Begin typing your search above and press return to search.

బీజేపీకి తమిళనాడు గేట్లు క్లోజేనా ?

తమిళనాడులో బీజేపీ అధికారం అన్నది నెవర్ అని డీఎంకే అంటోంది. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే చాలా సీరియస్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు.

By:  Satya P   |   16 Dec 2025 10:33 AM IST
బీజేపీకి తమిళనాడు గేట్లు  క్లోజేనా ?
X

దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ విస్తరణ అన్నది మోడీ అమిత్ షా కొంత వరకూ చేయగలిగారు కానీ పూర్తి స్థాయిలో మాత్రం అది సాగడం లేదు, మెల్లగా కర్ణాటకలో పాగా వేసారు. 2018 నుంచి 2023 వరకూ అధికారంలో ఉన్నారు. అయితే మరో రాష్ట్రంలో అధికారం అందుకునే దరి దాపులలో కూడా బీజేపీ ఈ రోజున లేకపోవడమే కమల విలాపం అని అంటున్నారు. తెలంగాణాలో 2028 మిషన్ అని పెట్టుకున్నా ఇపుడు అక్కడ కూడా ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే పొత్తు పార్టీగానే ఉంటోంది.

తమిళనాడులో ఎలా :

ఇక తమిళనాడు అంటేనే ఎన్నో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలకు అలాగే మఠాలకు పీఠాలకు ఆలవాలంగా ఉంటుంది బీజేపీ హిందూత్వ కార్డు మాత్రం అక్కడ ఎందుకో వర్కౌట్ కావడం లేదు. అన్నా డీఎంకేతో మైత్రీబంధం కొన్ని సీట్లను తెచ్చుకునేలా చేస్తోంది కానీ అధికారంలో భాగం అయ్యేలా కూడా దారి చూపించడం లేదు. ఈ నేపధ్యంలో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో చేరి తన బలాన్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. అందుకే అన్నా డీఎంకేతో కలసి పొత్తులతో ముందుకు సాగుతోంది. అయితే మధ్యలో కొత్తగా విజయ్ టీవీకే పార్టీ వచ్చింది. ఇక అధికార డీఎంకే సైతం బలంగానే ఉంది. దాంతో ఈ ట్రయాంగిల్ ఫైట్ లో అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఎలా నెగ్గుకుని వస్తుంది అన్నదే చర్చగా ఉంది.

నెవర్ అంటున్న డీఎంకే :

తమిళనాడులో బీజేపీ అధికారం అన్నది నెవర్ అని డీఎంకే అంటోంది. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే చాలా సీరియస్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీకి తమిళనాడులో ఏ మాత్రం చోటు లేదని తేల్చేశారు. ఎక్కడైనా మీకు ఓకే ఏమో కానీ తమిళనాడులో మాత్రం అసలు కుదరదు అంటూ గేట్లు క్లోజ్ చేశారు ఆయన ఇంతలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అమిత్ షా చేసిన ప్రకటన అని అంటున్నారు. ఇక తమ తరువాత టార్గెట్ తమిళనాడు అని అమిత్ షా తాజాగా చేసిన ప్రకటనకు అంతే స్ట్రాంగ్ గా స్టాలిన్ రిప్లై ఇచ్చారు అన్న మాట.

రాజకీయ సన్నివేశం :

ఇక తమిళనాడులో చూస్తే విజయ్ పార్టీ టీవీకేకి జనాదరణ ఉంది. అయితే అది గెలిచే స్థాయిలో లేదు, అలాగే అన్నాడీఎంకేకి క్యాడర్ బేస్ ఉంది కానీ ఇమేజ్ ఉన్న నాయకులు లేరన్న లోటు ఉంది. బీజేపీకి చూస్తే క్యాడర్ కూడా పెద్దగా లేదు, లీడర్లు ఉన్నా అంత దూకుడు ప్రదర్శించే వారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2026 మేలో కనుక అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార డీఎంకే యాంటీ ఓట్లు చీలి మరోసారి స్టాలిన్ సీఎం అయ్యే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు అయితే ఉన్నాయి. ఇక రెండవ అతి పెద్ద పొలిటికల్ ఫోర్స్ గా విజయ్ టీవీకే పార్టీ ఆవిర్భవించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు అయితే బీజేపీ ఆశలు చూస్తే విజయ్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కకుండా ఉన్న నేపథ్యంలో తమ కూటమి మద్దతుతో ప్రభుత్వం వచ్చే చాన్స్ ఉందేమో అన్నట్లుగా చూస్తున్నారని అంటున్నారు.

స్టాలిన్ ధీమా :

ఇకపోతే సీఎం స్టాలిన్ ధీమా కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎన్నో ఎన్నికలకు ఆయన చూసి ఉన్నారు. ఈసారి డీఎంకే మీద ఉన్న వ్యతిరేకత ఏదైనా చీలిపోతుంది. పైగా తమ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత అయితే లేదని ఆయన భావిస్తున్నారు. అన్నా డీఎంకే 2021 కంటే కూడా ఇపుడు ఇంకా బలహీనపడిందని ఊహిస్తున్నారు. బీజేపీకి పెద్దగా బలం లేదని ఆ పార్టీతో జతకట్టి అన్నా డీఎంకే ఇంకా వీక్ అయిందని కూడా లెక్క వేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కొత్త పార్టీతోనే పోరు ఉంటుందని డీఎంకే భావిస్తోంది అయితే విజయ్ పార్టీకి సంస్థాగతంగా బలం పెద్దగా లేదు, దాంతో టీవీకే ఇబ్బందులు దానికి ఉన్నాయి ఇవన్నీ వెరసి తమకు కంఫర్టబుల్ మెజారిటీతో మరోసారి జనాలు పట్టం కడతారని స్టాలిన్ లెక్క వేసుకుంటున్నారు. అందుకే బీజేపీని తమిళనాడులోకి రానీయమని సవాల్ చేస్తున్నారు.