కొండపై కారు, కారులో జంట, శృం*గార సమయంలో దారుణం..!
అవును... బ్రెజిల్ లో సుమారు 1,300 అడుగుల ఎత్తైన కొండ అంచున ఓ జంట కారును ఆపింది.
By: Raja Ch | 27 Sept 2025 8:00 PM ISTశృం*గారం విషయంలో ఎవరి ఫాంటసీలు వారికి ఉంటాయని అంటారు. ఈ విషయంలో వివరణల సంగతి కాసేపు పక్కన పెడితే... ఎత్తైన కొండపై కారులో శృం*గారం చేస్తున్న జంట విషయంలో మాత్రం ఇటీవల ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటన బ్రెజిల్ లో జరిగింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది!
అవును... బ్రెజిల్ లో సుమారు 1,300 అడుగుల ఎత్తైన కొండ అంచున ఓ జంట కారును ఆపింది. ఆ సమయంలో అంత ఎత్తులో, కారులో శృం*గారం చేయాలని భావించినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో కారు ముందుకు కదిలి కింద పడిపోయింది. అది నేలను ఢీకొన్నప్పుడు సుమారు 100 మీటర్ల దూరంలో ఆ జంట నగ్న మృతదేహాలు కనిపించాయి!
ఈ ఘటనలోని మృతులను అడ్రియానా మచాడో రిబీరో (42), మార్కోన్ డా సిల్వా కార్డోసో (26) గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వెండా నోవా డో ఇమిగ్రెంట్ లో ఒక పార్టీ నుండి తిరిగి వస్తున్న సమయంలో కొండపై కారు ఆపి, సన్నిహితంగా ఉన్నప్పుడు కారు ముందుకు జరిగి బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు!
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో జరిగింది. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక కేర్ టేకర్ ప్రమాదానికి గురైన కారును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
