Begin typing your search above and press return to search.

నీ అసోంటి కుక్కలు.. కవితపై బీఆర్ఎస్ తీవ్రదాడి మొదలైందా?

ఈ క్రమంలోనే వారానికి ఒక బీఆర్ఎస్ నేత ఆమెపై విరుచుకుపడుతున్నారా? తాజాగా కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కామెంట్స్ చూస్తే అదేనని అనిపిస్తోంది.

By:  A.N.Kumar   |   9 Dec 2025 1:28 PM IST
నీ  అసోంటి కుక్కలు.. కవితపై బీఆర్ఎస్ తీవ్రదాడి మొదలైందా?
X

బీఆర్ఎస్ ను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన కవితకు తొలిసారి హీట్ తగులుతోంది. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకుండా ఇచ్చిపడేస్తున్నారు. జాగృతి అధ్యక్షురాలు కవితను ఇక వదిలేదే లే అంటూ రెచ్చిపోతున్నారు. కవిత విషయంలో బీఆర్ఎస్ రూటు మార్చిందా? ఆమెపై ఎదురుదాడి తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యిందా? ఈ క్రమంలోనే వారానికి ఒక బీఆర్ఎస్ నేత ఆమెపై విరుచుకుపడుతున్నారా? తాజాగా కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కామెంట్స్ చూస్తే అదేనని అనిపిస్తోంది.

కవితపై ఎమ్మెల్యే మాధవరం దారుణ కామెంట్స్

తాజాగా కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణలో తిరగడానికి కవితకు అసలేం హక్కు ఉంది. కేసీఆర్, కేటీఆర్ లను నాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. మర్యాదతో చెబుతున్నానని.. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా మాట్లాడాలి. కవిత మంచిది కాదు కాబట్టే పార్టీ సస్పెండ్ చేసింది. పదేళ్లు అధికారం అనుభవించినప్పుడు ఎందుకు బీసీలు గుర్తుకు రాలేదు. ఢిల్లీలో మంచి పేరున్నమాజీసీఎం కేజ్రీవాల్ ను ఆగం చేసిందెవరు? మేం కబ్జాదారులం.. ఈమె వస్తుంటే భయపడుతున్నామట.. నీ ఆసోంటి కుక్కలు మస్తు వచ్చినయి నాదగ్గరకు.. ’ అంటూ తీవ్రస్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకోసం నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సమయం, సందర్బం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ లోని లూప్ హోల్స్ పై, ఎమ్మెల్యేలపై రియాక్ట్ అవుతూ బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసేలా కవిత వ్యాఖ్యలు ఉంటున్నాయి.

బీఆర్ఎస్ నేతల అవినీతిని కవిత హైలెట్ చేస్తున్నారు. తాజాగా మల్లారెడ్డిని ‘పాల అమ్మిండు, పూలు అమ్మిండు.. భూములు కబ్జా చేసిండు’ అంటూ సంచలనఆరోపణలను కవిత చేసింది. కవిత దూకుడు ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో కవితపై ఎదురుదాడికి బీఆర్ఎస్ డిసైడ్ అయినట్టు సమాచారం. జిల్లాకు ఇద్దరు, ముగ్గురు నేతల చొప్పున ఆ పార్టీనేతలు రెస్పాండ్ అవుతుండడంతో ఇక కవితను బీఆర్ఎస్ టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతోంది

తొలుత జగదీష్ రెడ్డి, ఆ తర్వాత నిరంజన్ రెడ్డి, ఇప్పుడు మాధవరం కృష్ణారెడ్డి వంతైంది. ఈ లెక్కన రానున్న రోజుల్లో కవితపై ఎదురుదాడి తీవ్రతరం ఖానుందనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. చూడాలి మరీ ఏంజరుగుతోందో..