జగన్ పార్టీలో జెట్ ఫైటర్... పవన్ పై బోరుగడ్డ సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా... అలా హింసించొచ్చని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది అని ప్రశ్నించిన ఆయన... జైల్లో ఉన్న సీసీ కెమెరాలో తనను చూస్తూనే ఉన్నారన్ని తెలిపారు!
By: Raja Ch | 21 Dec 2025 10:06 AM ISTగత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రధానంగా పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు తనపై విపరీతమైన కోపమని.. తనను చంపాలని చూసిందే పవన్ కల్యాణ్ అని బోరుగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి.
అవును... ఒక గంట టైమ్ ఇస్తే చంద్రబాబు, లోకేష్ లను లేపేస్తా అంటూ గత ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ తనను చంపాలని చూశారని.. ఆయనకు తనపై తీవ్రమైన కోపం ఉందని తెలిపారు. అయితే తనపై ఆయనకు ఎందుకు అంత కక్ష అనేది మాత్రం తెలియదని అన్నారు.
కస్టోడియల్ టార్చర్ ఇలా జరిగింది..!:
ఇదే సమయంలో జైల్లో తనను థర్డ్ డిగ్రీలో భాగంగా ఎలా హింసించిందీ చెప్పుకొచ్చారు బోరుగడ్డ అనీల్! తనను విపరీతంగా కస్టోడియల్ టార్చర్ పెట్టారని అన్నారు. ఇందులో భాగంగా... తన చేతులకు బేడీలు వేసి, వేలాడ దీసుకుంటూ.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కర్నూలు త్రీ టౌన్ స్టేషన్ వరకూ సుమారు 14:30 గంటలు తూఫాన్ కారులో రాడ్ కి వేళాడ దీసుకుంటూ వెళ్లారని బోరుగడ్డ తెలిపారు.
ఈ సందర్భంగా... అలా హింసించొచ్చని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది అని ప్రశ్నించిన ఆయన... జైల్లో ఉన్న సీసీ కెమెరాలో తనను చూస్తూనే ఉన్నారన్ని తెలిపారు! జైల్లో తాను కానిస్టేబుల్ ని ఒక టీ అడిగితే... మిమ్మల్ని డైరెక్ట్ గా డీజీపీ, పవన్ కల్యాణ్, లోకేష్ వాచ్ చేస్తున్నారని.. మీరు మాతో మాట్లాడితే మా ఉద్యోగాలు పోతాయని చెప్పారని బోరుగడ్డ తెలిపారు. కర్నూలు త్రీ టౌన్ స్టేషన్ లో తనను విపరీతంగా కొట్టారని అన్నారు.
కోర్టులో జడ్జి ముందు తనను సబ్ మిట్ చేసిన తర్వాత... తిరిగి మళ్లీ స్టేషన్ కు తీసుకొచ్చారని.. అప్పుడు మళ్లీ థర్డ్ డిగ్రీ ఇచ్చి, అర్ధరాత్రి మళ్లీ జైలుకు తీసుకెళ్లారని.. ఆ సమయంలో తాన్ను కళ్లు తిరిగి పడిపోయాయని బోరుగడ్డ తెలిపారు. తనను పైకి వేళాడదీసి కొడుతున్న సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తో తన వృషణాలపై తన్నించారని బోరుగడ్డ వెల్లడించారు. ఈ క్రమంలో ఓ సారి సరిగా దెబ్బ తగలలేదని.. రెండోసారి కూడా కొట్టించారని అన్నారు.
జగన్ పార్టీలో జెట్ ఫైటర్!:
ఈ సందర్భంగా... తాను జగన్ పార్టీలో జెట్ ఫైటర్ ని అని.. అంబేడ్కర్ పెట్టిన రిపబ్లికన్ పార్టీలో తాను పనిచేస్తున్నానని.. తాను వైసీపీ మద్దతుదారుడిని అని.. జగన్ వీరాభిమానినని.. ఆయన ప్రియ శిష్యుడిని అని అంబేద్కర్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి చెబుతున్నట్లు బోరుగడ్డ చెప్పుకున్నారు. ఇదే సమయంలో తనను 22 కేసుల్లో 245 రోజులు జైలు జీవితం అనుభవించినట్లు వెల్లడించారు.
కొసమెరుపు!:
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కన్వర్టెడ్ క్రీస్టియన్ అని.. ఆయన బాప్తీస్మం తీసుకున్నారని.. బాప్తీస్మం తీసుకున్నప్పుడు దేవుని వాక్యానికి లోబడి బ్రతకాలని.. ఆయన రోజూ బైబిల్ చదువుతారని.. మోకాళ్లపై ఉండి ప్రార్థన చేస్తారని అన్నారు. పైగా.. ఒక నటుడిగా పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని బోరుగడ్డ చెప్పడం కొసమెరుపు. ఇంటర్మీడియట్ టైం లో తాను పవన్ సినిమా టిక్కెట్స్ కొని పంచానని చెప్పుకొచ్చారు.
