Begin typing your search above and press return to search.

ఓజీ’ చూస్తూ బ్రెయిన్ సర్జరీ..ఆంధ్రలో అరుదైన ఘటన!

ఆ గడ్డ సాధారణమైన చోట లేదు. మన శరీర కదలికలను, నాడీ వ్యవస్థను కంట్రోల్ చేసే మెదడులోని అత్యంత కీలకమైన భాగానికి చాలా దగ్గరగా ఉంది.

By:  Madhu Reddy   |   6 Jun 2026 1:22 PM IST
ఓజీ’ చూస్తూ బ్రెయిన్ సర్జరీ..ఆంధ్రలో అరుదైన ఘటన!
X

మెదడుకు ఆపరేషన్ అంటేనే గుండె గుభేల్ మంటుంది. అలాంటిది పేషెంట్ స్పృహలో ఉండగానే, తనకు ఇష్టమైన సినిమా చూపిస్తూ డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ అరుదైన 'అవేక్ బ్రెయిన్ సర్జరీ' విశేషాలు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని, థియేటర్‌లో 'OG' సినిమా చూస్తున్నట్లుగా ఆపరేషన్ టేబుల్‌పై సినిమా ఆస్వాదిస్తూ బ్రెయిన్ సర్జరీ చేయించుకుంది. ఆ ఇంట్రెస్టింగ్ వివరాలు మీకోసం.

కోటేశ్వరమ్మకు వచ్చిన సమస్య:

ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఒక్కసారిగా మూర్ఛపోయి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు జిల్లా వడ్లమూడిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా, మెదడులో ఒక పెద్ద గడ్డ ఉన్నట్లు బయటపడింది.

క్లిష్టమైన చోట గడ్డ.. వైద్యుల ప్లాన్:

ఆ గడ్డ సాధారణమైన చోట లేదు. మన శరీర కదలికలను, నాడీ వ్యవస్థను కంట్రోల్ చేసే మెదడులోని అత్యంత కీలకమైన భాగానికి చాలా దగ్గరగా ఉంది. ఇక సాధారణంగా మత్తుమందు ఇచ్చి సర్జరీ చేస్తే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే పేషెంట్ పూర్తి స్పృహలో ఉండగానే ఆపరేషన్ చేసే ‘అవేక్ బ్రెయిన్ సర్జరీ’ చేయాలని డాక్టర్ల టీమ్ డిసైడ్ అయింది.

థియేటర్‌గా మారిన ఆపరేషన్ రూమ్:

సర్జరీ సమయంలో కోటేశ్వరమ్మ భయపడకుండా, ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం ఆమెకు ఇష్టమైన విషయాల గురించి అడగ్గా, తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పింది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ థియేటర్‌లోనే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా వీడియోలను స్క్రీన్‌పై ప్లే చేశారు.

సినిమా చూస్తూ.. డాక్టర్లతో మాట్లాడుతూ..:

కోటేశ్వరమ్మ స్క్రీన్ మీద తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ వీడియోలను, సాంగ్స్‌ను ఎంతో ఇష్టంగా చూస్తూ ఉండిపోయింది. ఇక ఒక పక్క సర్జరీ జరుగుతున్నా, ఆమె ఏమాత్రం కంగారు పడకుండా డాక్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, వారు చెప్పినట్లుగా చేతులు, కాళ్లు కదిలిస్తూ చక్కగా సహకరించింది.

సర్జరీ సక్సెస్.. పవన్ ఫ్యాన్ హ్యాపీ:

డాక్టర్ అరుణ్‌కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ కలిసి చాలా జాగ్రత్తగా మెదడులోని కీలక నరాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఆ గడ్డను విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆసుపత్రి ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

వైద్య రంగంలో సాంకేతికత ఎంత పెరిగినా, పేషెంట్ మానసిక ధైర్యం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ కోటేశ్వరమ్మకు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ 'OG' రూపంలో ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక సినిమా చూపిస్తూ, టెన్షన్ లేకుండా ఇంత పెద్ద సర్జరీని సక్సెస్ చేసిన డాక్టర్ల సమయస్ఫూర్తికి, వినూత్న ఆలోచనకు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.