Begin typing your search above and press return to search.

యోబేలో మిలిటెంట్లు మారణ హోమం..శవాల దిబ్బగా మారిన గ్రామం..

ప్రపంచం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్న ఇంకా కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలు ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2024 12:30 AM GMT
యోబేలో మిలిటెంట్లు మారణ హోమం..శవాల దిబ్బగా మారిన గ్రామం..
X

ప్రపంచం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్న ఇంకా కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలు ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి వాటిలో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.ఎప్పటినుంచో ఉగ్రవాద చర్యల వల్ల సతమతమవుతున్న ఆఫ్రికన్ దేశం నైజీరియాలో మరొక భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.ఈశాన్య రాష్ట్రం యోబేలో బొకోహరమ్ మిలిటెంట్లు చేసిన ఘోరమైన దాడి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అత్యంత కిరాతకమైన ఈ ఘటన లో ఎంత మంది చనిపోయారు అన్న విషయం పై ఇంకా క్లారిటి లేదు.

గ్రామాలపై విరుచుకుపడ్డ మిలిటెంట్లు కనికరం లేకుండా.. చిన్న పెద్ద తేడా చూడకుండా కన్పించినవారిని కన్పించినట్లుగా నిర్ధాక్షణంగా కాల్చి చంపారు. ఈ దాడిలో సుమారు 100 మందికి పై ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం మోటార్ సైకిళ్లపై వచ్చిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు యోబేలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలోదాడికి పాల్పడ్డారు. మార్కెట్ల దగ్గర నుంచి ప్రార్ధనా స్థలాల వరకు అన్నింటి పై దాడి చేశారు.

ఇళ్లల్లోకి చొరబడి మరి కాల్పులు జరిపారు.అంతటితో ఆగకుండా భవనాలను నిప్పుబెట్టి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం కలిగించారు. ఈ అమానుషమైన దాడికి బొకోహరమ్ ఇస్లామిక్ సంస్థే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో చనిపోయిన 102 మృతదేహాలను పోలీసులు

గుర్తించగా..ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసుల అంచనా. ఈ దాడి వెనుక అసలు కారణం కక్ష సాధింపు చర్య అని తెలుస్తోంది.

బొకోహరమ్ కు సంబందించిన కార్యకలాపాల గురించి పోలీసులకు ఈ ప్రాంతం వారు సమాచారం అందించారు అనే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయి. ఇటీవల బొకోహరమ్ గురించి యోబే గ్రామస్తులు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు చాలా మంది బొకోహరమ్ సభ్యులను హతమార్చారు. అందుకే ఈ ప్రతీకార దాడులు జరిగాయి అని తెలుస్తోంది. గ్రామంలో బొకోహరమ్ గ్యాంగ్ మారణహోమం సృష్టించిన విధానం అత్యంత భయంకరంగా ఉంది.