బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ గిఫ్ట్... నో రీఛార్జ్ టెన్షన్
ఈ రోజులలో ప్రతీ వారికి సెల్ ఫోన్ ఉంది. అది కూడా స్మార్ట్ ఫోనే ఉంది. ఫోన్ అన్నది ఇపుడు కనీస అవసరంగా ఉంది.
By: Satya P | 29 Dec 2025 1:00 PM ISTఈ రోజులలో ప్రతీ వారికి సెల్ ఫోన్ ఉంది. అది కూడా స్మార్ట్ ఫోనే ఉంది. ఫోన్ అన్నది ఇపుడు కనీస అవసరంగా ఉంది. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ ఫోన్ ఉంది. ఫోన్ ఉంటే సరిపోదుగా. దానికి సిం ఉంటుంది. అది రీఛార్జ్ అడుగుతుంది. మరి రీచార్జి టారిఫ్స్ ఏమో టపాసుల్లా పేలిపోతున్నాయి. తక్కువ టారిఫ్ కి వేయించుకుందామంటే 28 రోజులకే రెండు వందలకు పైగా బాదేస్తున్నారు పైగా గడువు తీరిపోతే కాల్స్ తో పాటు నెట్ సర్వీస్ సైతం ఆగిపోతుంది. దాంతో అది పెద్ద సమస్యగా మారుతోంది.
మధ్యతరగతికి :
ఇక మిడిల్ క్లాస్ వర్గాలకు ఈ రీచార్జి చాలా పెద్ద సమస్యగా మారుతోంది. నెల రోజుల ప్లాన్ అటే 28 రోజులతో సరి, మూడు నెలల ప్లాన్ అంటే కూడా వేయి రూపాయలు చెల్లించినా ఇట్టే రోజులు గడుస్తున్నాయి. రీఛార్జ్ చేయడానికి సమయానికి డబ్బులు లేకపోతే ఇంతే సంగతులు. దాంతో ఏడాది ప్లాన్స్ అవి కూడా రీజనబుల్ ప్రైజ్ కి ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ అవి కూడా టాపాసుల్లా పేలుతున్నాయి. దాంతో ఏడాది ప్లాన్స్ ఏవి చవకగా ఉన్నాయి అని వెతుక్కునే లోపు బీఎస్ఎన్ఎల్ ఒక మంచి ఆఫర్ ని ప్రకటించింది. అది కూడా న్యూ ఇయర్ గిఫ్ట్ గా జనం ముందు పెట్టింది.
ఒక్కసారి చేయిస్తే చాలు :
ఇక బీఎస్ఎన్ఎల్ వన్ ఇయర్ ప్లాన్ ఆకర్షణీయంగా ఉంది. కేవలం 2799 రూపాయలతో ఒక్కసారి రీచార్జి చేయిస్తే చాలు ఏడాది అంతా హ్యాపీగా ఫోన్ పనిచేస్తుంది. ఫుల్ గా ఫోన్ కాల్స్ అలాగే రోజుకు 3 జీబీతో డేటా కూడా ఉంటుంది. అంతే కాదు ప్రతీ రోజూ వంద దాక ఎస్ ఎం ఎస్ లు ఫ్రీగా కూడా ఉంటాయి. అందుకే బీఎస్ఎన్ఎల్ ఈ మంచి ఆఫర్ ని వాడుకోండి అని అంటోంది. పైగా మన నెట్ వర్క్ మన వారి కోసం అని చెబుతోంది.
చాలా తక్కువే :
ఇక ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లుగా ఉన్న ఎయిర్ టెల్ కానీ జియో కానీ వన్ ఇయర్ ప్లాన్ చూస్తే టాఫీఫులు ఎక్కువగానే ఉన్నాయి. వాటితో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చాలా రీజనబుల్ గా ఉంది అని అంటున్నారు. 2799 కి 365 రోజులు అంటే రోజుకు 7 రూపాయ 66 పైసలు మాత్రమే అని అంటున్నారు. పైగా 3 జీబీ అంటే నూటికి తొంబై అయిదు శాతం మంది ఇంటర్నెట్ అవసరాలు పూర్తి స్థాయిలో తీరుతాయని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ని అందుకోండి అని సంస్థ కోరుతోంది. ఇక ఎవరికి వారుగా ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకోవడమే. న్యూ ఇయర్ నుంచి ఈ ప్లాన్ లో కి వెళ్తే మళ్లీ న్యూ ఇయర్ వచ్చే దాకా రీఛార్జ్ కి నో టెన్షన్ అని అంటున్నారు.
