బ్లింకిట్ కొత్త ఫీచర్.. వినియోగదారులకు బంపర్ ఆఫర్
ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే కావాల్సిన వస్తువుల్ని ఇట్టే తెప్పించుకునే ఆన్ లైన్ ప్లాట్ ఫాం బ్లింకిట్.
By: Garuda Media | 4 Dec 2025 2:00 PM ISTఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే కావాల్సిన వస్తువుల్ని ఇట్టే తెప్పించుకునే ఆన్ లైన్ ప్లాట్ ఫాం బ్లింకిట్. మెరుపు వేగంతో వస్తువుల్ని డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల్లో బ్లింకిట్ ఒకటి. తాజాగా తమ వినియోగదారుల నుంచి వస్తున్న సూచనల్ని పరిగణలోకి తీసుకున్న బ్లింకిట్ కొత్త ఫీచర్ ను తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమంటే.. ఏదైనా ఆర్డర్ పెట్టిన తర్వాత.. ఒకట్రెండు వస్తువుల్ని మర్చిపోతే.. మళ్లీ కొత్తగా ఆర్డర్ పెట్టాల్సిందే.
అయితే.. ఇలాంటి సమయాల్లో అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అదేమీ లేకుండా.. బ్లింకిట్ లో ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత.. ఆ వస్తువుల్ని ప్యాక్ చేసే లోపు కానీ.. తాము మర్చిపోయిన వస్తువుల్ని పాత ఆర్డర్ లోనే యాడ్ చేసే వెసులుబాటును తీసుకొచ్చారు. తాము తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ను బ్లింకిట్ సీఈవో అల్బీందర్ దిండ్సా తాజాగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఈ ఫీచర్ తో అదనంగా యాడ్ చేసిన వస్తువులకు ఎలాంటి వస్తువుల డెలివరీకి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సి ఉండదు. గత నెలలో బ్లింకిట్ కీలక ఫీచర్ అందుబాటులోకి తేవటం తెలిసిందే. చిన్నవయసు వారు కొన్ని ప్రత్యేక క్యాటగిరీలకు చెందిన వస్తువుల్ని ఆర్డర్ చేయటానికి వీల్లేని విధంగా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీంతో.. పిల్లలు పెట్టే ఆర్డర్ మీద కొంత నియంత్రణ ఉండేలా చేసింది.
తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ కూడా వినియోగదారులకు పెద్ద ఎత్తున సాయం చేస్తుందని చెప్పాలి. ఆర్డర్ లో మర్చిపోయిన వస్తువుల్ని యాడ్ చేసుకునే ఈ ఫీచర్ కూడా యూజర్లకు ఉపయోగంగా ఉంటుందని చెప్పాలి. తాము తీసుకొచ్చిన ఫీచర్ మీద ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిందిగా బ్లింకిట్ సీఈవో కోరారు. యూజర్లకు ప్రయోజనం కలిగించే ఫీచర్లతో మరింత ఆదరణ పొందొచ్చని చెప్పాలి.
