Begin typing your search above and press return to search.

జాబ్ చేయడమే యమ డేంజర్

ఉద్యోగం మనిషి లక్షణం అంటారు కదా ఎందుకు ఈ మాట అని ఎవరికైనా సందేహం రావచ్చు.

By:  Satya P   |   1 Jan 2026 9:33 AM IST
జాబ్ చేయడమే యమ డేంజర్
X

ఉద్యోగం మనిషి లక్షణం అంటారు కదా ఎందుకు ఈ మాట అని ఎవరికైనా సందేహం రావచ్చు. అయితే సంప్రదాయ ఉద్యోగాలు ఇపుడు తగ్గిపోతున్నాయి. డే అండ్ నైట్ చేసే జాబ్స్ ఉంటున్నాయి. అందునా సాఫ్ట్ వేర్ రంగంలో చూసుకుంటే ఉద్యోగాలు బాగానే ఉంటాయని చేరుతున్నారు. కానీ గట్టిగా నలభై ఏళ్ళు రాకుండానే కూసాలు కదిలిపోయి సాంతం పడకేస్తున్నారు. కూర్చున్న సీటు నుంచి ఏ మాత్రం కదలికలు లేకపోవడంతో ఊబకాయం అధిక బరువు తీవ్రమైన ఒత్తిళ్ళు ఇలా అనేక శారీరక మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు అని అంటున్నారు.

డాక్టర్ చెప్పిన నిజం :

ఇదిలా ఉంటే పొగ తాగడం కంటే కూడా తీవ్ర ఒత్తిడి ఉద్యోగాలే యమ డేంజర్ అని ఒక డాక్టర్ చెప్పారుట. దానిని తన బ్లైండ్ యాప్‌లో స్వీయ అనుభవంగా పంచుకున్న ఓ టెక్కీ సంచలన విషయమే జనాలకు చేరవేశాడు. తన మీద పడిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సదరు టెక్కీ చెప్పడం గమనార్హం. ఈ విషయం మీద డాక్టర్ ని సంప్రదిస్తే చేసే ఉద్యోగానికి వెంటనే నిలుపుదల చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అని చెప్పుకొచ్చాడు. తాను ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను అని తన మొత్తం ఆరోగ్యం పరిశీలించిన డాక్టర్ అయితే ధూమపానం కంటే ప్రమాదకరమని తనను హెచ్చరించినట్లుగా చెప్పుకొచ్చాడు.

టెక్కీలలో టెన్షన్ :

ఇదిలా ఉంటే అనారోగ్యం పాలు అయిన టెక్కీ పెట్టిన పోస్టుతో మొత్తం టెక్ వరల్డ్ ఊగుతోంది. టెక్ వర్గాలు సైతం దీని మీద కలవర పడుతున్నాయి. ఇదిపుడు పూర్తి స్థాయిలో వైరల్ అవుతోంది. ఆ టెక్కీ సమస్య చూస్తే గతంలో ఆందోళన తగ్గేందుకు మందులు వాడాడట. ఇప్పుడు దు అధిక బరువుతో వెళ్ళాడని దానిని గమనించిన మీదటనే డాక్టర్ డేంజర్ లో నీ హెల్త్ పడింది అని వార్నింగ్ సీరియస్ గా ఇచ్చాడని అంటున్నారు.

సమస్యలు ఇవే :

ఇక ఆ టెక్కీలో ఆరోగ్య సమస్యలు చూస్తే విధి నిర్వహణలో ఉన్నపుడు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్ చెప్పారని పేర్కొన్నాడు. ఆరోగ్యం సెట్ కావాలీ అంటే వెంటనే ఆ డ్యూటీకి గుడ్ బై కొట్టి విశ్రాంతి తీసుకోవాలని సూచించారుట. ఇక ఒత్తిడి ఎక్కువగా ఉంటే అది గుండె కణాల్లో వాపును కలిగిస్తుందని, అలాగే ప్రమాదకరమైన అణువులను విడుదల చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీవక్రియకు సంబంధించిన అనేక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. మంచి పని వాతావరణం ఉండాలని శారీరకంగా మానసికంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.