బడ్జెట్ 2026-27: ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే!
ఈ సందర్భంగా పలు రకాల వస్తువుల ధరలు తగ్గనుండగా.. మరికొన్నింటి ధరలు పెరగనున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దామ్...!
By: Raja Ch | 1 Feb 2026 3:58 PM ISTఫిబ్రవరి 1 - 2026న ఆదివారం 2026 - 27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సుమారు 80 నిమిషాలకు పైగా సాగిన ఆమె ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా పలు రంగాలకు కీలక కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో.. ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయి.. మరింకా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయనేది ఇప్పుడు చూద్దామ్...!
అవును... 2026-27 సంవత్సరానికి సంబంధిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు రంగాలకు కీలక కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగా అత్యధికంగా రవాణాకు రూ.5,98,520 కోట్లు, రక్షణ రంగానికి రూ.5,94,585 కోట్లు కేటాయించగా... అనంతరం గ్రామీణాభివృద్ధికి రూ.2,73,108 కోట్లు, హోంశాఖకు రూ.2,55,234 కోట్లు, వ్యవసాయానికి రూ.1,62,671 కోట్లు కేటాయించారు.
ఇదే సమయంలో.. విద్యా రంగానికి రూ.1,39,289 కోట్లు, ఇంధనం రూ.1,09,029 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1,04,599 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ కు రూ.85,522 కోట్లు కేటాయించారు. ఇదే సమయంలో.. దేశ సెమీకండక్టర్ రంగం వృద్ధి కోసం రూ.40 వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... రూ.10 వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారు.
భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు!:
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో కంపెనీల బైబ్యాక్ పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైనా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను పెంచడం వంటి ప్రకటనలు మార్కెట్లను కుదిపేశాయి. ఇందులో భాగంగా... మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సెన్సెక్స్ 580 పాయింట్లు పతనమై 81,681 వద్ద.. నిఫ్టీ 201 పాయింట్లు దిగజారి 25,119 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా.. ఒక దశలో సెన్సెక్స్ 2,000 పాయింట్లు కుంగడం గమనార్హం!
ఈ సందర్భంగా పలు రకాల వస్తువుల ధరలు తగ్గనుండగా.. మరికొన్నింటి ధరలు పెరగనున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దామ్...!
ధరలు తగ్గనున్న వస్తువులు!:
క్యాన్సర్ మందులు
విదేశీ టూర్ ప్యాకేజీలు
తోలు వస్తువులు
పాదరక్షలు
టీవీ పరికరాలు
కెమెరాలు
మైక్రోవేవ్ ఓవెన్లు
వీడియో గేమ్ ల తయారీ భాగాలు
సీ.ఎన్.జీతో కలిపిన జీవ ఇంధనం
కాఫీ, వెండింగ్ మెషీన్లు
విదేశాల్లో చదువుకోవడం
విమాన భాగాలు
దేశీయంగా తయారయ్యే మొబైల్స్
ధరలు పెరగనున్న వస్తువులు!:
విదేశీ మద్యం
లగ్జరీ వాచ్ లు
బొగ్గు
