Begin typing your search above and press return to search.

ఇదో నీలం కోడిగుడ్డు.. నిజాలు బయటపెట్టిన అధికారులు!

సాధారణంగా ఎక్కడైనా సరే కోడిగుడ్డు కలర్ ఏంటి అంటే అందరూ టక్కున చెప్పేది వైట్ కలర్ మాత్రమే.

By:  Madhu Reddy   |   28 Aug 2025 3:28 PM IST
ఇదో నీలం కోడిగుడ్డు.. నిజాలు బయటపెట్టిన అధికారులు!
X

సాధారణంగా ఎక్కడైనా సరే కోడిగుడ్డు కలర్ ఏంటి అంటే అందరూ టక్కున చెప్పేది వైట్ కలర్ మాత్రమే. కొన్ని కోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో.. మరికొన్ని కాస్త లేత పసుపు రంగులో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే గుడ్డు కలర్ మాత్రం ఇప్పటివరకు ఏ కోడి పెట్టి ఉండదు. ఎందుకంటే ఈ కోడి ఇప్పటివరకు మనం ఎక్కడా వినని కలర్లో గుడ్డు పెట్టింది. ఆ కోడి పెట్టిన గుడ్డు కలర్ ఏంటంటే..బ్లూ కలర్.. అవును మీరు వినేది నిజమే. నీలం రంగులో ఓ కోడి గుడ్డును పెట్టిందట. మరి బ్లూ కలర్ లో గుడ్డు పెట్టిన ఆ కోడి ఏ రాష్ట్రానికి చెందింది. గుడ్డు తెలుపు కాకుండా నీలం రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి? దీనిపై పరిశోధన జరిపిన అధికారులు ఎలాంటి కామెంట్స్ చేశారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా బ్లూ కలర్ లో గుడ్డు పెట్టిన కోడికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరి జిల్లా నల్లూరు గ్రామంలో ఉండే సయ్యద్ నూర్ చాలా రోజుల నుండి కోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర 10 నాటు కోళ్లు ఉన్నాయట. అయితే సడన్ గా తన దగ్గర పెంచే నాటు కోళ్లలో ఒక కోడికి సంబంధించి ఒక వింత అనుభవం ఎదురయ్యిందట. అదేంటంటే.. ప్రతిరోజు తెలుపు రంగులో గుడ్డు పెట్టే ఆ కోడి ఒకరోజు నీలం రంగులో గుడ్డు పెట్టిందట. అయితే ఇదేంటి కోడిగుడ్డు ఇలా నీలం రంగులో ఉంది అని ఆయన మొదట ఆశ్చర్యపోయి ఇంట్లో వాళ్ళందరికీ చూపించారట. ఆ తర్వాత ఇదేదో వెరైటీ గుడ్డులా ఉంది అని ఆ గుడ్డుని తీసి జాగ్రత్తగా భద్రపరిచారట. అయితే ఈ విషయం ఇంటి పక్క వాళ్ళ నుండి ఊరంతా వ్యాపించి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సయ్యద్ ఇంట్లో ఉండే ఆ నీలి రంగు గుడ్డు చూడడానికి పోటెత్తారట.

ఆ నోటా ఈ నోటా పాకి విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఈ గుడ్డు గురించే చర్చించుకుంటున్నారు. అలా చివరికి జంతు సంరక్షణ అధికారులకు కూడా ఈ విషయం తెలియడంతో వాళ్లు ఆ గుడ్డును పరిశీలించి షాకింగ్ విషయం బయట పెట్టారు.కొన్నిసార్లు కోళ్లు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లను పెట్టడం చూసాం. కానీ ఇలా బ్లూ కలర్ లో ఉండే గుడ్డును చూడడం ఇదే మొదటిసారి అంటూ వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా కోడి క్లోమంలో ఉండే బిలివర్డిన్ అనే వర్ణ ద్రవ్యం కారణంగా ఈ కోడి నీలిరంగులో ఉండే గుడ్డును పెట్టినట్టు తమ అభిప్రాయాన్ని చెప్పారు.

కొన్ని కొన్ని కోళ్లలో జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి వింత రంగులో ఉండే గుడ్లను కూడా పెడుతుంటాయని తెలియజేశారు. అంతేకాకుండా ఈ గుడ్లు మిగతా గుడ్ల కంటే స్పెషల్ ఏమీ కావని, కేవలం రంగు మాత్రమే వింతగా ఉంటుంది. మిగతా గుడ్డు లాగే ఈ గుడ్డులో కూడా పోషక విలువలు అన్ని సేమ్ ఉంటాయి అని చెప్పారు.అయితే ఇలాంటి నీలిరంగు గుడ్లు పెద్ద వింతేమీ కాదు అంటున్నారు కొంతమంది. ఎందుకంటే అమెరికా, లాటిన్ వంటి దేశాలలో ఇప్పటికే ఇలాంటి రంగులో ఉండే గుడ్లను చాలా కోళ్లు పెడతాయట. కోళ్ల క్లోమంలో బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉండడం వల్లే ఈ రంగులో ఉండే గుడ్లు పెడతాయని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నీలిరంగు గుడ్డు పెట్టి వార్తల్లోకెక్కింది కర్ణాటకకి చెందిన ఈ కోడి.