Begin typing your search above and press return to search.

వర్మకు వరుస షాక్ లు.. రాజమండ్రిలో మరో కేసు.. ఈసారి ఏమైందంటే?

గత కొన్ని రోజుల క్రితం వరకు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగి అలసిపోయిన వర్మకు.. ఇప్పుడు మరో షాక్ తగిలింది. రాజమండ్రిలో ఈయనపై మరో కేసు ఫైల్ అయింది.

By:  Madhu Reddy   |   18 Oct 2025 10:32 AM IST
వర్మకు వరుస షాక్ లు.. రాజమండ్రిలో మరో కేసు.. ఈసారి ఏమైందంటే?
X

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్.. ఒకప్పుడు క్షణక్షణం, గోవిందా గోవిందా, శివ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన వర్మ ఈమధ్య బాలీవుడ్ కి వెళ్లిపోయిన తర్వాత విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అలాంటి చిత్రాలపై ఫోకస్ పెడుతూ తన చిత్రాలతోనే కాకుండా రాజకీయాలలో కూడా తల దూరుస్తూ భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఇప్పుడు గత కొంతకాలంగా వరుస కేసులు ఎదురవడంతో ఆయన అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.. గత కొన్ని రోజుల క్రితం వరకు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగి అలసిపోయిన వర్మకు.. ఇప్పుడు మరో షాక్ తగిలింది. రాజమండ్రిలో ఈయనపై మరో కేసు ఫైల్ అయింది.

విషయంలోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది మేడ శ్రీనివాస్ వర్మతో పాటు ఒక టీవీ ఛానల్ యాంకర్ పై కూడా రాజమండ్రీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ మహిళ యాంకర్ ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద ప్రశ్నలను రాంగోపాల్ వర్మ కోసం అడిగారు అని తన ఫిర్యాదులో మేడ శ్రీనివాస్ తెలిపారు. హిందూ ఇతిహాసాలు , దేవుళ్ళు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో అడగగా.. రాంగోపాల్ వర్మ ధూషించినట్లు ఫిర్యాదు చేశారు.

విద్వేషాలను రెచ్చగొట్టే రాంగోపాల్ వర్మ వీడియోల వెనుక విదేశీ టెర్రరిస్టులు ఉండవచ్చని , అందుకే వర్మతో పాటూ తదితరులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ తో ఆర్జీవితోపాటు ఆ మహిళ యాంకర్ పై కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ఆర్జీవితో పాటు సదరు లేడీ యాంకర్ పై క్రైమ్ నెంబర్ 487/2025, U/S196(1),197(1)353,354,299R/w(3)Bns act కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనిపై వర్మ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

ఇకపోతే ఇప్పటికే రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు ప్రాంతాలలో వివిధ సందర్భాలలో.. వివిధ అంశాలపై కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే గత ప్రభుత్వం హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్. లను ఉద్దేశిస్తూ వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు దుర్భాషలాడినట్లు కూడా పలు ప్రాంతాలలో ఈయనపై కేసుల నమోదయ్యాయి. దీంతో ఈ కేసు తాలూకా నోటీసులు అందుకున్న ఈయన.. ఇటీవల విచారణ కూడా పూర్తి చేశారు. ఏది ఏమైనా ఒక షాక్ తర్వాత మరొక షాక్ వర్మకు ఊపిరాడనివ్వడం లేదని సదరు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.