బీజేపీ కొత్త అధ్యక్షుడు... ఆర్ఎస్ఎస్ చాయిస్ ?
బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లో ఒక చర్చగా సాగుతోంది. ఎందుకంటే బీజేపీ అధికార పార్టీ. కేంద్రంలో వరసగా మూడు సార్లు గెలిచిన పార్టీ.
By: Satya P | 14 Dec 2025 2:00 AM ISTబీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లో ఒక చర్చగా సాగుతోంది. ఎందుకంటే బీజేపీ అధికార పార్టీ. కేంద్రంలో వరసగా మూడు సార్లు గెలిచిన పార్టీ. అలాంటి పార్టీకి అధ్యక్షుడు అంటే అది ఆసక్తిని కలిగించే వార్త గానే చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ నియమావళిని అనుసరించి ఎవరైనా రెండు సార్లు మొత్తంగా చూస్తే వరుసగా నాలుగేళ్ళకు మించి ఆ పదవిలో ఉండరాదని అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న జేపీ నడ్డా మాత్రం గత అయిదారేళ్ళుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల ముందే ఆయన ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ అన్నారు. కానీ అది జరగలేదు, ఎన్నికలు ముగిశాక కూడా ఇంత కాలం పట్టింది. ఇపుడు ఈ కీలక పదవి కోసం కొత్త పేరు వినిపిస్తోంది. అదే ఒక కేంద్ర మంత్రి పేరు. ఆయన ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్
రేసులో ముందుకే :
ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన మూలాలు ఆర్ఎస్ఎస్ నుంచే ఉన్నాయని చెబుతారు. ఆయన తండ్రి దేబేంద్ర ప్రధాన్ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1999 నుండి 2004 వరకు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజ్యసభ లోక్ సభల నుంచి పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో కళాశాలలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో సభ్యునిగా ఉండేవార్రు. ఆయన 1983లోనే ఏబీవీపీ సెక్రెటరీగా ఎన్నికయ్యాడు. ఇక భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు చేపట్టిన తర్వాత ఆయన 14వ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలకు ధర్మేంద్ర ప్రధాన్ చాలా సన్నిహిత నేతగా పేరుంది.
ఆయన అయితేనే బెటర్ :
ఇక బీజేపీకి చెందిన ప్రస్తుతం ఉన్న జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈసారి ఒడిషాకు చాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. దాంతో పాటుగా కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ సమర్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీలో అందరికీ ఇష్టులు గా పేరు పొందారు దాంతో ఆయన పేరు పార్టీ అంతర్గత చర్చలలో సైతం ముందు వరసలో ఉందని అంటున్నారు.
ఆర్ఎస్ఎస్ మౌనం :
ఇక బీజేపీ సంస్థాగత వ్యవహారాలలో ఆర్ఎస్ఎస్ ముద్ర జోక్యం బాగా ఉంటాయని ప్రచారం అయితే ఉంది. కానీ ఈ మధ్యనే ఆ సందేహాలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తీర్చేశారు. తమకు బీజేపీ రాజకీయాలతో సంబంధం లేదని ఎవరు ప్రధానిగా ఉండాలి ఎవరు పార్టీ ప్రెసిడెంట్ గా ఉండాలి, ఎవరు ఎంత కాలం పదవిలో ఉండాలి అన్నది బీజేపీ ఇష్టమే అని మోహన్ భగవత్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక మోడీ ప్రధానిగ 75 ఏళ్ళకే దిగిపోవాలన్న దాని మీద కూడా ఆయన స్పష్టత ఇచ్చేశారు. బీజేపీ వారు ఆయనను ఎంత కాలం కోరుకుంటే అంతకాలం ఆయనే ఉండొచ్చు అని కూడా చెప్పేశారు.
బీజేపీ అభీష్టమేనా :
ఈ నేపథ్యంలో బీజేపీ తన రాజకీయ వ్యూహాల ప్రకారమే కొత్త అధ్యక్షుడి ఎంపిక చేస్తుంది అని అంటున్నారు. ఈ క్రమంలో అనేక పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి. కానీ చివరికి ధర్మేంద్ర ప్రధాని పేరు ఖరారు అయ్యే సూచనలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి కొత్త ఏడాది మొదట్లోనే బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చు అని కూడా తెలుస్తోంది చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో.
