Begin typing your search above and press return to search.

పోలీసుల తో పరాచకాలా.. సరదా తీరిందా..?

అవును... పోలీసులతో పరాచకాలు ఆడాలని నిర్ణయించుకున్నాడు ఓ యువకుడు! అనుకున్నదే తడవుగా 'ధమ్ముంటే పట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు.

By:  Raja Ch   |   14 Nov 2025 5:16 PM IST
పోలీసుల తో పరాచకాలా..  సరదా తీరిందా..?
X

ఇటీవల కాలంలో బైక్ నెంబర్ ప్లేట్స్ పై రకరకాల కొటేషన్లు, కామెంట్లు రాయడం.. ట్రాఫిక్ పోలీసులకు సవాళ్లు చేస్తుండటం.. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన పోస్టులు పెట్టడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిపోయింది! తీరా పోలీసులకు దొరికిన తర్వాత.. క్షమాపణలు చెప్పుకుని, షేమ్ అవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా తమను సవాల్ చేసిన ఓ కుర్రాడి సరదా తీర్చేశారు పోలీసులు! దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారాయి.

అవును... పోలీసులతో పరాచకాలు ఆడాలని నిర్ణయించుకున్నాడు ఓ యువకుడు! అనుకున్నదే తడవుగా 'ధమ్ముంటే పట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. 'మేము పట్టుకోగలం, పట్టుకుంటా' అంటూ స్పందించారు. సవాల్ చేసిన గంటల వ్యవధిలోనే అతడ్ని పత్తుకుని ఒ వీడియో తీయించారు. ఇప్పుడు అదీ వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని పూణెలో ఓ యువకుడు తన కవాస్కీ నింజా బైక్ కు "విల్ రన్" అనే నెంబర్ ప్లేట్ పెట్టాడు.. దాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు! దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్ ని వైరల్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ అటు తిరిగి ఇటు తిరిగి పూణే పోలీసుల దృష్టిలో పడింది. ఆ పోస్టుకు 'మేము పట్టుకోగలం, పట్టుకుంటా' రిప్లై ఇచ్చారు.

అలా రిప్లై ఇచ్చిన కొన్ని గంటల్లోనే సదరు యువకుడిని గుర్తించి పట్టుకున్నారు. ఇదే సమయంలో ఆ వీడియోను పోస్ట్ చేసిన అతని స్నేహితుడిని గుర్తించారు. ఈ సందర్భంగా సదరు యువకుడితో క్షమాపణ వీడియోను చేయించి పోస్ట్ చేశారు. 'వీధులు ఆట స్థలాలు కాదు' అంటూ పోలీసులు రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి!