Begin typing your search above and press return to search.

జన సంఘ్ నుంచి బీజేపీ దాకా.... అమ్ముల పొదిలో లక్ష్యాలు

భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం జన సంఘ్ అన్నది తెలిసిందే. జన సంఘ్ ని అప్పటి దేశ తొలి ప్రధాని నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా ఉన్న డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖరీ స్థాపించారు.

By:  Satya P   |   20 Jan 2026 12:45 PM IST
జన సంఘ్ నుంచి బీజేపీ దాకా.... అమ్ముల పొదిలో లక్ష్యాలు
X

భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం జన సంఘ్ అన్నది తెలిసిందే. జన సంఘ్ ని అప్పటి దేశ తొలి ప్రధాని నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా ఉన్న డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖరీ స్థాపించారు. ఆయనే తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన 1950 నుంచి 54 వరకూ కొనసాగారు. కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని ఆందోళన చేస్తూ కాశ్మీర్ లోనే అనుమానస్పద తీరులో ఆయన మరణించారు ఆయన తరువాత రెండవ ప్రెసిడెంట్ గా జనసంఘ్ కి మౌలి చంద్ర శర్మ నియమితులు అయ్యారు. ఆయన తరువాత ప్రేమ నాధ్ డోగ్రా, ఆచార్య దేవ్ ప్రసాద్ ఘోష్, పీతాంబర్ దాస్ వంటి వారు పనిచేశారు. ఇక జన సంఘ్ లో తొలిసారిగా తెలుగు ప్రాంతానికి చెందిన అవసరాల రామారావు 1961లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.




వీరంతా అదే నేపథ్యం :

జన సంఘ్ కి అధ్యక్షులుగా ఉన్న వారు అంతా హిందూత్వ నినాదంతో పాటు ఆర్ ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ తో కూడిన వారు కావడం విశేషం. ఇక ఈ వరసలో రఘు వీర్ , బచ్రాజ్ వ్యాస్, బాలరాజ్ మధోక్, పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి వారు భారతీయ జన సంఘ్ కి నాయకత్వం వహించారు. ఆ తరువాత జన సంఘ్ ని జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలు అన్నీ కలసి జనతా పార్టీగా ఏర్పడ్డారు. అలా 1977లో అధికారంలోకి వచ్చారు. అయితే జనతా ప్రయోగం విఫలం కావడంతో అందులో నుంచి వేరుపడిన జన సంఘ్ నేతలు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. దానికి మొదటి అధ్యక్షుడిగా వాజ్ పేయి ఎన్నిక అయ్యారు.

గ్రాఫ్ పెరిగిన తీరు :

ఇక బీజేపీకి ఎల్ కే అద్వాని ప్రెసిడెంట్ అయ్యాక గ్రాఫ్ బాగా పెంచారు. ఆయన తరువాత మురళీ మనోహర్ జోషీ, కుశభవ్ థాక్రే, బంగారు లక్ష్మణ్, జనా క్రిష్ణ మూర్తి, ఎం వెంకయ్యనాయుడు, రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ, అంతిత్ షా జేపీ నడ్డా ప్రెసిడెంట్లు అయ్యారు. బీజేపీ నుంచి పన్నెండవ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ తాజాగా ఎన్నిక అయ్యారు. ఈ మొత్తం అధయక్షుల పనితీరు చూసినా వారి ఎంపిక చూసినా నేపధ్యం చూసినా ఒక విషయం అర్ధం అవుతుంది.

అట్టడుగు స్థాయి నుంచి :

బీజేపీ అధ్యక్షులుగా నెగ్గిన వారు అనేక మంది అట్టడుగు స్థాయి నుంచి పార్టీలో ఎదిగి వచ్చిన వారు కనిపిస్తారు. దానికి ఎం వెంకయ్యనాయుడు బంగారు లక్ష్మణ్ ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంది ఎంతో మంది పార్టీ కోసం దిగువ స్థాయిలో పనిచేస్తూ అత్యున్నత శిఖరాన్ని చేరుకున్నారు కుటుంబ వారసత్వాలు ప్రాంతీయ సమీకరణలు ఏ ఇతర రాజకీయ ప్రభావాలు లేకుండా బీజేపీ తన అధ్యక్షులను ఎంపిక చేసుకుంటుంది.

ప్రతీ మూడేళ్ళకు :

బీజేపీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్ళు ఉంటుంది. ఆ ప్లేస్ లో మరొకరిని ఎన్నుకుంటారు. ఒకరికి రెండు సార్లు మాత్రమే వరసగా చాన్స్ దక్కుతుంది. అయితే తరువాత కాలంలో మళ్ళీ చేపట్టే వీలు ఉంది. అలా జన సంఘ్ లో కానీ బీజేపీలో కానీ ఎక్కువ సార్లు సారధ్య బాధ్యతలు వహించిన వారుగా వాజ్ పేయ్, అద్వానీ, రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా జేపీ నడ్డా కనిపిస్తారు. వీరంతా ఎక్కువ కాలం పనిచేశారు. జన సంఘ్ నుంచి చూస్తే బీజేపీది 76 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం. తన అజెండాను కలలను సాకారం చేసుకుంటూ దేశంలో కాంగ్రెస్ కి ఆల్టర్నేషన్ గా ఎదగడంలో బీజేపీ నూటికి తొంబై శాతం విజయవంతం అయింది అని చెబుతారు. ఇంకా బీజేపీ అమ్ముల పొదిలో మరి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని కాలానుగుణంగా అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ రోజున ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది అన్నది వాస్తవం.