దేశవ్యాప్తంగా కులగణన.. కేంద్రం నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
By: Garuda Media | 14 Aug 2026 10:18 PM ISTదేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ కులగణనను వచ్చే నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవ రి వరకు కొనసాగిస్తారు. కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తమ వివరాలను చెప్పాల్సి ఉంటుంది. దీనికిగాను ఒక్కొ క్క కుటుంబాన్ని కలుసుకునేందుకు సిబ్బందిని నియమించను న్నారు.
దేశంలో ఫస్ట్..
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి ఈ కులగణనను నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాలు సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో ఈ కుల గణనను చేపట్టనున్నారు. ఎన్నికల జాబితా మాదిరిగానే.. కులగణన విషయంలోనూ ఎన్యూమరేషన్ పత్రం ఇస్తారు. దీనిలో 40 ప్రశ్నలను పేర్కొన్నారు. వీటికి సంబంధించి ఆయా కుటుంబ పెద్దలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి పారదర్శకంగా ఈగణనను నిర్వహిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
కాగా.. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణలో భాగంగా తొలిదశలో ఇళ్ల వివరాల సేకరించారు. రెండో దశలో కుల, జన గణన చేపట్టనున్నారు. ఈ దఫా లెక్కల సేకరణలో 'ఎస్సీ, ఎస్టీ'తో పాటు 'కులం' కాలమ్‌ను పొందుపచ్చారు. ఎవరు ఏ కులానికి చెందిన వారు అనేది నిర్ధారిస్తారు. తద్వారా ఏ రాష్ట్రంలో ఏయే సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి? వారికి అందుతున్న సంక్షేమం, వారికి లభిస్తున్న ఉపాధి, జనాభా పెరుగుదల సహా.. మరిన్ని వివరాలను సేకరిస్తారు. అనంతరం.. వాటి ఆధారంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, రాయితీలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
