Begin typing your search above and press return to search.

30 సెకన్లలో 195 ముద్దులతో గిన్నిస్ రికార్డ్.. బాగా వేడిముదున్నావ్ బాస్.. ఏంటీ చెలరేగిపోవడం..

ఇక్కడితోనే ఆగని ఈ రొమాంటిక్ కపుల్ త్వరలోనే మరో సరికొత్త లక్ష్యాన్ని కూడా ప్రకటించింది. ఒక నిమిషంలో అత్యధిక ముద్దులు పెట్టిన ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.

By:  A.N.Kumar   |   10 July 2026 10:55 PM IST
30 సెకన్లలో 195 ముద్దులతో గిన్నిస్ రికార్డ్.. బాగా వేడిముదున్నావ్ బాస్.. ఏంటీ చెలరేగిపోవడం..
X

ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్కొక్కరూ ఒక్కో విధానాన్ని ఎంచుకుంటారు. కొందరు మాటలతో మనసు గెలుచుకుంటే మరికొందరు ఆలింగనాలతో ఆప్యాయతను పంచుకుంటారు. అయితే బ్రెజిల్‌కు చెందిన ఒక జంట మాత్రం తమ ప్రేమను ఏకంగా ప్రపంచ రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో ఏకంగా 195 ముద్దులు పెట్టుకుని.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ ఫీట్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రికార్డు ఎలా సాధ్యమైంది?

బ్రెజిల్‌కు చెందిన రెనాటో బేమా తన ప్రేయసి రోబెర్టా రిబీరో బుగ్గపై అత్యంత వేగంగా ముద్దులు కురిపించి ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ రికార్డు ప్రయత్నం బ్రెజిల్‌లోని సావో జోస్ డాస్ కాంపోస్ నగరంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రతినిధుల సమక్షంలో జరిగింది. అనంతరం అంతర్జాతీయ కిస్ డే సందర్భంగా ఈ విజయానికి సంబంధించిన వివరాలను అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. గిన్నిస్ నిబంధనల ప్రకారం ఈ రికార్డు సాధించడం అంత సులువు కాదు. వారు విధించిన కఠినమైన నిబంధనలున్నాయి. ప్రతి ముద్దు పూర్తిగా వేరుగా ఉండాలి. ఒకసారి ముద్దు పెట్టిన తర్వాత పెదవులు బుగ్గ నుండి పూర్తిగా విడిపోవాలి. విరామం లేకుండా తదుపరి ముద్దును అంతే వేగంతో కొనసాగించాలి. ఈ ప్రక్రియ అంతా సరిగ్గా 30 సెకన్లలోనే పూర్తి కావాలి.

ఈ కఠినమైన నియమాలను ఎక్కడా ఉల్లంఘించకుండా రెనాటో అత్యంత వేగంగా 30 సెకన్లలో 195 ముద్దులు పూర్తి చేశారు. అంటే లెక్కగడితే ఆయన సెకనుకు ఆరు కంటే ఎక్కువ ముద్దులు పెట్టారన్నమాట.. ఈ అద్భుతమైన వేగం, సమన్వయం చూసి అక్కడున్న గిన్నిస్ అధికారులు సైతం నోరెళ్లబెట్టారు.

పాత రికార్డులు బద్దలు.. తదుపరి లక్ష్యం అదే

ఇంతకుముందు ఈ రికార్డు ఒక బ్రిటిష్ జంట పేరిట ఉండేది. వారు 30 సెకన్లలో 146 ముద్దులు పెట్టి రికార్డు సృష్టించగా ఈ బ్రెజిల్ జంట ఏకంగా 49 ముద్దుల భారీ తేడాతో ఆ రికార్డును తిరగరాసింది. "చూడటానికి ఇది కేవలం ఒక సరదా రికార్డులా అనిపించినా దీని వెనుక అత్యంత కఠినమైన క్రమశిక్షణ, సమన్వయం, నెలల తరబడి చేసిన ప్రాక్టీస్ ఉన్నాయి." అని గిన్నిస్ ప్రతినిధులు రికార్డును ఆ ముద్దుల మావయ్యా చేతిలో పెట్టారు.

ఇక్కడితోనే ఆగని ఈ రొమాంటిక్ కపుల్ త్వరలోనే మరో సరికొత్త లక్ష్యాన్ని కూడా ప్రకటించింది. ఒక నిమిషంలో అత్యధిక ముద్దులు పెట్టిన ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ రికార్డు జపాన్‌కు చెందిన యోషితా – కుమికో జంట పేరిట ఉంది. వారు ఒక నిమిషంలో 277 ముద్దులు పెట్టి రికార్డు నెలకొల్పారు.

నెటిజన్ల రియాక్షన్.. సోషల్ మీడియాలో వైరల్

ఈ రికార్డు ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రెనాటో, రోబెర్టా మధ్య కనిపించిన అద్భుతమైన కెమిస్ట్రీ, వేగం, ఏకాగ్రత నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. "ప్రేమను ఇంత క్రేజీగా కూడా సెలబ్రేట్ చేయొచ్చా?" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఇంతటి డెడికేషన్ ఉంటేనే ప్రపంచ రికార్డులు సాధ్యమవుతాయి" అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.

ఏది ఏమైనా ప్రేమకు చిహ్నమైన చిన్న ఆప్యాయతను ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డుగా నిలిపిన ఈ బ్రెజిల్ జంటపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.