Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సుల్లో ఇక బ్లాక్ బాక్స్

ఒక ప్రమాదం జరిగింది అంటే దాని వెనక కారణాలు తెలియాలి. తెలిస్తేనే దానిని అదుపు చేసేందుకు వీలు ఉంటుంది.

By:  Satya P   |   5 Nov 2025 7:00 AM IST
ఆర్టీసీ బస్సుల్లో ఇక బ్లాక్ బాక్స్
X

ఒక ప్రమాదం జరిగింది అంటే దాని వెనక కారణాలు తెలియాలి. తెలిస్తేనే దానిని అదుపు చేసేందుకు వీలు ఉంటుంది. అయితే తరచూ ఆర్టీసీ బస్సులలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రమాదం సమయంలో ఏమి జరిగిందో ఎవరికీ తెలియడం లేదు, ప్రయ్తక్ష సాక్షులు చెప్పాల్సిందే. బస్సు వేగం ఎంత ఏ విధంగా వెళ్తున్నారు. గేర్లు మార్చడం కానీ ఎక్స్ లేటర్ చేసిన విధానం కానీ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తరచూ జరుగుతున్న ప్రమాదాల వల్లనే ఈ ఆలోచనలు వస్తున్నాయి.

బ్లాక్ బాక్స్ కోసం :

విమానాలలో బ్లాక్స్ బాక్స్ ఉంటుంది. విమానం కూలిపోయినా ప్రమాదం ఎలా జరిగింది, ఇందులో తప్పు ఎవరిది ఏమిటి అన్నది స్పష్టంగా తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఆ తరహా ఇబ్బందులను అధిగమించేందుకు కూడా ఇది దోహదపడుతుంది. ఇపుడు అలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడాని ఆర్టీసీ అధికారులు ఆలోచన చేస్తున్నారు. అంటే బ్లాక్ బాక్స్ ని ఆర్టీసీ బస్సులలో ఇక మీదట ఏర్పాటు చేస్తారు అన్న మాట.

ప్రమాదాల వెల్లువ :

ఏమిటో ఇపుడు అంతా బస్సు ప్రమాదాల సీజన్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఇవే వార్తలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. తెల్లారి లేస్తే ఏ బస్సు గురించి ఏ వార్త వినాలో అర్ధం కావడం లేదు అంటున్నారు. కేవలం ఈ పది రోజుల కాలంలోనే అరవై మంది దాకా బస్సు ప్రమాదాలలో మరణించారు. దాంతో ఆర్టీసీలో ఒక బ్లాక్ బాక్స్ వ్యవస్థ ఉండాలని గట్టిగానే నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు.

అన్నీ ట్రాక్ అవుతాయి :

బ్లాక్ బాక్స్ ని బస్సులలో అమరిస్తే కనుక అన్నీ ట్రాక్ అవుతాయి. డ్రైవర్ ఎంత వేగంతా బస్సుని నడుపుతున్నాడు దగ్గర నుంచి ఇంధన పొదుపు దాకా మొత్తం రికార్డు అవుతాయి. ఇక మీదట దీనిని ఆధారం చేసుకునే డ్రైవర్లకు గ్రేడింగులు కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. పది పాయింట్లకు ఆరు లోపు వస్తే ఆ డ్రైవర్లు సరిగ్గా బస్సులు నడపనట్లుగా లెక్క వేస్తారు. ఆ మీదట వారి విషయంలో చర్యలు తీసుకునే చాన్స్ ఉంది. ఇక తెలంగాణాలో ఏపీలో దీని మీద ఫోకస్ పెడుతున్నారు అంటున్నారు.

వేగానికి కళ్ళెం :

అశోక్ లేల్యాండ్ సంస్థ ఇంజనీర్లు ఇప్పటికే ఈ బ్లాక్ బాక్స్ పరికరం ఉపయోగించే విధానం మీద డిపో మేనేజర్లు, ఆర్టీసీ భద్రతా అధికారులు, మెకానికులకు అవగాహన కల్పిస్తున్నారు అని అంటున్నారు. అన్నీ అయిన తరువాత ఈ సంచలన కీలక నిర్ణయం అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. బ్లాక్స్ బాక్స్ కనుక బస్సులో ఉంటే ఒక పర్యవేక్షణ ఉంటుంది. తమను గమనిస్తున్నారు అంటే కచ్చితంగా డ్రైవర్లు కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలా వేగానికి కళ్ళెం పడుతుంది, అదే సమయంలో గేరు మార్చి జోరు పెంచే వారికి షాక్ ట్రీట్మెంట్ గా ఉంటుంది అని అంటున్నారు.