మోడీ.. షేక్ హమ్దాన్.. నెతన్యాహు.. పరామర్శల ఫ్యాట్రర్న్ గమనించారా?
ఫ్లైదుబాయ్ విమానంలో చోటు చేసుకున్న భయాన ఉదంతం.. ఆ సందర్భంగా ఫ్లైట్ కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన అసమాన తెగువ.. మొండి ధైర్యం ప్రపంచం ఎప్పటికి గుర్తుంచుకునేలా మారింది.
By: Garuda Media | 5 Oct 2026 1:00 PM ISTఫ్లైదుబాయ్ విమానంలో చోటు చేసుకున్న భయాన ఉదంతం.. ఆ సందర్భంగా ఫ్లైట్ కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన అసమాన తెగువ.. మొండి ధైర్యం ప్రపంచం ఎప్పటికి గుర్తుంచుకునేలా మారింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రి ఐసీయూలోచికిత్స పొందుతున్న అతడ్ని ఇప్పటివరకు నేరుగా పరామర్శించిన జాబితా నేటికి మూడుకు చేరింది. ఐసీయూలో చికిత్స జరుగుతున్న వేళ.. అందరి కంటే ముందుగా మాట్లాడింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన్ను అభినందించటమే కాదు.. అతడి భారతమూలాల ప్రస్తావిస్తూ.. తమ దేశస్తుడి ఘనత ప్రపంచానికి తెలిసేలా చేశారు.
అదే సమయంలో అతను వేగంగా కోలుకుంటున్నాడన్న విషయాన్ని తెలిసేలా చేశారు. ఆ తర్వాత దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్. కెప్టెన్ స్మిత్ తనపై ముద్దాడిన వైనం చాలా అరుదైనదిగా చెబుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. ఆయన అసలీ దారుణ ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కెప్టెన్ స్మిత్ తో మాట్లాడనున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటివరకు కెప్టెన్ స్మిత్ ను పరామర్శించిన ముగ్గురు ప్రముఖుల పరామర్శలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఈ ముగ్గురు ప్రముఖుల పరామర్శల ప్యాట్రన్ ఒకరితో మరొకరిది సంబంధం లేనట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ ముగ్గురు ప్రముఖుల పరామర్శల వేళ.. భిన్నమైన అంశాలు వెలుగులోకి రావటం ఆసక్తికరంగా చెప్పాలి. ఇంతకూ ఈ ముగ్గురి పరామర్శల కారణంగా ప్రపంచానికి ఏమేం తెలిసింది? వీరి పరామర్శల ప్యాట్రన్ లో ఎవరేం చేశారన్నది ఆసక్తికరం.
కెప్టెన్ స్మిత్ తో తొలుత మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సంభాషణ మొత్తం అత్యంత సంక్షోభ సమయంలో ఒక భారతీయుడిగా అతను ప్రదర్శించిన సమయస్ఫూర్తి.. సాహసాన్ని కొనియాడటమే కాదు.. అతడికి ధైర్యం చెప్పటం.. అతడికి దన్నుగా యావత్ దేశం ఉందన్న సందేశాన్ని చెప్పటం ద్వారా.. అతడిలో మరింత దైర్యాన్ని పెంచేలా చేశారు. అంతేకాదు.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అంతటి మానసిక ధైర్యం ఎలా వచ్చిందన్న మోడీ ప్రశ్నకు కెప్టెన్ స్మిత్ స్పందిస్తూ.. ఆ కష్ట సమయంలో తాను హనుమాన్ చాలీసా జపించినట్లుగా చెబుతూ.. ఆ ఆధ్యాత్మిక శక్తే తనలో అంతటి ధైర్యాన్ని నింపినట్లుగా చెప్పారు. అంతేకాదు.. తీవ్రంగా గాయపడిన వేళ.. ప్రయాణికుల కోసం కాక్ పిట్ తలుపులు ఎలా తెరిచారన్న దానిపై చర్చ జరిగింది. స్మిత్ తో మోడీ జరిపిన సంభాషణ మొత్తాన్నిచూస్తే.. ఒకవైపు అభినందన.. మరోవైపు ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు.. భారత పౌరుడి పరాక్రమం.. దేశానికి తెచ్చిన గుర్తింపు అంశాలపైనే నడిచింది. అదే సమయంలో.. అసలేం జరిగింది? అన్న వివరాలు బయటకు వచ్చేలా జరగలేదు.
ఇక.. కెప్టెన్ స్మిత్ ను నేరుగా కలిసిన వారిలో తొలి వ్యక్తిగా దుబాయ్ యువరాజు నిలిచారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కెప్టెన్ ను నేరుగా కలిసి.. ఆయన్ను అభినందించటం కనిపిస్తుంది. ఈ సందర్భంగా కెప్టెన్ నుదిటి మీద పెట్టిన ముద్దుతో.. అతడి సాహసం తమ దేశ ప్రతిష్టను ఎంతలా పెంచిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. తమ దేశానికి చెందిన ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన జరగటం.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కెప్టెన్ స్మిత్ చూపిన కమిట్ మెంట్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్స మీద వివరాలు తెలుసుకోవటం.. ఆరోగ్యం త్వరగా కుదుటపడే అంశాల మీదనే చర్చ జరిగింది. దుబాయ్ యువరాజు పరామర్శ మొత్తం.. మానవీయ అంశాలు.. కెప్టెన్ కు అదుతున్న వైద్య సేవల చుట్టూనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది.
ఆదివారం కెప్టెన్ స్మిత్ తో వీడియో కాల్ ద్వారా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు పరామర్శ అత్యంత కీలకమైనదిగా చెప్పాలి. తన దేశ పౌరుల ప్రాణాల్ని కాపాడిన కెప్టెన్ ను స్వయంగా అభినందించటమే కాదు.. చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. అదే సమయంలో అసలు కాక్ పిట్ లో ఏం జరిగిందన్న వివరాలు ప్రపంచానికి తెలిసేలా చేశారు. నువ్వు ఇజ్రాయెల్.. భారత్.. ప్రపంచానికే నిజమైన హీరోవి అంటూ ప్రశంసించటమే కాదు.. వచ్చే ఏడాది ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జ్యోతిని వెలిగించటానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. అతడు కూడా జ్యోతిని వెలిగిస్తారన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించటమే కాదు.. స్వాతంత్య్ర వేడుకల్లో కలుద్దామన్న సందేశాన్ని కెప్టెన్ స్మిత్ కు నేరుగా తెలియజేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని పరామర్శను చూస్తే.. భావోద్వేగంతో మాత్రమే కాదు.. కాక్ పిట్ లో అసలేం జరిగింది? కో పైలట్ దుర్మార్గం.. అతడు చేసిన దాడి తీవ్రత ఎంత పెద్దదన్న విషయంతో పాటు.. విమానాన్ని కూల్చేయటమే లక్ష్యంగా అతని ప్లాన్ ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. కెప్టెన్ స్మిత్ ను పరామర్శించిన ముగ్గురు ప్రముఖుల పరామర్శల ఒకదానితో మరొకటి సంబంధం లేని రీతిలో ఉండటం మాత్రం ఆసక్తికరం. ఇజ్రాయెల్ ప్రధాని పరామర్శ మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండటమే కాదు.. కుట్ర కోణం బయటకు తెలిసేలా చేశారని చెప్పాలి.
