దయన్నతో 30 ఏళ్ల బంధం.. ఎందుకిలా చేశారో తెలీట్లా: బ్రహ్మానందం
సినీ హాస్యబ్రహ్మ.. బ్రహ్మానందం తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న కామెంట్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
By: Garuda Media | 24 Nov 2025 9:14 AM ISTసినీ హాస్యబ్రహ్మ.. బ్రహ్మానందం తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న కామెంట్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ``ఇలా ఎందుకు చేశారో అర్ధంకావట్లా?`` అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓ సెల్ఫీ వీడి యోను బ్రహ్మానందం పంచుకున్నారు. దీనిలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకు డు ఎర్రబెల్లి దయాకర్‌తో తనకు ఉన్న సంబంధం, అనుబంధం గురించి చెప్పారు. తనకు దయాకర్‌కు మధ్య 30 ఏళ్లుగా స్నేహం ఉందని.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మని చెప్పారు. అలాంటి వ్యక్తిని తాను ఎలా తృణీకరిస్తానని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నవ్వు తెప్పించిందన్నారు.
ఏం జరిగింది?
డైలాగ్ కింగ్ మోహన్‌బాబు సినీ రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు అయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని `ఎంబీ-50` పేరు తో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బ్రహ్మానందం కూడా ఇచ్చారు. ఇక, ఇదే ఫంక్షన్‌కు దయాకర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. అయితే.. బ్రహ్మానందంతో దయాకర్ సెల్ఫీ తీసుకోవాలిన భావించారు.కానీ, బ్రహ్మా నందం ఒప్పుకోలేదు.ఇప్పుడు కాదు.. అంటూ వడివడిగా అక్కడి నుంచి వేదికపైకి వెళ్లారు. అయితే.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దయాకర్‌ను తోసేసిన బ్రహ్మీ! అంటూ కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది.
తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బ్రహ్మానందం.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. దీనిలో ఆయన దయాకర్ విషయాన్ని ప్రస్తావించారు. ఆయనను `దయన్న` అని సంబోధిస్తూ.. ఆయనతో తనకు 30 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. ఇద్దరం సొంత సోదరుల మాదిరిగా ఉంటామన్నారు. ఎంబీ-50 వేడుకలకు రావడం అప్పటికే ఆలస్యమైందని.. అయినా.. దయాకర్‌తో కలిసి తాను చాలా సేపు మాట్లాడనని, ఇంతలో ఆయన సెల్ఫీ కావాలని కోరిన మాట వాస్తవమేనన్నారు. కానీ, ఇప్పటికే లేటైందని.. ఇప్పుడు సెల్ఫీ ఏంటి అంటూ.. నేను లోపలికి వెళ్లిపోయాను. కానీ, ఈవిషయంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇది సరికాదు. అని బ్రహ్మీ అన్నారు.
ఇక, ఈ సోషల్ మీడియా ప్రచారంపై తాను, దయాకర్ కూడా చర్చించుకున్నామని బ్రహ్మీ తెలిపారు. అయితే.. ఇద్దరం నవ్వుకున్నామని.. దయాకర్‌తో ఉన్న చనువు కొద్దీ తాను ఆయనతో ఇప్పుడెందుకు..అని వ్యాఖ్యానించానని.. కానీ, తాను దయాకర్ ను తోసేసినట్టు ప్రచారం చేస్తున్నారని.. ఇది సరికాదని బ్రహ్మానందం చెప్పారు. దీనిపై దయాకర్‌తోనూ తాను మాట్లాడినట్టు చెప్పారు. అయితే.. తనను తప్పుగా అర్ధం చేసుకున్న విషయాన్ని దయాకర్ చెప్పారని వ్యాఖ్యానించారు.
