Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయ పౌరుడి ఇమ్మిగ్రేషన్ నిర్బంధంపై ప్రభుత్వానికి షాకిచ్చిన కోర్టు

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక వలసవాదులకు చుక్కలు చూపిస్తున్నాడు. తలతిక్క పనులతో అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు.

By:  A.N.Kumar   |   30 Dec 2025 6:00 PM IST
అమెరికాలో భారతీయ పౌరుడి ఇమ్మిగ్రేషన్ నిర్బంధంపై ప్రభుత్వానికి షాకిచ్చిన కోర్టు
X

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక వలసవాదులకు చుక్కలు చూపిస్తున్నాడు. తలతిక్క పనులతో అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. రోజుకో ఇమిగ్రేషన్ విధానాలంటూ విదేశీయులను నిర్బంధంలోకి తీసుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు అక్కడ పోరాటానికి వేదిక అవుతుంది.చాలామంది ట్రంప్ విధానాలతో దేశం విడిచి వెళ్లిపోతుండగా.. మరికొందరు మొండిగా అక్కడి ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అమెరికాలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో నిర్బంధంలో ఉన్న ఒక భారతీయ పౌరుడి కేసులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు ప్రభుత్వానికి షాకిస్తూ నోటీసులు జారీ చేయడం సంచలనమైంది .

నవీన్ అనే భారతీయ పౌరుడు తన నిర్బంధం చట్ట విరుద్ధమని సవాల్ చేస్తూ దాఖలు చేసిన హెబియఎస్ కార్బస్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం దీనిపై సమాధానం ఇవ్వాలని అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.

అసలు ఏం జరిగింది?

కోర్టు రికార్డుల ప్రకారం.. నవీన్ 2023 ఏప్రిల్ 18న మెక్సికో సరిహద్దు ద్వారా ఎటువంటి చట్టబద్ద అనుమతి పత్రాలు లేకుండ అమెరికాలోకి ప్రవేశించారు.ఈ క్రమంలో ‘కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారుల అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తరువాత ‘ఆర్డర్ ఆఫ్ రిలీజ్ ఆన్ రికగ్నైజెన్స్’ కింద అతడిని విడుదల చేశారు. అయితే 2025 నవంబర్ 3న తన షెడ్యూల్ ప్రకారం ‘ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) కార్యాలయానికి చెక్ ఇన్ కోసం వెళ్లిన సమయంలో నవీన్ ను మళ్లీ అరెస్ట్ చేశారు. ఇమిగ్రేషన్ చట్టంలోని సెక్షన్ 1225 (బీ)(2)(ఏ) ప్రకారం.. అతడిని తప్పనిసరిగా నిర్బంధంలో ఉంచాల్సిందేనని.. బెయిల్ కు అర్హత లేదని అధికారులు వాదిస్తున్నారు.

చట్టపరమైన వివాదం ఏమిటి?

బాధితుడు నవీన్ తరపు న్యాయవాదులు ఈ నిర్బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మోపిన సెక్షన్లు పెట్టిన ఈ కేసు వర్తించదని వాదించారు. నవీన్ కేసును సెక్షన్ 1226(a) కింద పరిగణించాలని.. ఇమిగ్రేషన్ విచారణ పెండింగ్లో ఉన్న సమయంలో బాండ్ లేదా షరతులతో కూడిన విడుదల పెరోల్ గా పొందే అవకాశం ఉంటుంది.

న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..

డిసెంబర్ 24న ఉత్తర్వులు జారీ చేసిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నవీన్ పిటిషన్‌లో తగినంత మెరిట్ ఉందని వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేమని స్పష్టం చేశారు. అలాగే న్యూయార్క్, నెవాడా, వాషింగ్టన్ వంటి ఇతర రాష్ట్రాల్లోని ఫెడరల్ కోర్టులు కూడా గతంలో ఇలాంటి కేసుల్లో నిర్బంధ బాధితుల పక్షాన తీర్పులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ కేసు అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాల అమలుపై కొనసాగుతున్న పెద్ద చర్చల్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా మారింది. ప్రభుత్వం తన వాదనలు వివరణలను కోర్టుకు సమర్పించిన తర్వాత నవీన్ కు బెయిల్ పై విడుదల లభిస్తుందా? లేక నిర్బంధం కొనసాగుతుందా? అన్నది న్యాయస్థానం తుది నిర్ణయంతో తేలని ఉంది.