Begin typing your search above and press return to search.

లక్ష డాలర్ల వీసా ఫీజు వేసే ట్రంప్ కు భారతీయుడు షాక్ ఇవ్వగలడా?

మరి.. ముఖ్యంగా భారత్ మీద అదే పనిగా విరుచుకుపడుతున్న అతగాడికి సరైన రీతిలో బుద్ది చెప్పే అవకాశం భారత ప్రభుత్వం కంటే కూడా భారత ప్రజల మీదనే ఉందని చెప్పాలి.

By:  Garuda Media   |   20 Sept 2025 10:20 AM IST
లక్ష డాలర్ల వీసా ఫీజు వేసే ట్రంప్ కు భారతీయుడు షాక్ ఇవ్వగలడా?
X

అక్కడెక్కడో అమెరికాలోని వైట్ హౌస్ లో కూర్చొని.. ప్రపంచ దేశాల తలరాతల్ని ఇష్టారాజ్యంగా రాస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సరైన రీతిలో బుద్ది చెప్పే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. ఏంది నీ మాటలు.. ఏంది నీ కత అని ఇట్టే విరుచుకుపడేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. ట్రంప్ తీరును జాగ్రత్తగా గమనిస్తే.. మన దేశంలోని పెత్తాందార్లు.. తెలుగు రాష్ట్రాల్లో దొరలు.. భూస్వాములు.. ఇలా చెప్పుకునేటోళ్లలో కనిపించే లక్షణాలు కనిపిస్తాయి. అగ్రరజ్యాధినేతగా అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పెద్ద మనిషి.. తన దేశం మాత్రమే మొదటి స్థానంలో ఉండాలని ఆశించటం వరకు తప్పేం కాదు. ఆ పేరుతో ప్రపంచ దేశాలకు అదే పనిగా షాకులు ఇస్తున్న వైనాన్ని మాత్రం ఎందుకు ఒప్పుకోవాలన్నది ప్రశ్న.

మరి.. ముఖ్యంగా భారత్ మీద అదే పనిగా విరుచుకుపడుతున్న అతగాడికి సరైన రీతిలో బుద్ది చెప్పే అవకాశం భారత ప్రభుత్వం కంటే కూడా భారత ప్రజల మీదనే ఉందని చెప్పాలి. దీని కోసం పెద్ద పెద్ద నినాదాలు చేయాల్సిన అవసరం లేదు. నిరసనలు చేపట్టాల్సిన పని లేదు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు కొనుగోలు చేసే వస్తుల్ని.. ఒక్క క్షణం.. ఇది అమెరికన్ కంపెనీదా? కాదా? అన్నది ఒక్కసారి చెక్ చేసుకుంటే.. కొనుగోలు చేసే వస్తువులు.. వస్తు సేవలకు సంబంధించి అమెరికా సంస్థకు చెందింది కాకుండా.. దాని ప్రత్యామ్నాయ కంపెనీల ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటం ద్వారా.. దారికి తేవచ్చు.

ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు. అన్ని విషయాలు అంకెలు మాత్రమే మాట్లాడతాయి. వ్యాపారాలు.. వ్యాపార ప్రయోజనాలకు నొప్పి కలిగేలా చేస్తే.. పాలకులు సైతం చచ్చినట్లుగా దారికి రాక మానదు. అందునా అగ్రరాజ్యం అమెరికాలో ఇండస్ట్రీ లాబీ చాలా పవర్ ఫుల్. వారు తమ ప్రయోజనాలకు భంగం కలిగితే.. అదే ప్రభుత్వమైనా అస్సలు ఒప్పుకోరు. ఇలాంటి వేళ.. ట్రంప్ తో డైరెక్టుగా మాట్లాడే కన్నా.. భారతీయులు ఐకమత్యంగా అమెరికన్ ఉత్పత్తుల వినియోగంపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటే సరి.

అక్కడెక్కడో ఉన్న ట్రంప్.. మన జీవితాల్ని దెబ్బ తీసేలా సుంకాల షాక్ ఇవ్వగలడు. వ్యక్తిగా అతగాడు తీసుకున్న నిర్ణయాన్ని.. భారతీయులంతా ఉమ్మడి ఒక మాట అనుకున్నట్లుగా అమెరికన్ ఉత్పత్తులు.. అమెరికన్ వస్తుసేవల వినియోగం మీద అప్రకటిత బ్యాన్ ఎవరికి వారు విధించుకుంటే.. మూడు నెలల్లో దాని తీవ్రత అన్ని కంపెనీలకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరగాలో అది జరిగిపోతుంది. కాకుంటే.. భారతీయులంతా ఒకే మాట మీద ఉన్నట్లుగా అమెరికన్ కంపెనీల వస్తుసేవల్ని కొనుగోలు చేసే వేళలో తగిన జాగ్రత్తలు తీసుకొని..వాటికి దూరంగా ఉంటే సరి.

పిచ్చి పట్టినట్లుగా కొనుగోలు చేసే ఆపిల్ ఫోన్.. మైక్రోసాఫ్ట్.. గూగుల్.. అమెజాన్..నెట్ ఫ్లిక్స్..ఇంటెల్ చిప్ లు ప్రాసెసర్లు లాంటివి అమెరికాకు చెందినవే. ఇక్కడ మీరు అడగొచ్చు. మైక్రోసాఫ్ట్ లేకుండా సాధ్యమా? అని. నిజమే.. అన్నింటిని ఒకే గాటున కట్టేయలేం. అందుకే మైక్రోసాఫ్ట్ కు మినహాయింపు ఇవ్వొచ్చు. ఆపిల్ ఫోన్ కొనకపోతే ప్రాణం పోతుందా? అమెజాన్ లోనే ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా? ఫ్లిప్ కార్డులో ఇవ్వొచ్చు కదా?

మరో ఉదాహరణగా చెప్పాలంటే ఓలా.. ఊబర్ లనే తీసుకుంటే.. ఊబర్ అమెరికన్ కంపెనీ. దానికి బదులుగా ఓలా ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దాన్ని వినియోగిస్తే సరిపోతుంది. ఇక్కడ చెప్పేదేమంటే.. అమెరికాను వ్యతిరేకించటం.. అమెరికన్ వస్తువుల్ని వాడకూడదన్నది పంతమేం కాదు. ఎడా పెడా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే ట్రంప్ కు షాకివ్వటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశమన్నది మర్చిపోకూడదు. అందుకే.. అవకాశం ఉన్న వస్తువుల్ని.. వస్తుసేవల్ని వినియోగించే విషయంలో అమెరికా ఉత్పత్తులకు కాస్త దూరంగా.. . కొంతకాలం ఉండగలిగితే.. సగటు భారతీయుడి శక్తి వైట్ హౌస్ కు తెలిసే వీలుంది. సుంకాలు.. ఎడాపెడా నిర్ణయాలతో భారతీయు జీవితాల్ని అదే పనిగా కెలికేసే ట్రంప్ కు.. సగటు భారతీయుడు రిటర్న్ గిఫ్టు ఇచ్చే అవకాశం లేదా? అంటే.. ఎందుకు లేదనే సమాధానం టక్కున వస్తుంది.

టెక్నాలజీ

ఆపిల్

మైక్రోసాఫ్ట్

గూగుల్

అమెజాన్

ఇంటెల్

సిస్కో

ఆటోమోటివ్

ఫోర్డ్

టెస్లా

జనరల్ మోటార్స్

జీప్

ఆహారం - డ్రింక్స్

కోకాకోలా కు చెందిన కోక్, స్పైట్.. థమ్స్ అప్.. మజా, పెప్సీ, లేస్, డోరిటోస్ (స్నాక్స్)

పెప్సీ, స్లైస్ మరిన్ని

మెక్ డొనాల్డ్స్ కు చెందిన బర్గర్ లు.. ఫ్రెంచ్ ఫ్రూస్ ఇతర ఫాస్ట్ ఫుడ్

స్టార్ బక్స్ కాఫీ.. టీ.. బేక్డ్ ఐటెమ్స్

కెల్లాగ్స్ స్నాక్

పిజ్జా హట్

బర్గర్ కింగ్

కేఎఫ్ సీ

ఫ్యాషన్ & దుస్తులు

నైక్

లివిస్

టామీ హిల్పిగర్

కెల్విన్ క్లైన్

ఫరెవర్ 21

రాబర్ట్ లారెస్

రోజువారీ జీవితంలో వినియోగించే ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు బ్రాండ్లు

జిల్లెట్

కోల్గేట్ పామోలివ్

అమ్వే

విర్ల్ పూల్

ఫెడెక్స్

ఆహార ఉత్పత్తులు

లేస్

కెల్లాగ్స్

హెర్షీస్

ఎం అండ్ ఎస్

చిప్స్ అహోయ్

షూస్

నైక్

స్ట్రెచర్స్

అండర్ ఆర్మర్

న్యూ బ్యాలెన్స్

సాకానీ

బ్రూక్స్ స్పోర్ట్స్

క్రోక్స్

కాన్వర్స్

వాన్స్

కోల్ హాన్

స్టీవ్ మాడెన్ టామ్స్

టింబర్ ల్యాండ్

కీన్

టూత్ పేస్టులు

కాల్గేట్

సెన్సోడైస్

ఓరల్ బి

కాఫీ & టీ

స్టార్ బక్స్

డన్ కిన్

లిఫ్టన్

టాజో

నూమీ

హోనెస్ట్ టీ

ఓటీటీ

నెట్ ఫ్లిక్స్

అమెజాన్ ప్రైమ్

డిస్నీ హాట్ స్టార్

ఆపిల్ టీవీ

పేకాక్ టీవీ

హెచ్ బీవో మ్యాక్స్

సూపర్ మార్కెట్లు

వాల్ మార్ట్

క్యాష్ అండ్ క్యారీ

అమెజాన్ ఫ్రెష్ (ఆన్ లైన్ లో ఎక్కువ)

కార్లు - టూవీలర్లు

ఫోర్డ్స్ (ప్రస్తుతం భారత్ లో లేదు)

టెస్లా

షెవర్లే

హార్లే డేవిడ్ సన్

ఇండియన్ మోటార్ సైకిల్

ట్రెక్

ఫోన్లు

ఐఫోన్

మోటరోలా

మోటో జీ

గూగుల్ పిక్సెల్

చాక్లెట్లు

క్యాడ్ బరీ (నిజానికి ఇదొక బ్రిటిష్ కంపెనీ. అయితే ప్రస్తుతం ఇది అమెరికాకు చెందిన మోండెలెజ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ చేతిలో ఉంది. 2010లో దీన్ని అమెరికన్ కంపెనీ కొనుగోలుచేసింది)

ఓరియో

కేబ్లర్

హెర్షీస్

స్నికర్స్ రీసెస్

మార్స్

వాషింగ్ పౌడర్

టైడ్

ఏరియల్

వంట నూనెలు

జెమిని

నేచర్ ఫ్రెష్

లియోనార్డో (ఆలివ్ ఆయిల్)

స్వీకార్

రథ్ (వనస్పతి)

డాల్డా (వనస్పతి) మరెన్నో

ప్రోక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ ఉత్పత్తులు)

ఏరియల్ వాషింగ్ పౌడర్ ఉత్పత్తి చేసే సంస్థకు బోలెడన్ని ఉత్పత్తలు ఉన్నాయి. కొన్నింటి గురించి చెబితే

ప్యాంపర్స్ (పిల్లల శానిటరీ నాప్ కిన్)

విస్పర్ (శానిటరీ నాప్ కిన్)

జిల్లెట్ (రేజర్)

హెడ్ అండ్ షోల్డర్స్ (షాంపూ)

పాంటీన్ (హెయిర్ కేర్ ఉత్పత్తులు)

విక్స్

ఓరల్ బి

అంబి ప్యూర్

ఓలే

ఓల్డ్ స్పైస్ (డియోడరెంట్లు)

హెర్బల్ ఎసెన్సెస్

ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉత్పత్తులు మనం రోజువారీగా వాడేవి అమెరికన్ సంస్థలకు చెందినవే. మీ ఇల్లు మా ఇంటికి దూరమో.. మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం భయ్ అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం భారతీయుల మీద ఉంది. లేదంటే.. అదే పనిగా సుంకాలు.. వీసా ఫీజులు అంటూ ఏదో ఒక దడుపు కార్యక్రమాన్నిచేపడుతూ ఉంటారు. ప్రభుత్వం పరంగా కంటే.. వ్యక్తుల పరంగా ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ అభిరుచుల్లో కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ.. అమెరికన్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల్ని వాడటం మొదలు పెడితే.. దాని ప్రభావం మనకు అల్లంత దూరాన ఉన్న వైట్ హౌస్ కు ఇట్టే కమ్యునికేట్ అవుతుంది.