Begin typing your search above and press return to search.

ముదురుతున్న బీకే వర్సెస్ పీకే

ఈ బీకే ఏమిటి పీకే ఏమిటి డౌట్ రావచ్చేమో. బీకే అంటే బాలక్రిష్ణ పీకే అంటే పవన్ కళ్యాణ్.

By:  Satya P   |   29 Sept 2025 1:13 AM IST
ముదురుతున్న బీకే వర్సెస్ పీకే
X

ఈ బీకే ఏమిటి పీకే ఏమిటి డౌట్ రావచ్చేమో. బీకే అంటే బాలక్రిష్ణ పీకే అంటే పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరూ సినీ నటులూ కం రాజకీయ నాయకులు కదా పైగా కూటమిలో మిత్రులు కదా ఎందుకు వీరి మధ్య వివాదం వస్తుంది అని కూడా అనుకోవచ్చు. తాజాగా ఏపీ అసెంలీలో జరిగిన పరిణామాలు కనుక ఒక్కసారి పరిశీలిస్తే అందరికీ అవే అర్థం అవుతాయి. బాలయ్య పీకేని ఏమీ అనలేదు. కానీ ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని మాత్రం అనాల్సినవి సెటైరికల్ గా అన్నారు. దాంతోనే అగ్గి రాజుకుంది. అది కాస్తా బీకే వర్సెస్ పీకేగా మారిపోయింది. దానికి సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. అక్కడ బీకే ఫ్యాన్స్ పీకే ఫ్యాన్స్ పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు.

ఎందాకా వచ్చిందంటే :

సోషల్ మీడియా పోస్టులలో భయంకరమైన సంగ్రామమే సాగుతోంది. వారిని వీరు వీరిని వారు అనాల్సినవి అనేసుకుంటున్నారు. అవి ఎంతదాకా వచ్చిందంటే ఏకంగా పొత్తులు పొత్తు ధర్మాలు ఇలా చాలానే మాటలు దొర్లేస్తున్నాయి. ఈ వార్ లో పొలిటికల్ డైలాగులు పేలుతున్నాయి. అవి ఎక్కడ నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే సున్నితమైనది సినిమా అలాగే రాజకీయం బయటకు గట్టిగా కనిపించిన అందులో ఎన్నో సున్నితమైన రేకులు ముడివేసుకుని ఉంటాయి. ఇపుడు వాటి మీద ఏ మాత్రం దెబ్బ పడినా ఇబ్బంది టోటల్ గా కూటమికే అవుతుంది అని అంటున్నారు.

ఇక తగ్గండి అంటూ :

బాలయ్య అభిమానులకు ఒక స్వీట్ వార్నింగ్ హాట్ గానే పీకే ఫ్యాన్స్ ఇచ్చేశారు. మీరు బాగా తగ్గాలని కూడా వారికి సూచించారు. అలా కనుక చేయకపోతే తాము స్టార్ట్ చేస్తామని ఆ మీద పొత్తు ధర్మం ఉండదు తొక్క ధర్మం ఉండదు అని హెచ్చరించారు. దీంతో వివాదం సరికొత్త మలుపు తీసుకున్నట్లు అయింది. అంటే ఏపీలో కూటమి పార్టీల మధ్య పొత్తులను కూడా ఖాతరు చేయకుండా ఎంతదాకా వెళ్ళాలో అంతదాకా వెళ్తామని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది అని అంటున్నారు

బాలయ్య తప్పు లేదంటూ :

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బాలయ్య అసెంబ్లీలో మాటలను పెడుతూ ఆయనది తప్పు లేదని చెబుతున్నారు. బాలయ్య డేరింగ్ హీరో అని కొనియాడుతున్నారు. ఆయన అఖండ సినిమాకు ఎవరి వద్దకూ పోలేదని టికెట్లు పెంచకుండానే కరోనా టైం లో సినిమా ఆడించి సూపర్ సక్సెస్ కొట్టారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఆయనను సపోర్టు చేసే క్రమంలో మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకుని వచ్చిన పీకే ఫ్యాన్స్ ఈ హెచ్చరికలు చేస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే మెగా ఫ్యాన్స్ కూడా బాలయ్య మీద హాట్ కామెంట్స్ చేస్తూంటే వాటికి కౌంటర్లు బాలయ్య ఫ్యాన్స్ వేస్తోంది అని అంటున్నారు.

పోస్టింగులతో మంటలు :

మొత్తం మీద చూస్తే ఈ సోషల్ మీడియా వార్ హీటెక్కించేలా సాగుతోంది. కూటమికి పై స్థాయిలో ఇబ్బంది లేకపోయినా దిగువ స్థాయిలో మాత్రం ఐక్యతను దెబ్బ తీసేలా ఉందని అంటున్నారు. ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ఇది పెరిగి పెద్దది అవుతుందని అపుడు కష్టమే అన్న భావన ఉంది. ఏది ఏమైనా బీకే వర్సెస్ పీకే వార్ చాలా కాలం తరువాత అంతా చూస్తున్నారు. ఈ మధ్య దాకా అంతా ఒక్కటిగానే ఉంటూ సపోర్టు చేసుకున్నారు. ఈ మధ్యనే పీకే ఓజీ సినిమా కోసం అఖండ టూ మూవీని బాలయ్య వాయిదా వేసుకుని వెనక్కి వెళ్ళారని కూడా గ్రీట్ చేసిన వారూ ఉన్నారు. అయితే అపార్ధాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సోషల్ మీడియా పోస్టింగులతో మంటలు రేగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దల మీదనే ఉంది అని అంటున్నారు.