నియమిస్తుంది. అది 2016లో చివరి సారి ఏడవ వేతన సంఘం వల్ల ఉద్యోగుల జీతాలు పెరిగాయి. నాటి నుంచి చూస్తే 2026 వచ్చేసింది. దాంతో ఎంతో మంది ఉద్యోగులు తమ జీతాల పెరుగుదల మీద తమ ఆర్ధిక ప్రయోజనాల మీద కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు 8వ వేతన సంఘం ఏర్పాటు అయిది. కానీ ఈ వేతన సంఘం తన సిఫార్సులను కేంద్రానికి అందించేలా నివేదిక రూపొందించందుకు ఏకంగా 18 నెలల గడువు ఉంటుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా తమకు అనుకూలంగా సిఫార్సులు చేస్తారని ఆశిస్తున్నారు.

ఫిట్ మెంట్ మీదనే :

ఫిట్ మెంట్ ఎంత సిఫార్సు చేస్తారు అన్న దాని మీదనే ఉద్యోగి బేసిక్ పే అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఫిట్ మెంట్ అన్నది 2 పాయింట్స్ గా ఉంటే బేసిక్ పే రెట్టింపు అవుతుంది అన్న మాట. ఒక ఉద్యోగికి 20 వేల రూపాయలు జీతం ఉంటే కనుక అది రెట్టింపుగా నలభై వేలు అవుతుంది. అదే 3 పాయింట్స్ తో ఫిట్ మెంట్ గా వేతన సంఘం సిఫార్స్ చేస్తే కనుక ఏకంగా అరవై వేలకు ఎగబాకుతుంది. ఇపుడు కేంద్ర ఉద్యోగులు అదే కోరుకుంటున్నారు. 8వ వేతన సంఘం తన సిఫార్సులలో ఫిట్ మెంట్ పాయింట్స్ ని 3.25గా ఉండాలని కోరుతుంటున్నారు.

డిమాండ్లు పెట్టారు :

ఇదిలా ఉంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషీనరీ ఈ మేరకు 8వ వేతన సంఘానికి డిమాండ్లు పెట్టింది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ని 3.25గా ఉంచాలని అందులో కోరింది. ఆ విధంగా చేస్తేనే మేలు జరుగుతుందని స్పష్టం చేస్తోంది. ఈ ప్రతిపాదనలను వేతన సంఘం సవరిస్తుందని కూడా బలంగా నమ్ముతోంది. పదేళ్ళ క్రితం చూస్తే జీతాలు బాగా పెరిగాయి. ఏడవ వేతన సంఘం పుణ్యమాని అప్పట్లో ఆరేడు వేల జీతాలు ఉన్న వారు అంతా 3 పాయింట్స్ తో ఫిట్ మెంట్ సిఫార్స్ చేయగా ఏకంగా 20 వేల దాకా జీతాలను అందుకునే స్థాయికి వచ్చారు. ఈ పదేళ్ళలో అన్ని రకాలుగా ద్రవ్యోల్బనం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెరిగిన ధరలు ఇతర ఆర్ధిక పరిస్థితులను 8వ వేతన సంఘం పరిగణనలోకి తీసుకుంటుందని దాంతో మరో సారి మూడింతలు వేతనాలు పెరుగుతాయని వారు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుందో.