Begin typing your search above and press return to search.

ఎద అందాలతో చెమటలు పట్టిస్తున్న అనన్య పాండే.. హీటెక్కిపోతున్న కుర్రాళ్లు!

ఈ చిత్రానికి సమీర్ విధ్వాన్స్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ 'ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్' పై భారీ బడ్జెట్ తో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

By:  Madhu Reddy   |   16 Sept 2025 9:31 AM IST
ఎద అందాలతో చెమటలు పట్టిస్తున్న అనన్య పాండే.. హీటెక్కిపోతున్న కుర్రాళ్లు!
X

అనన్య పాండే.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో చేసింది ఒక సినిమానే అయినా నిత్యం ఏదో ఒక రూమర్ తో వార్తల్లో నిలుస్తోంది ఈ చిన్నది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' అనే సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే డిజాస్టర్ ని అందుకున్న ఈమె.. ఇటీవల 'కేసరి చాప్టర్ 2' సినిమాలో నటించి, తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి 'తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ 'అనే చిత్రంలో నటిస్తోంది.


ఈ చిత్రానికి సమీర్ విధ్వాన్స్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ 'ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్' పై భారీ బడ్జెట్ తో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇకపోతే అనన్య - కార్తిక్ ఆర్యన్ కాంబినేషన్లో ఇదివరకే బ్లాక్ బస్టర్ మూవీ 'పతి పత్నీ ఔర్ ఓ ' అనే చిత్రం తర్వాత వీళ్ళిద్దరూ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆ సినిమాతో వీరిద్దరికి మంచి గుర్తింపు రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడిగా పేరు సొంతం చేసుకున్న ఈ జోడి.. ఇప్పుడు మళ్ళీ తెరపై కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.


ఇకపోతే ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 13వ తేదీన రిలీజ్ చేస్తామని మొదట మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రీ పోన్ చేస్తూ ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీనా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అటు సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే రోజుకు ఒక గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.


అందులో భాగంగానే తాజాగా బ్లాక్ వన్ పీస్ డ్రెస్ ధరించి అందర్నీ మెస్మరైజ్ చేసింది అనన్య పాండే. సైడ్ నుండి ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను హీటెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాదు సైడ్ యాంగిల్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈమె.. ఈ బ్యాక్ సైడ్ నుంచి వీపు మొత్తం కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఇంత గ్లామర్ ను ఒకేసారి చూసేసరికి అభిమానులు, ఫాలోవర్స్ , నెటిజన్సు అందరూ కూడా ఈమె అందంపై కవిత్వాలు వల్లుతున్నారు. మొత్తానికి అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.