Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి సీఈసీని బర్తరఫ్ చేయగలరా...బంతి అక్కడికేనా ?

ఇదిలా ఉంటే రాష్ట్రపతి రాజీనామా చేయాలని కోరుతూ విపక్ష నేతలు రాష్ట్రపతిని కలిశారు. ఆ విషయంలో రాష్ట్రపతికి వాస్తవాలు వివరించామని చెబుతున్నారు.

By:  Satya P   |   9 Oct 2026 10:53 PM IST
రాష్ట్రపతి సీఈసీని బర్తరఫ్ చేయగలరా...బంతి అక్కడికేనా ?
X

ప్రస్తుతం విపక్షం అంతా దేశవ్యాప్తంగా ఒకే ఒక్క డిమాండ్ తో ముందుకు సాగుతోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ని ఆ పదవి నుంచి దించేయాలి అన్నదే ఆ డిమాండ్. అయితే అది అంత సులువు కాదు, కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర్య సంస్థ. దానికి అపారమైన అధికారాలు ఉన్నాయి. 2023లో చేసిన చట్ట సవరణ మేరకు సీఈసీని ప్రాసిక్యూట్ కూడా చేయకూడదు. ఇక సీఈసీని దించేయాలి అంటే దానికి అతి పెద్ద ప్రొసీజర్ ఉంది. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా పార్లమెంట్ కోర్టులోనే బంతి ఉంటుంది. పార్లమెంట్ తీర్మానంతోనే సీఈసీని దించడం సాధ్యపడుతుంది.

ఇండీ కూటమి ఫిర్యాదు :

ఇదిలా ఉంటే భారత రాష్ట్రపతి నడిచే రాజ్యాంగం అని చెబుతారు. అలాంటి రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ని బర్తరఫ్ చేసే విశేష అధికారాలు ఉన్నాయా అన్నది మరో చర్చ. ఎందుకంటే తాజాగా ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు అంతా కలసి దేశంలో ఓట్ల దొంగతనం జరిగిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ద్రౌపది ముర్ముని కలసి ఫిర్యాదు చేశారు. ఓట్ల దొంగతనంతో పాటు ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు ఎన్నికల సంఘం వైఫల్యాలు వంటి వాటిని దేశ ప్రధమ పౌరురాలి దృష్టిలో ఉంచారు. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ వంటి అంశాలపై తమ ఆందోళనలను తెలియజేస్తూ ఇండియా కూటమి నాయకులు రాష్ట్రపతికి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రపతిని కలసిన పది మందితో కూడిన ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు.

బర్తరఫ్ చేయగలరా :

ఇదిలా ఉంటే రాష్ట్రపతి రాజీనామా చేయాలని కోరుతూ విపక్ష నేతలు రాష్ట్రపతిని కలిశారు. ఆ విషయంలో రాష్ట్రపతికి వాస్తవాలు వివరించామని చెబుతున్నారు. రాష్ట్రపతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో చర్యలు తీసుకోగలరా అన్నది ఇపుడు చర్చగా ఉంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూస్తే రాష్ట్రపతి నేరుగా సీఈసీని తొలగించడానికి వీలు లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగానైతే తొలగిస్తారో అదే పద్ధతిలో పార్లమెంటు సిఫార్సు మేరకు మాత్రమే రాష్ట్రపతి సీఈసీని బర్తరఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో పార్లమెంటు తీర్మానం పెట్టి పార్లమెంటులోని ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

పార్లమెంట్ లోనే :

అవసరమైన మెజారిటీ సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ హాజరై ఓటు వేసిన వారిలో కనీసం 2/3 వంతు సభ్యుల మద్దతు అవసరం. అల పార్లమెంటు రెండు సభలు ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి సీఈసీని బర్తరఫ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ఇతర ఎలక్షన్ కమిషనర్లను మాత్రం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నేరుగా తొలగించవచ్చు. కానీ సీఈసీకి మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైన రక్షణ ఉంటుందన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానధికారి విషయంలో అంతిమ నిర్ణయం కానీ చర్చ కానీ చర్యలు కానీ అన్నీ పార్లమెంట్ వేదికగానే జరగాలని నిపుణులు అంటున్నారు.