Begin typing your search above and press return to search.

రాజ్యసభలో బీజేపీ విశ్వరూపం... అలెర్ట్ కావాల్సిందే ?

రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉంటే మెజారిటీ అక్కడ సాధించాలీ అంటే 123 మంది ఉండాలి. బీజేపీ ఇపుడు దేశంలో మూడింట రెండు వంతుల రాష్ట్రాలలో ఉంది.

By:  Satya P   |   28 April 2026 4:00 AM IST
రాజ్యసభలో బీజేపీ విశ్వరూపం... అలెర్ట్ కావాల్సిందే ?
X

బీజేపీ చాలా నైస్ గా ఆప్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేసింది. ఇంట గెలవాలన్నది ఏ రాజకీయ పార్టీ నేర్చుకోవాల్సిన సత్యం అని ఆప్ ద్వారా అన్ని పార్టీల అధినాయకత్వాలకు కమలం పార్టీ చెప్పకనే చెప్పేసింది. అంతా బాగుంది. ఆల్ ఈజ్ వెల్ మనతోనే అంతా అనుకుంటూ ధీమాగా కూర్చున్నా లేక ఎవరి పని వారిదే అని ప్రమత్తంగా ఉన్నా కూడా జరిగేది ఏమిటో ఆప్ అనుభవం ఒక అచ్చమైన ఉదాహరణ. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆప్ బలం కాస్తా ఒక్కసారిగా పది నుంచి మూడుకు పడిపోయింది. ఏడుగురు ఎంపీలు వెళ్ళి బీజేపీలో చేరిపోయారు. దాంతో రాజ్యసభలో మూడింట రెండు వంతుల మంది ఎంపీలతో బీజేపీలో ఆప్ విలీనం అయిపోయింది. ఇక ఆ ముగ్గురూ మాత్రమే ఆప్ కి చెందిన వారు, ఇలా ఏ రకమైన ఫిరాయింపు బెడదా లేకుండా ఒవర్ నైట్ చీపురుని వదిలేసి కమలం పువ్వుని ఆప్ మాజీ నేతలు పట్టుకున్నారు.

ఫుల్ మెజారిటీతో :

రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉంటే మెజారిటీ అక్కడ సాధించాలీ అంటే 123 మంది ఉండాలి. బీజేపీ ఇపుడు దేశంలో మూడింట రెండు వంతుల రాష్ట్రాలలో ఉంది. దాంతో ఆ పార్టీకి రాజ్యసభలో బలం బాగా పెరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ నాటికి బీజేపీకి సొంతంగా 113 మంది ఎంపీలు రాజ్యసభలో ఉంటారు. అదే సమయంలో ఆప్ నుంచి విలీనం అయిన ఏడుగురు ఎంపీలు కలిస్తే ఆ నంబర్ 120 కి చేరుకుంటుంది ఇక ఫుల్ మెజారిటీకి చేరువ అయ్యేందుకు మూడంటే మూడు సీట్లే తక్కువ అవుతాయి. అఫ్ కోర్సు రాజ్యసభలో ఎన్డీయే మిత్రుల బలం కూడా బీజేపీకి కలసి వస్తుంది అయితే సొంత మెజారిటీ కోసమే బీజేపీ చూస్తుంది అని అంటున్నారు.

వైసీపీకి నలుగురు :

ఈ నేపథ్యంలో వైసీపీకి రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న ఏడుగురు ఎంపీలలో జూన్ తరువాత మిగిలేది నలుగురు. ఎందుకంటే వైసీపీ నుంచే ముగ్గురు ఈ దఫా రిటైర్ అవుతున్నారు. దాంతో ఆ నలుగురుతో రాజ్యసభలో వైసీపీ ఉండబోతోంది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి మేడ రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావుల పదవీ కాలం 2030 దాకా ఉంటే నిరంజన్ రెడ్డి పదవీ కాలం 2028 దాకా ఉంది. ఇక బీజేపీకి 2029 ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి.

రాజ్యాంగ సవరణ :

బీజేపీకి పార్టీ సిద్ధాంతం పరంగా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. జమిలి ఎన్నికలు ఉనీఫాం సివిల్ కోడ్ ఇపుడు మహిళా బిల్లు డీలిమిటేషన్ వంటివి. ఇలా బీజేపీ ఉభయ సభలలో తమ బలాన్ని చాటుకోవాల్సి ఉంది. అంతే కాదు రాజ్యాంగ సవరణలకు కూడా చాలా చేయాల్సి ఉంది. మహిళా బిల్లుని డీలిమిటేషన్ తో ముడి పెడుతూ ఈ మధ్య లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయింది. అయితే మరోసారి ఈ బిల్లు సభ ముందుకు రావచ్చు. ఈ నేపధ్యంలో రాజ్యసభలో ఎంత ఎక్కువ మంది ఎంపీలు తన పార్టీకి ఉంటే అంత మేలు అన్నది బీజేపీ ఆలోచనగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఆప్ నుంచి భారీగా ఎంపీలను తెచ్చి విలీనం చేసుకున్నారు. రేపటి రోజున ఇదే పరిస్థితి వైసీపీ వంటి పార్టీలకు రాకుండా ఉంటుందా అన్న చర్చ ఊంది. వైసీపీని రాజ్యసభలో విలీనం చేసుకోవాలంటే ముగ్గురు ఎంపీలను తిప్పుకుంటే చాలు అని అంటున్నారు. సరిగ్గా బీజేపీకి ఆ ముగ్గురు ఎంపీల అవసరమే ఫుల్ మెజారిటీకి ఉంది. ఇక వైసీపీకి నలుగురు ఎంపీలవుతారు అంటే మరింతగా చిన్న పార్టీ అవుతుంది. దాంతో వైసీపీకి రాజకీయంగా రాజ్యసభలో ఇబ్బందులు కొత్తగా ఎదురవుతాయా లేక అక్కడ వైసీపీ ఎటూ మద్దతు ఇస్తుందని భావించి ఆగుతారా అన్నది చూడాల్సి ఉంది.

ఆ పార్టీలకు కూడా :

ఇక ఒడిషాలో చూస్తే బీజేడీకి ఆరుగురు ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. వీరందరి పదవీ కాలం రెండేళ్ళ నుంచి నాలుగేళ్ళ దాకా ఉంది. అలాగే తెలంగాణాలో బీఆర్ఎస్ కి ముగ్గురు ఎంపీలు ఉన్నారు వీరిలో ఇద్దరి పదవీ కాలం 2028లో ముగిస్తే మరొకరి పదవీ కాలం 2030 దాకా ఉంది. దీంతో ఆప్ కి భారీ షాక్ బీజేపీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పార్టీలు కూడా అలెర్ట్ కావాల్సిందే అన్న చర్చ అయితే సాగుతోంది. విలీనం ముప్పు ఏ వైపు నుంచి ఏ పార్టీకి ఉంటుందో చూడాల్సి ఉందని అంటున్నారు.