Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్ పుట్టిన రోజు.. వేడుకలు ప‌రిమితం.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి.. బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి ఈ నెల 27వ తేదీ(సోమ‌వారం) నాటికి 25 సంవ‌త్స‌రా లు పూర్త‌వుతాయి.

By:  Garuda Media   |   27 April 2026 9:16 AM IST
బీఆర్ ఎస్ పుట్టిన రోజు.. వేడుకలు ప‌రిమితం.. రీజ‌నేంటి?
X

భార‌త రాష్ట్ర‌స‌మితి.. బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి ఈ నెల 27వ తేదీ(సోమ‌వారం) నాటికి 25 సంవ‌త్స‌రా లు పూర్త‌వుతాయి. 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర స‌మితి-టీఆర్ ఎస్ పేరుతో కేసీఆర్‌.. ఏర్పాటు చేసిన ఈ పార్టీ దాదాపు పుష్క‌ర కాలం ప్ర‌త్యేక తెలంగాణ కోసం అలుపెరుగ‌ని ఉద్య‌మం చేసింది.ఈ క్ర‌మంలోనే 2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకార‌మైంది. ఆ త‌ర్వాత‌.. ఇది రాజ‌కీయ పార్టీగా మారి అధికారంలోకి వ‌చ్చింది.

కాగా.. రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక టీఆర్ ఎస్ పార్టీ కాస్తా.. జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పాల‌న్న ఏకైక ఉద్దేశంతో బీఆర్ ఎస్‌గా మారింది. ఇది స‌క్సెస్ కాలేద‌న్న వాద‌న ఉంది. అటు జాతీయ‌స్థాయిలోను.. ఇటు రాష్ట్ర‌స్థాయిలోను కూడా.. పార్టీ ప్ర‌భావం త‌గ్గింది. అధికారం కోల్పోయింది. ఇదిలావుంటే.. ఇప్పుడు 25వ పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌(పుట్టిన రోజు)ను ప‌రిమితంగానే చేయాల‌ని పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింది. గ‌తంలో ఉన్నంత హ‌డావుడి అవ‌స‌రం లేద‌ని పేర్కొంది.

వాస్త‌వానికి పార్టీ ఆవిర్భావం రోజు పెద్ద ఎత్తున బ‌హిరంగ స‌భ‌.. మూడు రోజుల పాటు ప్లీన‌రీ పేరుతో హ‌డావు డి చేసిన ఘ‌ట‌న‌లు గుర్తుండే వుంటాయి. కానీ, ఈ ఏడాది అలాంటిదేమీ లేద‌ని.. స్వ‌యంగా పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ తేల్చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ కార్యాల‌యాల్లో జెండాలు ఎగుర వేయాల‌ని.. నాటి ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్ పాల‌న వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు.

కొద్దిమందికే ప్లీన‌రీ..

పార్టీ కేంద్ర కార్యాల‌యం(జూబ్లీ హిల్స్‌)లో ప‌రిమితంగానే ప్లీన‌రీని నిర్వ‌హిస్తున్నారు. దీనికి ఎంపీలు, ఎమ్మె ల్యేలు, మాజీ మంత్రుల‌ను మాత్ర‌మే ఆహ్వానించారు. కేవ‌లం రెండు వంద‌ల మందితోనే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇలా ప్లీన‌రీని ప‌రిమితం చేయ‌డం వెనుక‌.. మండుతున్న ఎండ‌లే కార‌ణ‌మ‌ని కేటీఆర్ చెబుతున్నారు. కానీ, ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డం.. పైగా క‌విత చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో భారీ ఎత్తున కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ఎందుక‌నే ధోర‌ణి క‌నిపిస్తోంది.