ఇంటింటికీ.. 'మోసం' కిట్లు: బీఆర్ ఎస్ పక్కా వ్యూహం
అన్ని వర్గాలను కలుసుకుని మ ద్దతు కోరడంతోపాటు.. సర్కారుపై వ్యతిరేకత పెంచేదిశగా అడుగులు వేస్తోంది.
By: Garuda Media | 15 Oct 2025 11:00 PM ISTజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో విజయం దక్కించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అన్ని వర్గాలను కలుసుకుని మ ద్దతు కోరడంతోపాటు.. సర్కారుపై వ్యతిరేకత పెంచేదిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా నాలుగు ప్రధాన వ్యూహాలతో ముందుకు సాగాలని తీర్మానించింది. వీటిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి.. ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం.
1) మోసం కిట్లు: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పదే పదే చెబుతున్న బీఆర్ ఎస్ పార్టీ వాటిని ప్రజలకు వివరించనుంది. అయితే.. మౌఖికంగా అయితే.. ఫలితం తక్కువగా ఉంటుందని భావించి.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. ప్రస్తుతం చేస్తున్న పనులను వివరిస్తూ.. పాంప్లెట్లు.. ఇతరత్రా ఒప్పందాలు, సమస్యలతో కూడిన కిట్లను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.
2) బుల్ డోజర్లు: హైడ్రా రాకతో పేదల ఇళ్లను కూల్చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్న బీఆర్ ఎస్.. పేదల ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు అవకాశం ఉన్న ప్రతి అంశాన్నీ వినియోగించుకునేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా హైడ్రా చేసిన తప్పులు.. పేదల ఇళ్ల కూల్చివేత అంశాలను ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారం చేయనుంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయనుంది. అదేవిధంగా పేదల సమస్యలను ప్రస్తావించనుంది.
3) ఆత్మగౌరవం: తెలంగాణ ప్రజలకు కీలకమైన సెంటిమెంటుగా ఉన్న ఆత్మగౌరవాన్ని మరోసారి బీఆర్ ఎస్ ప్రస్తావించనుంది. ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా.. ఢిల్లీలో చర్చలు పెడుతున్నారని.. గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజంలో చర్చ పెట్టారని.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఇదేనని చెప్పనుంది. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారంటూ.. ప్రజల ను చైతన్యం చేయాలని నిర్ణయించుకుంది.
