సుప్రీం తీర్పు సరే.. న్యాయ సలహా తీసుకుంటాం: ప్రసాదరావు
రాష్ట్రపతి మూడు మాసాల్లోనే బిల్లును ఆమోదించాలని.. దాదాపు లక్ష్మణ రేఖ గీసింది. దీనిపై రాష్ట్రపతి 18 ప్రశ్నలతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
By: Garuda Media | 31 July 2025 5:57 PM ISTతాజాగా బీఆర్ ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని మూడు మాసాల్లోనే తేల్చేయాలని పేర్కొంటూ.. సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ''సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందిగా. సరే! న్యాయ సలహా తీసుకుంటాం. న్యాయ నిపుణులతో చర్చించి.. నిర్ణయం తీసుకుంటాం. వెయిల్ చేయండి.'' అని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో ఆయన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గతంలో సుప్రీంకోర్టు తీర్పుపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
''గతంలో సుప్రీంకోర్టు తీర్పుపై అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎలా రియాక్ట్ అయ్యారో.. మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మాకు ఇంకా మూడు మాసాల సమయం ఉంది కదా!. చూస్తాం.. న్యాయ వర్గాలతో చర్చిస్తాం.'' అని గతాన్ని గుర్తు చేశారు. అంటే.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై రివ్యూ పిటిషన్ లేదా.. సభా వ్యవహారాల్లో జోక్యాన్ని కాదంటూ.. పిటిషన్ వేసే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో గవర్నర్, రాష్ట్రపతులు.. బిల్లులు ఆమోదించే విషయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిం ది.
రాష్ట్రపతి మూడు మాసాల్లోనే బిల్లును ఆమోదించాలని.. దాదాపు లక్ష్మణ రేఖ గీసింది. దీనిపై రాష్ట్రపతి 18 ప్రశ్నలతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలావుంటే.. నాటి సుప్రీంకోర్టు తీర్పుపై జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ఈ దేశంలో 'సుప్రీం' అంటే.. పార్లమెంటే. కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు, రాజ్యాంగం.. అల్టిమేట్. ఇప్పుడు న్యాయమూర్తులు శాసనాలు చేస్తారు.(వ్యంగ్యంగా) రేపు కార్యనిర్వాహక పని కూడా చేస్తారు'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలనే ప్రసాదరావు గుర్తు చేశారు.
సో.. దీనిని బట్టి.. జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం.. ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏడాదిన్నర అయిపోయిందని.. ఇప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినా .. కొత్తగా పిటిషన్ వేసినా.. అది మరో ఆరు మాసాలకు కానీ.. తీర్పురాదని అంటున్నారు. సో.. మొత్తంగా ఇప్పట్లో జంపింగ్ ఎమ్మెల్యేలకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీలేదన్నారు.
