Begin typing your search above and press return to search.

చైనా కారు అద్భుతం... −30°Cలో 12 నిమిషాల్లో ఫుల్‌ చార్జ్‌

ఒకప్పుడు చైనా వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అవహేళన చేసేవారు. వారి వస్తువులకు నాణ్యత ఉండదు, వారు తయారు ఇచ్చే సర్వీస్‌కి నాణ్యత ఉండదు అనే అభిప్రాయం ఉండేది.

By:  Ramesh Palla   |   10 Sept 2026 3:33 PM IST
చైనా కారు అద్భుతం... −30°Cలో 12 నిమిషాల్లో ఫుల్‌ చార్జ్‌
X

ఒకప్పుడు చైనా వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అవహేళన చేసేవారు. వారి వస్తువులకు నాణ్యత ఉండదు, వారు తయారు ఇచ్చే సర్వీస్‌కి నాణ్యత ఉండదు అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా తయారు అవుతున్న వస్తువులు నాణ్యత విషయంలో అయినా మన్నిక విషయంలో అయినా, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అన్నింటా చైనా వస్తువులకు మంచి పేరు ఉంది. గుండు సూది నుంచి మిసైల్స్ వరకు చైనా తయారీ రంగంలో అద్భుతమైన నైపుణ్యం ను సొంతం చేసుకుందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. తాజాగా చైనా కార్ల తయారీ కంపెనీ BYD అద్భుతమైన ఆవిష్కర చేసింది. కేవలం 9 నిమిషాల్లో కారు చార్జింగ్‌ పూర్తి అయ్యే టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. అంతే కాకుండా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్లేస్‌ల్లో బ్యాటరీ కార్లు, వాటి చార్జింగ్‌ సవాళ్లను సైతం BYD కంపెనీ జయించింది.

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చార్జింగ్‌...

సాధారణంగా మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో కార్ల బ్యాటరీలు చాలా స్పీడ్‌గా డిచార్జ్‌ కావడం జరుగుతుంది. అంతే కాకుండా వాటిని చార్జింగ్‌ పెట్టడానికి గంటల తరబడి సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ BYD కంపెనీ తయారు చేసిన బ్యాటరీ చాలా తక్కువ సమయంలోనే ఫుల్‌ చార్జ్ అవుతుంది. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత పరిస్థితుల్లో కారును ఉంచి చార్జ్‌ పెట్టిన సమయంలో 20% ఉన్న చార్జింగ్‌ 97% కావడానికి కేవలం 12 నిమిషాలు మాత్రమే పట్టింది. సాధారణ వాతావరణంలో అయితే 10% నుంచి 70% చార్జింగ్‌ ఎక్కడానికి 5 నిమిషాలు పడుతుంది, అదే 10% నుంచి 97% చార్జింగ్‌ ఎక్కడానికి 9 నిమిషాల సమయం పడుతుంది. సాధారణ వాతావరణంలో 9 నిమిషాల సమయం పట్టగా, మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లో కేవలం మూడు నిమిషాలు అదనంగా పట్టి 12 నిమిషాల్లో 97% చార్జింగ్‌ అవుతున్నట్లుగా కంపెనీ చూపించింది.

BYD కంపెనీ ఈవీ కార్లకు క్రేజ్‌..

ఇతర కంపెనీలకు చెందిన ఈవీ ల బ్యాటరీలు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచినట్లయితే మెల్లగా బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుంది. అంతే కాకుండా చార్జింగ్‌ సైతం దానంతట అదే తగ్గుతూ పోతుంది. కానీ BYD కంపెనీకి చెందిన కారు బ్యాటరీ మాత్రం అంత చలిలోనూ చార్జింగ్‌ తగ్గదని చెబుతున్నారు. అంతే కాకుండా బ్యాటరీ డ్యామేజ్‌ కాకుండా ఉండటం జరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ స్పీడ్‌తో చార్జింగ్‌ ఎక్కడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా నీరు గడ్డ కట్టే వాతావరణం ఉన్న దేశాల్లో ఈ కంపెనీ కార్లకు భారీ డిమాండ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే BYD కార్లు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త టెక్నాలజీతో బ్యాటరీలను తీసుకు రావడం వల్ల కచ్చితంగా అన్ని దేశాల నుంచి ఈ కంపెనీ కార్లకు ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.

ఇండియాలో BYD కార్ల మార్కెట్‌..

BYD కార్లు భారతదేశం వాతావరణం కు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ రాష్ట్రాల్లో గడ్డ కట్టే వాతావరణం ఉండదు. కనుక చార్జింగ్‌ అనేది అత్యంత స్పీడ్‌గా ఎక్కుతుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఈవీ కార్లు చార్జింగ్‌ విషయమై చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. సరాసరిగా ఇండియన్‌ ఈవీలకు 45 నిమిషాలు చార్జింగ్‌ పెట్టాల్సి వస్తుంది. కనుక ప్రస్తుతం ఈవీ వైపు మొగ్గు చూపాలి అనుకునే వారు పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో పూర్తి చార్జింగ్‌ అయ్యే కార్లను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. వారికి BYD కంపెనీ భవిష్యత్తులో బెస్ట్‌ ఆప్షన్ కానుంది. అయితే ఈ కార్లకు చార్జింగ్‌ చేయడానికి ప్రత్యేకమైన చార్జింగ్‌ పాయింట్స్ అవసరం అవుతాయి. చైనాలో ఈ ఏడాది చివరి వరకు 20 వేల ఫ్లాష్ చార్జింగ్‌ పాయింట్స్‌ ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ రెడీ అవుతుంది. ఇండియాలో కార్ల సంఖ్య పెరిగితే ఇక్కడ కూడా ఫ్లాష్ చార్జింగ్‌ పాయింట్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి.