భారత్ లో దూసుకెళుతున్న బీవైడీ.. అదెలా చెప్పిన కంపెనీ
బీవైడీ కార్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చైనా కారు భారత్ లోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే సత్తా చాటినట్లుగా కంపెనీ చెబుతోంది.
By: Garuda Media | 2 Sept 2025 9:22 AM ISTబీవైడీ కార్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చైనా కారు భారత్ లోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే సత్తా చాటినట్లుగా కంపెనీ చెబుతోంది. మార్కెట్ లో తన ముద్రను వేసిందన్న మాట మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2021 చివర్లో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కార్ల కంపెనీ.. తన తొలి ప్యాసింజర్ కారు (ఈ6 ఎలక్ట్రిక్) విడుదల చేసింది.
మొదట్లో కమర్షియల్ కార్లను విడుదల చేసిన బీవైడీ ఇండియా.. ఆ తర్వాత నుంచి తన పంథా మార్చుకొని ప్యాసింజర్ కార్లను ఒకటి తర్వాత ఒకటి చొప్పున విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలో నాలుగు కార్లను అమ్ముతోంది. సీల్.. ఆట్టొ.. ఈ6.. ఈమ్యాక్స్7ను అమ్ముతోంది. రాబోయే రోజుల్లో తన మార్కెట్ ను మరింత పెంచుకోవటంలో భాగంగా ఆట్టొ2ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ కారు క్రెటా ఈవీకి పోటీదారుగా చెబుతున్నారు. చైనాకు చెందిన బీవైడీ కార్ల కంపెనీ విషయానికి వస్తే.. టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. 2025లో బీవైడీ బ్రాండ్ విలువ అక్షరాల 14.4 బిలియన్ అమెరికా డాలర్లు. ఈ సంస్థ ఏడాదిలో 43.6 శాతం వృద్ధిని సాధించటం ద్వారా మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు బీవైడీ 1.3 కోట్ల ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది.
ఈ కంపెనీ జర్నీని చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. చైనాకు చెందిన ఈ సంస్థ 1995 షెన్ జెన్ లో ఏర్పాటు చేశారు. తొలుత బ్యాటరీలను ఉత్పత్తి చేసిన సంస్థ 2003లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలక్ట్రిక్.. హైబ్రిడ్ వాహనాల్ని డెవలప్ చేయటం షురూ చేసిన ఈ సంస్థ మొదట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసి.. అమ్మేది. ఆ తర్వాతి కాలంలో సొంతంగ ఉత్పత్తి చేయటం మొదలు పెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల్లో ఒకటిగా మారింది. ఈ సంస్థ భారతదేశంలో తన మొదటి ప్లాంట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.
